Pakistan New PM Shehbaz Sharif: పాకిస్తాన్‌లో ఊహించిన పరిణామమే జరిగింది. ప్రధాని ఇమ్రాన్ ఖాన్ పదవీచ్యుతుడయ్యారు. ప్రతిపక్షాలు ప్రవేశపెట్టిన అవిశ్వాస తీర్మానం ఓటింగ్ జరిగితే తన ఓటమి ఖాయమని ఇమ్రాన్ భయపడ్డట్లుగానే జరిగింది. శనివారం స్పీకర్, డిప్యూటీ స్పీకర్ రాజీనామా చేశారు. కానీ పాక్ అత్యున్నత న్యాయస్థానం సూచన మేరకు శనివారం అర్ధరాత్రి దాటిన తరువాత పార్లమెంట్ దిగువ సభలో ఓటింగ్ నిర్వహించగా ఇమ్రాన్ ఖాన్ కు వ్యతిరేకంగా 174 ఓట్లు రావడంతో పాక్ ప్రభుత్వం కూలిపోయింది. పాకిస్తాన్ తెహ్రీక్ ఈ ఇన్సాఫ్ సభ్యులు కొందరు ఓటింగ్‌ను బహిష్కరించడంతో అధికార పక్షానికి ఓట్లు తక్కువగా పడ్డాయి. అయితే తదుపరి పాక్ ప్రధాని ఎవరనే దానిపై చర్చ జరుగుతోంది.


పాక్‌కు మూడు పర్యాయాలు ప్రధానమంత్రిగా సేవలు అందించిన నవాజ్ షరీఫ్ తమ్ముడు, పాక్‌ నేషనల్ అసెంబ్లీలో ప్రతిపక్షనేత షెబాజ్ షరీఫ్ తదుపరి ప్రధాని రేసులో ముందున్నారు. సోమవారం నాడు కొత్త ప్రధాని కోసం ఓటింగ్ జరగనుంది. పాకిస్తాన్ ముస్లిం లీగ్ (Pakistan Muslim League (N) కీలక నేత షెబాజ్ షరీఫ్ పాక్ కొత్త ప్రధాని అవుతారని ఆ పార్టీ నేతలు చెబుతున్నారు. మరోవైపు అవిశ్వాస తీర్మానంలో అధికార పక్షానికి వ్యతిరేకంగా వచ్చిన ఓట్లు తమకు అనుకూలమైనవని.. నవాజ్ షరీఫ్‌నకు భిన్నంగా ఆయన సోదరుడు షెబాజ్ షరీఫ్ పాలన కొనసాగించనున్నారు.


చైనాతో కలిసి పనిచేసిన అనుభవం
షెబాజ్ షరీఫ్ గతంలో పాక్‌లోని పంజాబ్ ప్రావిన్స్ సీఎంగా సేవలు అందించారు. చైనాతో కలిసి పనిచేసిన అనుభవం ఆయన సొంతం. చైనా, బీజింగ్ అందించే నిధులతో చేపట్టిన పలు ప్రాజెక్టులలో భాగస్వామిగా ఉన్నారు. తాము అధికారం లోకి వస్తే అమెరికాతో మెరుగైన ధ్వైపాక్షిక సంబంధాలు కొనసాగిస్తామని ఇటీవల ఓ ఇంటర్వ్యూలో పీఎంఎల్ నేత షెబాస్ షరీఫ్ స్పష్టం చేశారు. పాక్ డెవలప్‌మెంట్, నిధుల కోసం ప్రధాని కానున్న నేత అమెరికా, చైనాలతో మెరుగైన సంబంధాల కోసం ప్రయత్నిస్తారని తెలుస్తోంది.


సైనిక తిరుగుబాటుతో జైలు శిక్ష..
1999లో పాకిస్తాన్‌లో జరిగిన సైనిక తిరుగుబాటు అనంతరం షెహబాజ్ షరీఫ్ జైలు పాలయ్యారు. దాంతో పాటు పాక్ నుంచి బహిష్కరణకు గురై, సౌదీ అరేబియాకు తరలించారు. దాదాపు 8 ఏళ్ల తరువాత 2007లో దేశానికి తిరిగి వచ్చారు. పనామా పేపర్స్ లీక్ కావడంతో అక్రమాస్తులు, ఇతర అభియోగాలతో 2017లో నవాజ్ షరీఫ్ దోషిగా తేలడంతో పాకిస్తాన్ ముస్లిం లీగ్ -  నవాజ్ పార్టీ పగ్గాలను షెహబాజ్ స్వీకరించారు. 


ఎవరీ షెబాజ్ షరీఫ్.. (Who Is Shehbaz Sharif)
పాకిస్తాన్ లోని లాహోర్‌లో సెప్టెంబర్ 23, 1951న జన్మించారు. పాక్‌ మాజీ ప్రధాని నవాజ్ షరీఫ్ సోదరుడే ఈ షెబాజ్ షరీఫ్. పంజాబ్‌కు 1997లో తొలిసారి సీఎం అయ్యారు. ఆపై 2018 నుంచి 2013 వరకు, మూడోసారి 2013 నుంచి 2018 వరకు సీఎంగా పంజాబ్‌కు సేవలు అందించారు. సోదరుడు నవాజ్ షరీఫ్ పనా పేపర్స్ కేసులో ఇరుక్కోగా 2017లో పాకిస్తాన్ ముస్లిం లీగ్  నవాజ్ పార్టీకి అధ్యక్షుడయ్యారు. ఆపై 2018 ఎన్నికల అనంతరం పాక్ పార్లమెంట్‌ దిగువసభలో ప్రతిపక్షగా కొనసాగుతున్నారు షెబాజ్ షరీఫ్. పాక్‌ను మరింత ముందుకు తీసుకెళ్దామని అవిశ్వాస తీర్మానంలో విజయం అనంతరం వ్యాఖ్యానించారు. న్యాయం, శాంతిభద్రతలపై ఫోకస్ చేయాలని ప్రజలు సైతం తమకు అనుకూల తీర్పు ఇస్తారని ఆశాభావం వ్యక్తం చేశారు.


Also Read: Pakistan No-Trust Motion: ఇమ్రాన్ ఖాన్‌ క్లీన్ బౌల్డ్‌- అవిశ్వాస తీర్మానంలో ఓడిపోయిన పాకిస్థాన్ ప్రధాని


Also Read: Pakistan Emergency: పాకిస్తాన్ లో నేషనల్ ఎమర్జెన్సీ, స్పీకర్, డిప్యూటీ స్పీకర్ రాజీనామా!