Pakistan Emergency: పాకిస్తాన్ లో ఎమర్జెన్నీ విధించారు. ప్రభుత్వ ఉద్యోగులు పాకిస్తాన్‌ను విడిచి వెళ్లకుండా దేశంలోని అన్ని విమానాశ్రయాల్లో భద్రతా దళాలను మోహరించారు. పలు ఆసుపత్రుల్లో అత్యవసర పరిస్థితులు విధించారు. ఆసుపత్రుల వద్ద భద్రతను పెంచారు. ఎన్‌ఓసీ లేకుండా ఏ అధికారి పాకిస్థాన్‌ను విడిచి వెళ్లడానికి అనుమతించలేదని జియో టీవీ నివేదికలు చెబుతున్నాయి.






అంతకు ముందు ఏంజరిగిందంటే?


అంతకు ముందు పాకిస్థాన్ లో నేషనల్ అసెంబ్లీలో అవిశ్వాస తీర్మానంపై ఓటింగ్ కు స్పీకర్ అసద్ తిరస్కరించారు. సుప్రీంకోర్టు ఏ శిక్ష విధించినా సిద్ధమేనని చెప్పిన స్పీకర్ అవిశ్వాస తీర్మానంపై ఓటింగ్ ను వాయిదా వేశారు. సుప్రీంకోర్టులో ఇమ్రాన్ ఖాన్ పార్టీ రివ్యూ పిటిషన్ దాఖలు వేసింది. కోర్టు తన తీర్పును తిరిగి పరిశీలించాలని కోరింది. కేబినెట్ మంత్రులతో ప్రధానని ఇమ్రాన్ ఖాన్ ఎమర్జెన్సీ మీటింగ్ ఏర్పాటుచేశారు. శనివారం అవిశ్వాస తీర్మానంపై ఓటింగ్ జరపాలన్న సుప్రీంకోర్టు ఇచ్చిన ఉత్తర్వులను స్పీకర్ పట్టించుకోవడం లేదని ప్రతిపక్షాలు ఆరోపిస్తున్నాయి. కోర్టు ధిక్కరణ కింద స్పీకర్ పై కేసు నమోదు చేయాలని డిమాండ్ చేశాయి. అవిశ్వాస తీర్మానం నుంచి గట్టేందుకు ఇమ్రాన్ ఖాన్ అన్ని ప్రయత్నాలు చేస్తున్నారు.






స్పీకర్, డిప్యూటీ స్పీకర్ రాజీనామా


పాకిస్తాన్ జాతీయ అసెంబ్లీలో మొత్తం 342 సభ్యులు ఉన్నారు. అవిశ్వాస తీర్మానం నెగ్గాలంటే ప్రతిపక్షాలకు 172 మంది సభ్యుల మద్దతు కావాలి. కానీ ప్రస్తుతం జాతీయ అసెంబ్లీలో అధికార పార్టీ బలం 164గా ఉండగా విపక్షాలకు 177 మంది మద్దతు ఉంది. ఈ పరిస్థితుల్లో ఇమ్రాన్  అవిశ్వాసం నుంచి గట్టెక్కే అవకాశాలు లేవు. దీంతో అసెంబ్లీని రద్దు చేస్తే మళ్లీ ఎన్నికలకు వెళ్లవచ్చనే ఆలోచనలో ఇమ్రాన్ ఖాన్ ఉన్నారు. అదే విధంగా తొలుత జాతీయ అసెంబ్లీని రద్దు చేశారు. అందుకు సుప్రీంకోర్టు ఒప్పుకోలేదు. అవిశ్వాస తీర్మానంపై ఓటింగ్ నిర్వహించాలని స్పీకర్ ను ఆదేశించింది. పాక్ లో పరిణామాలు గంట గంటకు మారుతున్నాయి. దీంతో సుప్రీంకోర్టు ప్రధాని న్యాయమూర్తి కోర్టుకు చేరుకున్నారు. స్పీకర్, డిప్యూటీ స్పీకర్ ఇద్దరు తమ పదవులకు రాజీనామా చేశారు. తమ రాజీనామాలను ప్రధాని ఇమ్రాన్ ఖాన్ కు సమర్పించారు.