Nobel Prize 2024 Medicine:వైద్యశాస్త్రంలో విశేష కృషి చేసిన విక్టర్ అంబ్రోస్, గ్యారీ రువ్‌కున్‌కి 2024 వ సంవత్సరం నోబెల్ బహుమతి వరించింది. ఈ మేరకు స్టాక్‌హోమ్‌లోని కరోలిన్‌స్కా ఇన్‌స్టిట్యూట్‌లో నోబెల్ ఎంపిక కమిటీ ప్రకటించింది. మైక్రోఆర్‌ఎన్‌ఏ కనుగొనడంతోపాటు పోస్ట్ ట్రాన్స్‌క్రిప్షనల్ జీన్ రెగ్యులేషన్‌లో దాని పాత్రపై అధ్యయనం చేసినందుకు వీళ్లద్దరికీ ఈ సంవత్సరంలో నోబెల్ బహుమతి వరించింది.
దాదాపు 1 మి.మీ పొడవు గల సి. ఎలిగాన్స్ రౌండ్‌వార్మ్ గుర్తించినందుకు ఈ సంవత్సరం విక్టర్ అంబ్రోస్, గ్యారీ రువ్‌కున్ వైద్యశాస్త్రంలో నోబెల్ బహుమతికి ఎంపికయ్యారు. పరిమాణం బట్టి C.ఎలిగాన్స్ చాలా చిన్నగా ఉన్నప్పటికీ... సాధారణమైన జంతువుల్లో కనిపించే నాడీ, కండరాల కణాల వంటి అనేక ప్రత్యేక కణ రకాలను కలిగి ఉంది. ఈ కణజాలం ఎలా అభివృద్ధి చెందుతుంది, బహుళ సెల్యులార్ జీవులలో ఎలా పరిపక్వం చెందుతుంది అనేదానిని పరిశోధించడానికి ఇది ఉపయోగకరమైన నమూనాగా నోబెల్ జ్యూరీ గుర్తించింది.
ఇప్పటి వరకు మెడిసిన్‌లో నోబెల్ బహుమతి 114 సార్లు 227 మందికి అందజేశారు. వీరిలో 13 మంది మహిళలు ఉన్నారు. ఈ బహుమతి లభించిన వారికి సుమారు ₹ 8.3 కోట్ల నగదు లభించనుంది. డిసెంబర్ 10న నోబెల్ వర్ధంతి రోజున విజేతలకు అవార్డు ప్రదానం చేస్తారు. మంగళవారం భౌతిక శాస్త్రం, బుధవారం రసాయన శాస్త్రం, గురువారం సాహిత్యం, శుక్రవారం శాంతి బహుమతి, అక్టోబర్ 14న ఆర్థిక శాస్త్రం ఎంపికన వారి పేర్లు ప్రకటిస్తారు.