New Zealand Youngest MP Hana Rawhiti Maipi Speech: న్యూజిలాండ్ (New Zealand) పార్లమెంటులో యువ మహిళా ఎంపీ చేసిన ప్రసంగం అందరినీ ఆకట్టుకుంటోంది. ఇటీవల జాతీయ ఎన్నికల్లో 170 ఏళ్ల న్యూజిలాండ్ పార్లమెంట్ చరిత్రలో అత్యంత పిన్న వయస్కురాలైన 21 ఏళ్ల హనా రౌహితీ మైపీ క్లార్క్ (Hana rawhiti maipi Clarke) ఎంపీగా పదవీ బాధ్యతలు చేపట్టి చరిత్ర సృష్టించారు. ఈ క్రమంలో తన స్థానిక మూలాలను గౌరవించేలా ఎంపీ గత నెల పార్లమెంటులో తొలి స్పీచ్ ఇచ్చారు. ఆమె స్థానిక తెగలు మావోరీ (Maori), వఖామా, తమారికీ ప్రజలను ఉద్దేశించి చేసిన ప్రసంగం అందరినీ ఆకట్టుకుంది. ఎంపీ 'మావోరీ హకా' చేస్తూ పార్లమెంటులో ప్రసంగించగా.. దీనికి సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. న్యూజిలాండ్ లోని తెగలలో మావోరీ భాష దాదాపు అంతరించిపోయింది. మావోరీ ప్రజల భాషతో పాటు హక్కులను పరిరక్షించడానికి ఈ యువ ఎంపీ పోరాడుతున్నట్లు న్యూజిలాండ్ హెరాల్డ్ పేర్కొంది.


తొలి ప్రసంగం ఇదే


ఎంపీ హనా రౌహితీ తన నియోజకవర్గ ప్రజలకు నిబద్ధత తెలియజేసేలా ప్రసంగించినట్లు హిందూస్థాన్ టైమ్స్ నివేదించింది. 'నేను మీకోసం బతుకుతాను. మీ కోసం ప్రాణాలు ఇస్తాను.' అంటూ ప్రతిజ్ఞ చేసినట్లు పేర్కొంది.






ఎంపీ హనా-రౌహితీ మైపి-క్లార్క్ టె పెటిహానా వార్షికోత్సవ ప్రసంగంలోని ముఖ్యాంశాలను సైతం ఈ ప్రసంగంలో పునరుద్ఘాటించారు. టెరియో మావోరీని ఉపయోగించడాన్ని నియంత్రించాలనే కొత్త ప్రభుత్వ ఉద్దేశాలను తన ప్రసంగంలో వ్యతిరేకించినట్లు హిందూస్తాన్ టైమ్స్ నివేదించింది. మాతృభాష నేర్చుకోవాలని తహతహలాడుతున్న మావోరీ పిల్లలను ఉద్దేశించి ఆమె ప్రసంగం సాగింది. మావోరీ తెగకు చెందిన విద్యార్థులు తమ భాషలో చదువుకొనే అవకాశం రాకపోవడంతో వారు అభివృద్ధి చెందడం లేదని వాపోయారు. ఇకపై మాతృభాష నేర్చుకోవడానికి మావోరీలు బాధ పడాల్సిన అవసరం లేదని ఆమె భరోసా ఇచ్చారు. ఈ సందర్భంగా న్యూజిలాండ్ ఎంపీ టే పెతిహెనా 50వ వార్షికోత్సవం కోసం పార్లమెంట్ వెలుపల మావోరీ సమూహాల జాతీయ గుర్తింపు కోసం చేసిన వ్యాఖ్యలను గుర్తు చేసుకున్నారు. ఆ ప్రసంగంపై కట్టుబడి ఉన్నట్లు చెప్పారు. 'కేవలం 2 వారాల్లో, ఈ ప్రభుత్వం నా ప్రపంచం మొత్తం మీద దాడి చేసింది. ఆరోగ్యం, పర్యావరణం, నీరు, భూమి, సహజ వనరులు, మావోరీ వార్డులు, భాష], తమరికి హక్కులు, నేను, మీరు ఈ దేశంలో Te Tiriti కింద ఉండాలి' అంటూ వ్యాఖ్యానించారు.


మావోరీ హకా అంటే.?


'మావోరీ' అనేది ఓ భాష. వందల ఏళ్ల క్రితమే న్యూజిలాండ్ లో ఉద్భవించింది. అక్కడ తెగలను పలకరించే ఓ సంప్రదాయ ఆచార మార్గం. హకా అంటే ఓ అద్భుత శ్లోకం. ఇది సాధారణంగా అక్కడి ఆటల్లో వినపడే పదం. యుద్ధానికి ముందు యోధులను ఉత్తేజపరిచే సాధనంగానూ ఉపయోగపడుతుంది.


ఎవరీ మైపీ క్లార్క్.?


21 ఏళ్ల ఈ యువ మహిళా ఎంపీ మైపీ క్లార్క్.. ఆక్లాండ్ - హామిల్టన్ మధ్య ఉన్న హంట్లీ అనే చిన్న పట్టణంలో నివసిస్తున్నారు. అక్కడ ఆమె మావోరీ కమ్యూనిటీ గార్డెన్ లో స్థానిక కమ్యూనిటీ పిల్లలకు గార్డెన్ గా ఉన్నారు. పిల్లలకు తోటపని గురించి అవగాహన కల్పించారు. దీన్ని 'మరమాటాకా' అని పిలుస్తారు. నక్షత్రాలు, చంద్రులను అన్వేషించేలా యువకులను ప్రోత్సహిస్తూ ఆమె ఓ పుస్తకాన్ని రచించారు. హనా మావోరీ గిరిజన హక్కుల సంస్థ నాగ టమాటాలో కూడా సభ్యురాలిగా ఉన్నారు. ఆమె తనను తాను రాజకీయ నాయకురాలిగా కాకుండా మావోరీ భాషకు రక్షకురాలిగా భావిస్తున్నారు. కొత్త తరం మావోరీల గొంతును ప్రపంచ వేదికపైకి తీసుకు రావాల్సిన అవసరం ఉందని ఆమె పేర్కొన్నారు.


Also Read: Lakshadweep Tourism: లక్షద్వీప్‌కి ఇన్ని స్పెషాల్టీస్ ఉన్నాయా? అందుకే ప్రధాని ప్రమోట్ చేశారా?