Nepal Plane Crash: నేపాల్‌లో గల్లంతైన విమానం ఆచూకీ లభ్యమైంది. 22 మందితో ప్రయాణిస్తూ గల్లంతైన ఈ విమానం నుంచి 14 మృతదేహాలను వెలికితీసినట్లు అధికారులు తెలిపారు. అయితే మొత్తం 22 మంది మరణించారని నేపాల్ మీడియా తెలిపింది.






ఎక్కడ?


సన్సోవారో సమీపంలో విమాన శకలాలను సహాయక బృందాలు గుర్తించాయి. చిన్న హెలికాప్టర్ల సాయంతో ఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. విమానం కూలిందని భావించిన ప్రదేశంలో ఆదివారం మంచు కురిసిన కారణంగా సహాయక చర్యలను నిలిపివేశారు. సోమవారం తిరిగి ప్రారంభించడంతో శకలాలను గుర్తించారు. 


ఇదీ జరిగింది


నేపాల్​ తారా ఎయిర్​లైన్స్​కు చెందిన 9 ఎన్​ఏఈటీ ట్విన్​ ఇంజిన్​ విమానం ఆదివారం ఉదయం గల్లంతైంది. ఈ విమానంలో మొత్తం 22 మంది ప్రయాణించారు. ఫొఖారా నుంచి జోమ్సమ్​ వెళ్తుండగా విమానం ఆచూకీ తెలియకుండా పోయింది. ఉదయం 9.55 గంటల ప్రాంతంలో లేటే ప్రాంతానికి చేరుకున్న తర్వాత విమానంతో సంబంధాలు తెగిపోయాయని అధికార వర్గాలు తెలిపాయి. దీంతో అప్రమత్తమైన అధికారులు వెంటనే గాలింపు చర్యలు చేపట్టారు. అయితే మంచు ఎక్కువగా ఉండటంతో సహాయక చర్యలు ఆలస్యమయ్యాయి.


విమానంలో ప్రయాణించిన వారిలో నలుగురు భారతీయులు, ముగ్గురు జపనీయులు సహా 22 మంది ఉన్నారు. అశోక్ త్రిపాఠి, ఆయన భార్య వైభవి బండేకర్, పిల్లలు ధనుశ్, రితిక నలుగురు ముంబయికి చెందినవారుగా అధికారులు గుర్తించారు.


ఇతర ప్రయాణికులు: ఇంద్ర బహదూర్ గోలే, పురుషోత్తం గోలే, రాజన్ కుమార్ గోలే, మిక్ గ్రాట్, బసంత్ లామా , గణేష్ నారాయణ్ శ్రేష్ఠ, రవీనా శ్రేష్ఠ, రస్మి శ్రేష్ఠ, రోజినా శ్రేష్ఠ, ప్రకాష్ సునువార్, మకర్ బహదూర్ తమాంగ్, రమ్మయ తమంగ్, సుకుమాయ తమ్, సుకుమాయ తమ్ విల్నర్.


సిబ్బంది: కెప్టెన్ ప్రభాకర్ ఘిమిరే, కో-పైలట్ ఉత్సవ్ పోఖరేల్, ఎయిర్ హోస్టెస్ కిస్మి థాపా.


Also Read: PM Cares Fund: 'ఓ కుటుంబ సభ్యుడిగా ఇదంతా చేస్తున్నా'- పీఎం కేర్స్ ఫర్ చిల్డ్రన్ పథకానికి మోదీ శ్రీకారం


Also Read: Corona Cases: దేశంలో కొత్తగా 2,706 కరోనా కేసులు- 25 మంది మృతి