PM Cares Fund: కరోనా కారణంగా తల్లిదండ్రులు, సంరక్షకులను కోల్పోయిన చిన్నారుల కోసం పీఎం కేర్స్ పథకానికి శ్రీకారం చుట్టారు ప్రధాని నరేంద్ర మోదీ. ఈ పథకం కింద అనాథలైన పిల్లలకు ఆర్థిక సాయం చేయనున్నారు. తల్లిదండ్రులను కోల్పోయిన వారి పరిస్థితి ఎంత దారుణంగా ఉంటుందో తనకు తెలుసని మోదీ అన్నారు.
ఇదే లక్ష్యం
కరోనా కారణంగా తల్లిదండ్రులను కోల్పోయిన పిల్లలకు కేంద్రం అండగా ఉండనుంది. 23 ఏళ్లు వచ్చేవరకూ వారి బాధ్యత భారత ప్రభుత్వమే తీసుకుంటుంది. ఈ పథకం కింద 4345 మంది పిల్లలను ప్రధాని దత్తత తీసుకున్నారు. అనాథ పిల్లల కోసం ప్రత్యేక పోర్టల్ ఏర్పాటు చేశారు. 18 ఏళ్లు లోపు వారందరికీ పది లక్షల రూపాయలు డిపాజిట్ చేస్తున్నారు. 18 నుంచి 23 ఏళ్లు వచ్చేవరకూ ప్రతీ నెలా స్టైఫండ్ ఇవ్వనున్నారు. తల్లిదండ్రులను కోల్పోయిన పిల్లల కోసం ప్రత్యేక విభాగం ఏర్పాటు చేశారు.
Also Read: Corona Cases: దేశంలో కొత్తగా 2,706 కరోనా కేసులు- 25 మంది మృతి