Corona Cases: దేశంలో కొత్తగా 2,706 కరోనా కేసులు- 25 మంది మృతి

Corona Cases: దేశంలో కరోనా కేసులు క్రితం రోజుతో పోలిస్తే కాస్త తగ్గాయి. కొత్తగా 2,706 కరోనా కేసులు నమోదయ్యాయి.

Continues below advertisement

Corona Cases: దేశంలో కొత్తగా 2,706 కరోనా కేసులు నమోదయ్యాయి. 25 మంది వైరస్‌తో ప్రాణాలు కోల్పోయారు. తాజాగా 2,070 మంది కరోనా నుంచి కోలుకున్నారు. ఈ మేరకు కేంద్ర ఆరోగ్యశాఖ వెల్లడించింది.

Continues below advertisement

  • మొత్తం కరోనా కేసులు: 4,31,55,749
  • మొత్తం మరణాలు: 5,24,611
  • యాక్టివ్​ కేసులు: 17,698
  • మొత్తం రికవరీలు: 4,26,13,440

వ్యాక్సినేషన్

దేశవ్యాప్తంగా ఆదివారం 2,28,823 మందికి టీకాలు అందించారు. ఇప్పటివరకు పంపిణీ చేసిన వ్యాక్సిన్​ డోసుల సంఖ్య 1,93,31,57,352కు చేరింది. ఒక్కరోజే 2,78,267 మందికి కరోనా టెస్టులు నిర్వహించారు.

కీలక నిర్ణయం

దేశంలో కరోనా వ్యాప్తి కొనసాగుతున్న వేళ కేంద్ర ప్రభుత్వం ఇటీవల కీలక నిర్ణయం తీసుకుంది. కొవిడ్ 19 వ్యాక్సిన్ డోసుల మధ్య కాల వ్యవధిని తగ్గించారు. కరోనా వ్యాక్సిన్ రెండో డోసు, మూడో డోసుకు మధ్య కాల వ్యవధిని 9 నెలల నుంచి 90 రోజులకు తగ్గిస్తూ నిర్ణయం తీసుకున్నారు. ఈ మేరకు కేంద్ర ప్రభుత్వం కొవిన్ యాప్‌ (COWIN App)లో మార్పులు చేసినట్లు కేంద్ర వైద్య ఆరోగ్యశాఖ ఓ ప్రకటనలో తెలిపింది.

బీఎంసీ పరిధిలోని అన్ని ప్రైవేట్ & ప్రభుత్వ టీకా కేంద్రాలకు వ్యాక్సిన్ కోసం ఆదేశాలు జారీ అయ్యాయి.  అయితే అంతర్జాతీయ ప్రయాణం చేయాల్సిన వ్యక్తులకు మాత్రమే కరోనా వ్యాక్సిన్ రెండు, మూడు డోసుల మధ్య తగ్గించిన గ్యాప్ టైమ్ వర్తిస్తుందని బీఎంసీ స్పష్టం చేసింది.

Also Read: Sidhu Moosewala Death : పంజాబీ సింగర్ సిద్ధూ హత్య వెనుక కెనడా గ్యాంగ్ స్టర్, అకాలీ దళ్ లీడర్ హత్యకు ప్రతీకారమా?

Also Read: UIDAI Update: మాస్క్‌ ఆధార్‌ వినియోగంపై కేంద్రం వెనక్కి! తప్పుగా అర్థం చేసుకున్నారని వివరణ

Continues below advertisement