Heart Of The Milky Way Galaxy: నాసా ప్రయోగించిన జేమ్స్ వెబ్ స్పేస్ టెలిస్కోప్ అత్యంత అరుదైన ఈ ఫోటోను తీసింది. మన సూర్యుడు ఉన్న మిల్కీవే గెలాక్సీకి చెందినదే ఈ ఫోటో. అందులో కనిపిస్తున్న ప్రాంతాన్ని మన మిల్కీవే గెలాక్సీకి హృదయం లాంటిది అని చెబుతారు. సజుతేరిస్ సీగా సైంటిస్టులు పేరుపెట్టిన ఈ ప్రాంతంలో దాదాపుగా 5లక్షల నక్షత్రాలు ఉంటాయి. వాటిలో చాలా వరకూ సూర్యుడి కంటే 30రెట్లు పెద్దగా ఉన్నా అన్నీ ఇప్పుడిప్పుడే నక్షత్రాలుగా మారుతున్న ప్రోటోస్టార్స్. భూమి నుంచి 300 కాంతి సంవత్సరాల దూరంలో... మిల్కీ వే గెలాక్సీ కి ఉన్న సూపర్ మాసివ్ బ్లాక్ హోల్ కి అతిదగ్గరగా ఉంటుంది ఈ ప్రాంతం.


ఇంతకు ముందే సైంటిస్టులు ఈ ప్రాంతాన్ని గుర్తించినా...చాలా వరకూ ఊహకే మాత్రమే పరిమితమైన ఈ ప్రాంతాన్ని నాసా జేమ్స్ వెబ్ కి నిర్ క్యామ్ తొలిసారిగా ఫోటోలు తీసింది. ఫలితంగా అక్కడి ఇన్ ఫ్రారెడ్ డేటాను ఈ హై రిజల్యుషన్ ఫోటోలు, సెన్సిటివిటీతో అధ్యయనం చేయొచ్చని..అంచనాకు రావచ్చని శాస్త్రవేత్తలు భావిస్తున్నారు. గెలాక్టిక్ సెంటర్ గా పిలుచుకునే ఈ ప్రాంతం నక్షత్రాలు ఎలా ఏర్పడుతున్నాయో పరిశీలించేందుకు చాలా అనువైనది.