Puzzles: ప్రతి ఒక్కరూ పజిల్స్ పరిష్కరించేందుకు ఇష్టపడతారు. పొడుపుకథలను విప్పడం కూడా కొంత మందికి భలే ఇష్టంగా, సరదాగా ఉంటుంది. ఎవరూ పరిష్కరించే పజిల్ ను సాల్వ్ చేసినప్పుడు ఫుల్ మజాగా ఉంటుంది. పొడుపు కథలను విప్పడానికి, పజిల్స్ పరిష్కరించడానికి చిన్న బహుమతులు ఇస్తుంటారు. అయితే ఇప్పుడు చెప్పబోయే ఒక పజిల్ ను విప్పడానికి శాస్త్రవేత్తలు ఏకంగా 2 కోట్ల రూపాయల ప్రైజ్ మనీ ప్రకటించారు. ఇంత పెద్ద మొత్తంలో ఆఫర్ ఇచ్చారంటేనే అర్థం చేసుకోవాలి. అది అలాంటిలాంటి పజిల్ కాదని. దానిని కనిపెట్టడం ఎంత కష్టమో అని ఆలోచించుకోవాలి.


వెసువియస్ పర్వతం విస్ఫోటనం సమయంలో కాలిపోయిన 2000 సంవత్సరాల నాటి మాన్యుస్క్రిప్ట్‌లను చదవగలిగే వ్యక్తికి ఏకంగా $250,000 ఇస్తామని శాస్త్రవేత్తలు ప్రకటించారు. 79 ADలో అగ్నిపర్వత విస్ఫోటనం కారణంగా ఇటలీలోని పాంపీ మొత్తం తుడిచిపెట్టుకుపోయింది. ఈ దుర్ఘటనలో హెర్క్యులేనియం లైబ్రరీ తీవ్రంగా దెబ్బతింది. ఈ గ్రంథాలయంలోని వందలాది గ్రంథాలు కొన్ని పాక్షికంగా ధ్వంసం కాగా, మరికొన్ని పూర్తిగా ధ్వంసమయ్యాయి. 1752లో, ఈ గ్రంథాలలోని కొన్ని భాగాలు బే ఆఫ్ నేపుల్స్ సమీపంలో కనుగొనబడిన తర్వాత కూడా, ఈ గ్రంథాలన్నీ రహస్యంగానే ఉన్నాయి. శాస్త్రవేత్తలు ఈ గ్రంథాలను చాలా రహస్యంగా అధ్యయనం చేస్తూ వస్తున్నారు.


ఈ పజిల్ సాల్వింగ్ పోటీ ఏమిటి?


హెర్కులేనియంలో దొరికిన పురాతన లిపిని ఇప్పటి శాస్త్రవేత్తలు ఎవరూ కనుక్కోలేకపోతున్నారు. అప్పటి రాతల వెనక వివరాలను గుర్తించలేకపోతున్నారు. అది మన శాస్త్రవేత్తలకు పెద్ద పజిల్ గా మారిపోయింది. శాస్త్రవేత్తలు, నిపుణులు, అధికారులు ఎంత ప్రయత్నించినా ఆనాటి లిపిని డీకోడ్ చేయలేకపోతున్నారు. దీంతో ఆ మిస్టరీ లిపిని చదివి ఆ పజిల్ ను పరిష్కరించే వారికి కళ్లు చెదిరే బహుమతిని శాస్త్రవేత్తలు ఆఫర్ చేశారు. పోటీలో పాల్గొనే వారు ఈ 2000 ఏళ్ల పురాతన గ్రంథాలపై రాసిన పదాలను చదివి అర్థం చేసుకోగలగాలి. అప్పుడే $250,000 బహుమతిని అందిస్తారు. ఈ సంవత్సరం చివరి నాటికి మాన్యుస్క్రిప్ట్ లోని మొదటి 4 భాగాలను చదవగలిగే వ్యక్తికి ఈ బహుమతిని అందిస్తారు.