లాటరీ గెలవడం అనేది కేవలం అదృష్టం మీదనే ఆధారపడి ఉంటుంది. ఎన్ని కొన్నా.. కూడా రాసిపెట్టి ఉండాలి. ఓ వ్యక్తి ఒకిటి రెండేళ్లు కాదు.. దశాబ్దాలుగా లాటరీ టికెట్లు కొంటూ ఎదురు చూస్తూ ఉన్నాడు. 1991 నుంచి అతడు సిరియల్ గా లాటరీ టికెట్లు కొంటూనే ఉన్నాడు. ఒకే నంబర్ సెట్ ఉన్న.. లాటరీతో తనను అదృష్టం వరిస్తుందోనని వెయిట్ చేస్తున్నాడు. కానీ అతడి జీవితంలో ఓరోజు వచ్చేసింది. తన అదృష్టం మారిపోయింది. 


Also Read: Belly Fat: చీర కట్టుకుని ఫంక్షన్ వెళ్తే కామెంట్ చేస్తారని ఫీల్ అవుతున్నారా? అయితే ఇలా చేసి పొట్ట తగ్గించుకోండి


అమెరికాలోని మిచిగాన్ కు చెందిన వ్యక్తికి ఇప్పుడు 61 ఏళ్లు. అతడికి 30 ఏళ్లు ఉన్నప్పటి నుంచి.. అంటే 1991 నుంచి లాటరీ టికెట్లు కొంటూనే ఉన్నాడు. లాటరీ అనేది పూర్తిగా అదృష్టం మీదనే ఆధారపడి ఉంటుంది. 30 ఏళ్లుగా అతడి ఓపిక, మెుండిగా లాటరీ టికెట్లనే నమ్ముకునే ఉన్నాడు. ఇటీవల కూడా అదే ఆశతో ఎప్పటిలాగే.. అదే నంబర్ సెట్ లో లాటరీ టికెట్ కొన్నాడు. కానీ ఏం జరుగుతుందిలేననుకున్నాడు. అదే అతడికి అదృష్టమైంది.  


Also Read: ‘అవి’ పెంచుకొనే సర్జరీ వికటించి.. కూర్చోలేక పాట్లు, నిలబడే కోట్లు గడిస్తున్న మోడల్


30 ఏళ్లుగా ఓపిగ్గా చూసిన.. అతడి కల నెరవేరింది.  ఇటీవల ప్రకటించిన లాటరీ నంబర్లలో అతడి నంబర్ ఉంది. గెలుచుకుంది ఎంత అనుకుంటున్నారా?  అతను దశాబ్దాలుగా ఎదురు చూసిన దానికి ఫలితం దక్కింది. అతను గెలుచుకున్న మొత్తం డబ్బు ఎంతో తెలుసా? 18.41 మిలియన్ డాలర్లు  అంటే దాదాపు రూ.రూ.135 కోట్లు.


Also Read: Neelakurinji Flowers: కొడగు కొండల్లో నీలకురింజి అందాలు ... పన్నెండేళ్ల తర్వాత వికసించిన వనాలు... క్యూ కట్టిన ప్రకృతి ప్రేమికులు


'నేను 1991 నుంచి ఒకే నంబర్ సెట్ కోసం టిక్కెట్లు కొనుగోలు చేస్తున్నాను. కానీ ఇప్పటి వరకు.. గెలవలేను. నేను కూడా అనేకసార్లు నంబర్‌ని మార్చడం గురించి ఆలోచించాను. కానీ అదే నంబర్ పై నమ్మకంతో, మెుండిగా ఉన్నాను. ఇప్పుడు అదే నాకు విజయం తెచ్చిపెట్టింది.' అని గెలిచిన వ్యక్తి చెప్పుకొన్నాడు.


Also Read: ఈ స్కూల్‌లో ముగ్గురే విద్యార్థులు.. వీరికి చదువు చెబితే రూ.57 లక్షలు జీతం, ఎక్కడో తెలుసా?


18 మిలియన్ డాలర్ల మొత్తంలో, ఆ వ్యక్తి రూ.86 కోట్లు తీసుకోవాలని నిర్ణయించుకున్నాడు. తన కుటుంబానికి కొంత మొత్తాన్ని ఇవ్వాలని డిసైట్ అయ్యాడు. కొంత మొత్తాన్ని స్వచ్ఛంద సంస్థలకు విరాళంగా ఇచ్చాడు. ఇప్పుడు ఈ వార్త వైరల్ అవుతోంది.


Also Read: Brazil Man Covid-19 Vaccine: 3 రకాల కోవిడ్ వ్యాక్సిన్లను 5 సార్లు తీసుకున్నాడు, చివరికి ఏమైందంటే..