Great Old Swimmer : ఆయన వయసు 83 ఏళ్లు. గట్టిగా నడవడానికే కష్టపడే వయసు. కానీ ఆయన ఏకంగా ఓ మహా సముద్రాన్ని ఈదేశాడు. జపాన్‌కు చెందిన ఈ పెద్దాయన ఇప్పుడు సోషల్ మీడియాలో హాట్ టాపిత్.   మహాసముద్రాలన్నింటిలో అతిపెద్దది ఫసిఫిక్‌ మహాసముద్రం. దీన్ని మహా మహా స్విమ్మర్లే ఈదడం కష్టం. కానీ   83 ఏళ్ల ఓ వృద్ధుడు ఒంటరిగా చుట్టొచ్చేశాడు.  ఒంటరిగా సముద్రయానం చేసిన తొలి వృద్ధుడుగా రికార్డు సృష్టించాడు.  



 జపాన్‌కి చెందిన 83 ఏళ్ల కెనిచి హోరీకి ( Kenichi Horie ) చిన్నతనం నుంచే సముద్రయానమంటే అమితమైన ఆసక్తి  . ఈ ఆసక్తితోనే   23 ఏళ్ల వయసులోనే సముద్రయానం చేశాడట. 1962లో జపాన్‌ నుంచి శాన్‌ఫ్రాన్సిస్కోకు పసిఫిక్‌ మహాసముద్రం వీదుగా ఒంటరిగా ప్రయాణించాడు. ఇలా ప్రయాణించిన వ్యక్తి.. ప్రపంచంలోనే తొలి వ్యక్తి హోరీ కావడం విశేషం. కానీ అక్కడకు ఈదుకుంటూ వెళ్లాడు కానీ ఆ  దేశంలోకి వెళ్లడానికి పాస్ పోర్టు లేదు. దాంతో వెనక్కి రావాల్సి వచ్చింది. అయినా ఆయన అక్కడ ఉండటానికి వెళ్లలేదు. ఈదడానికే వెళ్లారు. 



1962లో మొదలైన అతని సముద్రయానం.. 1974, 1978, 1982, 2008 వరకు చేశాడు. మళ్లీ ఇన్నేళ్ల తర్వాత.. హోరీ శాన్‌ఫ్రాన్సిస్కోలోని యాచ్‌ హార్బర్‌ నుంచి మార్చి నెలలో సాహసయాత్రను ప్రారంభించాడు. ఈ యాత్రను జూన్‌ 4 శనివారం ఉదయం తెల్లవారుఝామున జపాన్‌లోని కిరు జలసంధికి చేరుకుని విజయవంతంగా ముగించాడు. దీంతో పసిఫిక్‌ మహాసముద్రం మీదుగా ఒంటరిగా ప్రయాణించిన తొలి అత్యంత వీద్ధుడిగా కెనిచి హోరీ నిలిచాడు.