Heat Wave In Tokyo: జపాన్‌లో ఎండలు జనాలను ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాయి. ఆ దేశ రాజధాని టోక్యోలో 150 ఏళ్లలో చూడని వేసవితాపాన్ని ప్రజలు ఎదుర్కొంటున్నారు. టోక్యోలో మంగళవారం 36 సెల్సియస్ డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. దీంతో వరుసగా నాలుగో రోజు కూడా 35 సెల్సియస్ డిగ్రీలకు పైగా ఉష్ణోగ్రత రికార్డయింది.






భగభగలు


1875 జూన్ తర్వాత మళ్లీ ఇప్పుడే ఆ స్థాయిలో ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. వడదెబ్బతో టోక్యో నగరంలో ఆసుపత్రుల్లో చేరుతున్నవారి సంఖ్య రోజురోజుకూ పెరుగుతోంది. దీంతో నగరవాసులకు అధికారులు కీలక సూచనలు చేశారు. ఇళ్ల నుంచి బయటకు వచ్చేవారు తప్పనిసరిగా ఫేస్‌మాస్క్ ధరించాలని సూచించారు. కరోనా సమయంలో వాడినట్టుగానే ఎండలో ఉన్నప్పుడు మాస్క్‌ని వినియోగించాలన్నారు.


విద్యుత్‌పై ప్రభావం






ఈ ఎండల వల్ల నగరంలో విద్యుత్ వినియోగం భారీగా పెరిగిపోయింది. దీంతో సప్లయ్‌లో ఇబ్బందులు ఎదురవుతున్నాయని అధికారులు వెల్లడించారు. ఇక చేసేదేం లేక అధికారులు విద్యుత్ కోతలు పెంచారు. విద్యుత్ సప్లయ్‌లో ఇబ్బందులు కారణంగా 'పవర్ సేవింగ్‌'కు ప్రాధాన్యత ఇవ్వాలని టోక్యో వాసులను ప్రభుత్వం కోరింది.


Also Read: Joe Biden Greets PM Modi: మోదీ భూజం తట్టి ఆప్యాయంగా పిలిచిన బైడెన్- వైరల్ వీడియో చూశారా?


Also Read: Texas: సరిహద్దులోని ట్రక్కులో 46 మృతదేహాలు- అసలేం జరిగింది?