Viral News: ఓ దీవిలో ఒక్కడే 32 ఏళ్లు హాయిగా ఉన్నాడు - జనాల్లోకి తీసుకొస్తే చనిపోయాడు - ఓ ఇటాలియన్ విషాదగాథ

Italian Man: ఆయనకు మనుషులు అంటే పడదు. ఓ దీవిలో 32 ఏళ్లు ఒంటరిగా బతికాడు.అయితే వయసు పైబడిందని బలవంతంగా దీవి నుంచి తెచ్చారు. కానీ చనిపోయారు.

Continues below advertisement

Italian Man Who Lived Alone On Island For 32 Years Dies 3 Years After Returning To Civilisation: ఒంటరిగా జీవించడానికి అలవాటు పడ్డాడు. డబ్బే అవసరం లేని ప్రపంచం సృష్టించుకున్నాడు. మరో వ్యక్తి సాయం కానీ..తోడు కానీ ఉండాల్సిన అవసరం లేకుండా 32 ఏళ్లు జీవించాడు. అతని వయసు పైబడిందన్న కారణంగా అధికారులు ఆయనను దీవి నుంచి జన జీవనంలోకి తీసుకు వచ్చారు. అది ఆయన మరణానికి కారణం అయింది.  

Continues below advertisement

ఇటాలియన్ 'రాబిన్సన్ క్రూసో' అని మీడియా మౌరో మొరాండిను పిలుస్తుంది. అతను  మధ్యధరా సముద్రంలోని సార్డానియా అనే ఇటాలియన్ ద్వీపం సమీపంలోని బుడెల్లి అనే మరో చిన్న  ద్వీపంలో రెండవ ప్రపంచ యుద్ధం సమయంలో నిర్మించిన ఓ పాడుబడిన ఇంట్లో నివసించేవాడు.

Also Read : Los Angeles Wildfire : లాస్ ఏంజిల్స్ అగ్ని ప్రమాదం - ఆ రాష్ట్రాల బడ్జెట్ కంటే విలువైన ఆస్తి నష్టం

ఆయన ఇలా ఒంటరిగా నివసించడానికి ప్రత్యేకమైన కారణాలు ఉన్నాయి. డబ్బు సంపాదించడం..వాటితో వినియోగవస్తువులను కొనడం ఇదంతా ఆయనకు నచ్చలేదు. ప్రకృతిలో లభించేవాటిని సేకరించుకుని బతకాలని నిర్ణయించుకుని సరైన చోటు వెదుక్కుటూ బయలుదేరాడు. అలా బుడెల్లి ద్వీపానికి చేరుకున్నాడు. ఆ ద్వీపం సంరక్షణకు అప్పటికే ఓ వ్యక్తి ఉండేవాడు.అయితే అతను  పదవీ విరమణకు దగ్గరగా ఉండటం...తనకు ఆ ద్వీపంలో జీవనం నచ్చడంతో  మొరాండి ఆ బాధ్యతను తీసుకుని అక్కడే ఉండిపోయాడు. 

మొరాండి 32 సంవత్సరాల పాటు ద్వీపాన్ని పరిశుభ్రంగా ఉంచాడు. ఆ ద్వీపానికి కొంత మంది పర్యాటకులు వస్తూంటారు.  వారిలో పర్యావరణం గురించి పర్యాటకులలో అవగాహన పెంచడానికి ప్రయత్నించేవాడు. 2021లో ఇటలీ అధికారులు ఈ ద్వీపాన్ని ప్రకృతి వనంగా గుర్తించడంతో అక్కడి నుంచి ఆయనను ఖాళీచేయించారు. అప్పటికీ మరాండీ వయసు కూడా అయిపోయింది.   తరవాత సార్డినియాలోని లా మద్దెలెనాలోని ఒక చిన్న అపార్ట్మెంట్లో కొత్త జీవితాన్ని ప్రారంభించాడు.

Also Read: Maha Kumbh Mela 2025: ప్రయాగ్‌రాజ్‌లో మహా కుంభమేళా ప్రారంభం, తొలిరోజే జనసంద్రంగా మారిన త్రివేణి సంగమం

దీవిలో అతను అందమైన ద్వీపంలో పగడపు, గ్రానైట్ చిప్పలతో నిర్మించిన ఇంట్లో ఒంటరిగా మూడు దశాబ్దాలు గడిపాడు.  తాత్కాలిక సౌరశక్తి వ్యవస్థను ఉపయోగించి తన ఇంటిని సాధారణ పొయ్యితో వెచ్చగా ఉంచుకునేవాడు. కొత్త జీవితంలో ఆయన పెద్దగా ఇమడలేకపోయారు. బయటకు వచ్చిన మూడేళ్లకు చనిపోయారు.   

అయితే దీవి నుంచి ఖాళీ చేయించకపోయినా ఆయన చనిపోయేవారని.. అప్పటికే  ఆయన ఆరోగ్యం క్షీణించిందని అధికారవర్గాలు చెబుతున్నాయి.  దీవి నుంచి తిరిగి జన జీవన స్రవంతిలోకి తీసుకు వచ్చిన తర్వాత ఆయనకు ఉండటానికి ఇల్లు లేదు. కానీ ప్రభుత్వమే సకూర్చింది.                                                                                          

Continues below advertisement
Sponsored Links by Taboola