Israel Strikes Hezbollah Strongholds In Lebanon : బయట ప్రపంచం నుంచి ఎలాంటి విజ్ఞప్తులు వస్తున్నా.. ఇరాన్ వైపు నుంచి దాడులు జరుగుతున్నా ఇజ్రాయెల్ మాత్రం ముందు తన లక్ష్యాన్నే గురి పెట్టింది. హెజ్‌బొల్లాను పూర్తి స్థాయిలో నాశనం చేయడమే లక్ష్యంగా దాడులు కొనసాగిస్తోంది. తాజాగా లెబనాన్‌లో హెజ్‌బొల్లా ఎక్కడ అయితే బలంగా ఉంటుందో అక్కడ దాడులు చేయడం ప్రారంభించింది. ఈ దాడుల్లో లెబనాన్‌కు చెందిన ఓ మేయర్ చనిపోయారు. పదుల సంఖ్యలో హెజ్‌బొల్లా తీవ్రవాదులు చనిపోయినట్లుగా ఇజ్రాయెల్ చెబుతోంది. 


హెజ్‌బొల్లా బలంగా ఉన్న  చోట్ల మెరుపుదాడులు 


బీరూట్‌పై కొద్ది  రోజుల నుంచి  దాడులు చేయకుండా ఇజ్రాయెల్ సైలెంట్ గా ఉంది. అయితే హఠాత్తుగా బీరుట్ పై క్షిపణులతో విరుచుకుపడింది. కాల్పుల విరమణ కోసం వస్తున్న విజ్ఞప్తులను ఇజ్రాయెల్ ప్రధాని  బెంజమిన్ నెతన్యాహు తన చర్యలతోనే తిరస్కరించారు. దక్షిణ లెబనాన్‌లో హెజ్‌బొల్లా ఆధిపత్యం ఉన్న  ప్రాంతంలో ఇళ్లతో పాటు ఓ మసీదుపైనాబాంబుల వర్షం కురిపించారు. నబాతియ నగరంలో మున్సిపల్ భవనంపై బాంబులు వేయడంతో ఐదుగురు చనిపోయారు. వారిలో ఆ నగర మేయర్ కూడా ఉన్నట్లగా లెబనాన్ తెలిపింది.  



కెనడా ఇక ఖలిస్థాన్ సపోర్టర్లకు మాత్రమేనా ? ఇతర భారతీయులు వెనక్కి రావాల్సిందేనా ?


సీజ్ ఫైర్ ప్రతిపాదనలను తిరస్కరించిన నెతన్యాహు


బీరుట్‌పై దాడులు తగ్గుతాయని అమెరికా హామీ ఇచ్చిన తర్వాత కూడా ఇజ్రాయెల్‌ దాడులు ఉద్ధృతంగా సాగుతున్నాయి.   నబతిహ్‌ నగరంతోపాటు పరిసర ప్రాంతాల్లో 30 నిమిషాల వ్యవధిలో 11 దాడులు జరిగినట్లులెబనాన్ ప్రకటించింది. రెండ్రోజుల క్రితం ఉత్తర లెబనాన్‌లోని అపార్ట్‌మెంటుపై ఇజ్రాయెల్‌ జరిపిన వైమానిక దాడిలో 12 మంది మహిళలు, ఇద్దరు చిన్నారులు సహా 22 మంది చనిపోయినట్లుగా అంతర్జాతీయ సమాజానికి లెబనాన్ తెలిపింది. దీనిపై మానవహక్కుల సంస్థ స్వతంత్ర దర్యాప్తు చేయించనుంది.  



ట్రంప్‌పై మూడోసారి హత్యాయత్నం- ఫేక్ ప్రెస్ కార్డుతో తుపాకీ నిండా బుల్లెట్లుతో వచ్చిన వ్యక్తి అరెస్టు


ఇరాన్ అణు, ఆయిల్ స్థావరాలపై దాడి చేయబోమన్న  ఇజ్రాయెల్ 


ఇజ్రాయెల్‌పై ఇరాన్ కూడా దాడి చేస్తోంది. ఈ క్రమంలో ఇరాన్  చాలా పెద్ద తప్పు చేసిందని బెంజమిన్ నెతన్యాహు ప్రకటించారు. ప్రతి దాడులు తప్పవని హెచ్చరించారు.   ప్రతిదాడుల్లో భాగంగా అక్కడి అణు, చమురు స్థావరాలపై మాత్రం  దాడి చేయబోమని తాజాగా ఇజ్రాయెల్‌ ప్రధాని బెంజమిన్‌ హామీ ఇచ్చినట్లుగా తెలుస్తోంది.  నెతన్యాహు హామీ ఇవ్వడం నిజమేనని  అమెరికా అంటోంది.