US News: అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో కమలా హారిస్, డొనాల్డ్ ట్రంప్ హోరాహోరీగా తలపడుతున్నారు. విజయం కోసం విస్తృతంగా పర్యటనలు చేస్తున్నారు. పార్టీ నేతలు, ప్రచార ర్యాలీల్లో ప్రత్యర్థులపై మాటల తూటాలు పేలుస్తున్నారు. ఈ సమయంలో రిపబ్లికన్ పార్టీ అభ్యర్థి ట్రంప్‌పై హత్యాప్రయత్నాలు జరుగుతున్నాయి. ఇప్పటికే రెండుసార్లు జరిగిన దాడిలో ఆయన తప్పించుకున్నారు. ఇప్పుడు మూడోసారి కూడా మర్డర్ అటెంప్ట్ జరిగింది. ఆయన మాత్రం సురక్షితంగా బయటపడ్డారు.
మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంఫ్ ర్యాలీ వేదికకు కొంత దూరంలో భీకర దాడి చేసేందుకు వచ్చిన వ్యక్తి సెక్యూరిటీ సిబ్బందికి చిక్కారు. గతంలోనే ట్రంప్‌పై రెండుసార్లు దాడికి యత్నించిన సంగతి తెలిసిందే. జులై 13న పెన్సిల్వేనియాలోని బట్లర్‌లో ట్రంప్‌పై మాథ్యూ క్రూక్స్ కాల్పులు జరిపాడు. భద్రతా సిబ్బంది చేతిలో అతను హతమయ్యాడు. ఆ తర్వాత సెప్టెంబర్‌లో రెండోసారి దాడికి ప్రయత్నించారు. ర్యాన్ వెస్లీ రౌత్ అనే వ్యక్తి గోల్ఫ్ కోర్స్‌లో ట్రంప్‌ను చంపడానికి ట్రై చేశాడ. ఆయన్ని పోలీసులు అరెస్టు చేశారు.
మూడోసారి యత్నించిన వ్యక్తి వెమ్ మిల్లర్
మూడోసారి ట్రంప్‌పై దాడి చేసేందుకు వెమ్ మిల్లర్ అనే వ్యక్తి ప్రయత్నించాడు. ట్రంప్ ఎన్నికల ప్రచారంలో ఉన్న ప్రాంతంలో ఆయ్ని భద్రతా సిబ్బంది అరెస్టు చేశారు. అతడి నుంచి బుల్లెట్లుతో లోడ్ చేసిన తుపాకీ, ప్రెస్‌కు సంబంధించిన నకిలీ ఐడీ కార్డు స్వాధీనం చేసుకున్నారు. ఈ ట్రంప్ ర్యాలీ పాస్ కూడా ఆయన వద్ద ఉంది. వెమ్ మిల్లర్ లాస్ వెగాస్ నివాసి.
అమెరికాలో ఎన్నికలు ఎప్పుడు?
అమెరికాలో ఈ ఏడాది అధ్యక్ష, ఉపాధ్యక్ష పదవులకు ఎన్నికలు జరగనున్నాయి. డెమోక్రటిక్ పార్టీ తరఫున కమలా హారిస్ పోటీ చేస్తున్నారు. రిపబ్లికన్ పార్టీ అభ్యర్థిగా డొనాల్డ్ ట్రంప్ తలపడుతున్నారు. కమలా హారిస్ ప్రస్తుతం ఉపాధ్యక్ష పదవిలో ఉన్నారు. రిపబ్లికన్ పార్టీ అభ్యర్థి డొనాల్డ్ ట్రంప్ 2016 నుంచి 2020 వరకు అమెరికా అధ్యక్షుడిగా పని చేశారు.