Israel Palestine War:
బాలికపై అత్యాచారం..
అక్టోబర్ 7వ తేదీన తెల్లవారుజామున ఉన్నట్టుండి ఇజ్రాయేల్‌పై దాడులు మొదలు పెట్టారు హమాస్ ఉగ్రవాదులు. ఈ దాడులతో ఒక్కసారిగా ఉలిక్కిపడింది ఇజ్రాయేల్. వెంటనే పౌరులను రక్షించేందుకు ప్రత్యేక బృందాల్ని రంగంలోకి దింపింది. ఈ సమయంలో కొంత మంది వైద్యులూ రంగంలోకి దిగి గాయపడ్డవారికి చికిత్స అందించారు. వీళ్లలో ఒకరు సంచలన విషయాలు వెల్లడించారు. పేరు చెప్పడానికి ఇష్టపడని ఓ వైద్యుడు హమాస్ ఉగ్రవాదులు ఎలా దాడి చేశారో చెప్పాడు. ఆ సమయంలో తన కళ్లారా కొన్ని దారుణాలనూ చూసినట్టు వివరించాడు. ఓ బాలికను హమాస్ ఉగ్రవాదులు బంధించి అత్యాచారం చేసి ఆ తరవాత చంపేసినట్టు షాకింగ్ విషయాలు చెప్పాడు. ఆ తరవాత సౌత్ ఇజ్రాయేల్‌లో పరిస్థితులు మరింత ఆందోళకరంగా మారాయని అన్నాడు. గాజా, ఇరాన్, హిజ్బుల్లా ఇలా మూడు వైపుల నుంచి దాడులు మొదలయ్యాయి. అయినా తమ టీమ్ ఏ మాత్రం వెనక్కి తగ్గకుండా అందరికీ వైద్యం అందించేందుకే ప్రయత్నించామని చెప్పాడు ఆ వైద్యుడు. ఇజ్రాయేల్‌లోని ప్రజలు ప్రశాంతంగా బతకాలన్నదే తమ లక్ష్యమని, అందుకోసం ఏం చేయడానికైనా సిద్ధంగానే ఉన్నామని వివరించాడు. మిగతా దేశాల్లో ఇలాంటి పరిస్థితులే ఉంటే ప్రపంచం మౌనంగా ఉండేదా అని అసహనం వ్యక్తం చేశాడు. ఇరాన్ ప్రభుత్వం హమాస్ ఉగ్రవాదులతో మాట్లాడి ఈ దాడులు చేయకుండా ఆపుతుందన్న నమ్మకం ఉందని అంటున్నాడు. ఇప్పటికే చాలా మంది ఎక్స్‌పర్ట్‌లు ఈ యుద్ధాన్ని తక్షణమే ఆపేయాలని సూచించారు. అన్ని దేశాలూ ఒక్కతాటిపైకి వచ్చి ఈ దాడుల్ని కట్టడి చేయాలని పిలుపునిచ్చారు.