Israel Palestine Attack:


ఇంటిలిజెన్స్ ఫెయిల్యూర్..? 


పాలస్తీనాకి చెందిన హమాస్ ఉగ్రవాదులు ఇజ్రాయేల్‌పై దాడులు (Israel Gaza Attack Live) కొనసాగిస్తున్నారు. ఇప్పటికే రెండు దేశాల మధ్య యుద్ధ మేఘాలు కమ్ముకున్నాయి. వందలాది మంది ప్రాణాలు కోల్పోయారు. హమాస్ ఉగ్రవాదులు ఇజ్రాయేల్‌ సరిహద్దుల్లోకి చొరబడి అక్కడి పౌరుల్ని కిడ్నాప్ ( Israel Gaza Attack) చేస్తున్నారు. ఆర్మీపైనా దాడులు చేస్తున్నారు. 'Al-Aqsa Flood'ఆపరేషన్ పేరుతో విధ్వంసం సృష్టిస్తున్నారు. అటు ఇజ్రాయేల్ కూడా 'Iron Swords'ఆపరేషన్‌ని లాంఛ్ చేసింది. అయితే...ఇంత ఆకస్మికంగా దాడి చేసేంత వరకూ ఇజ్రాయేల్ ఇంటిజిలెన్స్ ఏం చేస్తోందన్న ప్రశ్నలు తెరపైకి వస్తున్నాయి. ఇది పూర్తిగా ఇంటిలిజెన్స్ ఫెయిల్యూర్‌ అన్న వాదనలు వినిపిస్తున్నాయి. సాధారణంగా  Israeli Defence Forces (IDF) ముందుగానే ఇలాంటి దాడుల్ని పసిగట్టేసి అప్రమత్తమవుతుంది. కానీ...అసలు హమాస్ ఉగ్రవాదుల కదలికలపై అణువంత అనుమానం కూడా రాలేదని కొందరు అధికారులు చెబుతుండటం ఆశ్చర్యం కలిగిస్తోంది. దేశ వ్యతిరేక కార్యకలాపాలపై నిఘా పెట్టకుండా ఎలా ఉన్నారన్నదీ అనుమానాలకు తావిస్తోంది. ఈ క్రమంలోనే సౌదీ అరేబియా కీలక వ్యాఖ్యలు చేసింది. ఇలాంటి పరిస్థితులు వస్తాయని ఇజ్రాయేల్‌ని ముందుగానే హెచ్చరించినట్టు ప్రకటించింది. పాలస్తీనా పౌరుల హక్కులు అణిచివేతకు గురయ్యాయని, ఎప్పుడో అప్పుడు వాళ్ల నుంచి దాడులు ఎదుర్కోక తప్పదని వార్నింగ్ ఇచ్చినట్టు వెల్లడించింది. ప్రస్తతు పరిస్థితులను ఎప్పటికప్పుడు పరిశీలిస్తున్నట్టు తెలిపింది. 


చాకచక్యంగా దాడులు..


నిపుణుల మాటల్లో చెప్పాలంటే...హమాస్ ఉగ్రవాదుల కదలికల్ని (Israel Palestine War) గమనించకపోవడం ఇజ్రాయేల్ నిఘా వైఫల్యమే. చాలా చాకచక్యంగా దాడులు చేశారని ఇజ్రాయేల్ భద్రతా మండలి మాజీ అధికారులే చెబుతున్నారు. అందుకే...దేశం ఒక్కసారిగా ఉలిక్కిపడిందని అంటున్నారు. హమాస్ ఉగ్రవాదుల్ని తక్కువ అంచనా వేశారని, అందుకనే ఈ ముప్పుని ముందుగానే పసిగట్టలేకపోయారని వివరిస్తున్నారు. అటు అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ కూడా ఈ యుద్ధంపై స్పందించారు. ఇజ్రాయేల్‌కి అన్ని విధాలుగా అండగా ఉంటామని ప్రకటించారు. ఇజ్రాయేల్‌ ఓటమిని ఎప్పటికీ అంగీకరించమని తేల్చి చెప్పారు. 


ఇజ్రాయేల్‌పై హమాస్ ఉగ్రవాదుల దాడులు బీభత్సం సృష్టించాయి. ఇప్పటికే 500 మంది ప్రాణాలు కోల్పోయారు. వందలాది మంది గాయపడ్డారు. పరిస్థితులు చేయి దాటి పోతున్నాయి. ఇప్పటికే ప్రధాని బెంజమిన్ నెనన్యాహు యుద్ధానికి సిద్ధమే అని ప్రకటించారు. ఇప్పుడు మరోసారి వార్నింగ్ ఇచ్చారు. హమాస్ ఉగ్రవాదులను తీవ్రంగా హెచ్చరించారు. గాజా వద్ద దాక్కుని దాడులు చేస్తున్న వాళ్లను ముక్కలు ముక్కలు చేసేస్తామని తేల్చి చెప్పారు. గాజాలో ఉన్న పౌరులు అప్రమత్తంగా ఉండాలని, అక్కడి నుంచి బయటకు వచ్చి సేఫ్‌టీ షెల్టర్‌లలో తలదాచుకోవాలని సూచించారు. ఇజ్రాయేల్ సైన్యం హమాస్ ఉగ్రవాదులకు వ్యతిరేకంగా చేపడుతున్న ఆపరేషన్‌ని సహకరించాలని కోరారు. అన్ని చోట్లా వాళ్లు నక్కి ఉన్నారని...వాళ్లను నాశనం చేసేంత వరకూ ఊరుకోమని స్పష్టం చేశారు. Israel Defense Forces (IDF) కి హమాస్ ఉగ్రవాదులను నాశనం చేసే సామర్థ్యం ఉందని తేల్చి చెప్పారు నెతన్యాహు. అమాయక ప్రజల్ని చంపుతుంటే చూస్తూ ఊరుకోం అని వెల్లడించారు. 


Also Read: Israel-Palestine War: ఇజ్రాయెల్‌- పాలస్తీనా యుద్ధం: 500 మందికి పైగా మృతి