Israel Gaza Attack:
టూరిస్ట్‌లపై కాల్పులు..
ఈజిప్ట్‌లో ఇజ్రాయేల్ టూరిస్ట్ గ్రూప్‌పై పోలీస్ ఆఫీసర్‌లు కాల్పులు జరిపారు. ఈ ఘటనలో ఇద్దరు టూరిస్ట్‌లు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. మరో ఈజిప్టియన్ కూడా మృతి చెందాడు. అలెగ్జాండ్రా సిటీలో ఈ ఘటన జరిగింది. ఇజ్రాయేల్‌పై పాలస్తీనా హమాస్ ఉగ్రవాదులు దాడులు చేస్తున్న తరుణంలో ఈ కాల్పులు జరగడం సంచలనమైంది. స్థానిక మీడియా కథనాల ప్రకారం...పోలీసుల కాల్పుల్లో మరో వ్యక్తి కూడా తీవ్రంగా గాయపడ్డాడు. ఈ ఘటన జరిగిన ప్రాంతాన్ని భద్రతా బలగాలు అదుపులోకి తీసుకున్నాయి. దాడి చేసిన పోలీసులను అరెస్ట్ చేశాయి. ఈ దాడికి సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. మూడు ఆంబులెన్స్‌లు అక్కడి చేరుకుని బాధితులను ఆసుపత్రికి తరలించాయి. ఎన్నో దశాబ్దాల క్రితం ఇజ్రాయేల్‌తో ఈజిప్ట్ శాంతి ఒప్పందం కుదుర్చుకుంది. ఇజ్రాయేల్ పాలస్తీనా వివాదం పరిష్కరించడానికి చాలా సార్లు మధ్యవర్తిత్వం కూడా వహించింది. కానీ ఆ ప్రయత్నాలేవీ వర్కౌట్ అవ్వలేదు. శాంతి ఒప్పందం కుదిరినప్పటికీ...ఈజిప్ట్‌లో ఇప్పటికీ ఇజ్రాయేల్ వ్యతిరేక వర్గాలు చాలానే ఉన్నాయి. ఆ దేశం నుంచి ఎవరు వచ్చినా వాళ్లను శత్రువులుగానే చూస్తుంటారు. ఇప్పుడు ఈజిప్ట్ పోలీసులు టార్గెట్ చేసి మరీ ఇజ్రాయేల్ టూరిస్ట్‌లపై కాల్పులు జరపడానికి కారణం కూడా ఇదే. ఇజ్రాయేల్‌లో హింసాత్మక వాతావరణం నెలకొనడానే అదనుగా చూసుకుని ఈజిప్ట్‌లో ఇలాంటి దాడులు ఇంకా పెరిగే ప్రమాదం లేకపోలేదు. అందుకే...ఇలాంటివేవీ జరగకుండా ముందస్తు జాగ్రత్తలు తీసుకుంటామని ఈజిప్ట్ విదేశాంగ శాఖ ప్రకటించింది. పౌరులు జాగ్రత్తగా ఉండాలని సూచించింది.