Israel Iran War: మధ్య ప్రాచ్యం ప్రపంచాన్నే వణికిస్తున్న ప్రాంతం. ఇక్కడ నెలకొన్న అశాంతి కారణంగా ఎప్పుడు ఎలాంటి విపత్తును ఎదుర్కోవాల్సి ఉంటుందో అన్న భయంతో ప్రపంచదేశాలు ఉన్నాయి. అక్కడ చీమ చిటుక్కుమన్నా అలర్ట్ అవుతున్నాయి. గతేడాది అక్టోబర్‌లో హమాస్, ఇజ్రాయెల్ మధ్య మొదలైన యుద్ధం ఇప్పుడు లెబనాన్‌కు చేరుకుంది. తాజాగా ఇరాన్ కూడా ఆ రెండింటికీ మద్దతుగా ఇజ్రాయెల్‌పై బాంబులు వేసింది.
ఇజ్రాయెల్‌ను నాశనం చేయాల్సిందనంటూ హిజ్బుల్లాకు మద్దతును ఇరాన్ సుప్రీం నాయకుడు అయతుల్లా ఖమేనీ ప్రకటించారు. ముస్లిం దేశాలన్నీ తనకు మద్దతు నిలబడాలని పిలుపునిచ్చారు. అంతే కాకుండా గతవారంలో లెబనాన్‌పై జరుగుతున్న దాడికి వ్యతిరేకంగా ఇజ్రాయెల్‌ను టార్గెట్ చేస్తూ క్షిపణలు ప్రయోగించారు. 200కుపైగా క్షిపణులతో ఇజ్రాయెల్‌కు వార్ ఛాలెంజ్ చేసారు.
ఇరాన్ బాంబులు వేసినా ఇజ్రాయెల్ స్పందించలేదు. మాటలతో చేతలతో ఎంత కవ్విస్తున్నప్పటికీ ఇజ్రాయెల్ రియాక్ట్ కావడం లేదు. మాటలతోనే హెచ్చరికలు జారీ చేస్తుందే తప్ప తన ఫోకస్‌ను షిప్టు చేయడం లేదు. ఇరాన్ చేస్తున్న దాడికి వెంటనే ఇజ్రాయెల్ ప్రతీకారం తీర్చుకుంటుందనే చాలా మంది అనుకున్నారు. ఇంత వరకు మాటలతోనే దాడి చేస్తుంది తప్ప వాస్తవంగా ఎలాంటి ప్రతీకార చర్యలకు దిగడం లేదు.
ఆక్టోపస్ యుద్ధంలో ఇజ్రాయెల్ ఇరుక్కుందా?
అనేక సార్లు ఇరాన్‌ను ఇజ్రాయెల్ బెదిరించింది. దాడి మాత్రం చేయడం లేదు. మధ్యప్రాచ్యంలో ఇరాన్ వ్యూహంలో చిక్కుకుందనే టాక్ గట్టిగా వినిపిస్తోంది. ఇజ్రాయెల్‌ను ఆక్టోపస్ యుద్ధ తంత్రంలోఇరాన్ ఇరికించిందని అంటున్నారు. ఇజ్రాయెల్‌కు ఆలోచించుకునే ఛాన్స్ ఇవ్వకుండా ఇరాక్, యెమెన్, లెబనాన్, గాజా నుంచి నిరంతరం దాడులు చేస్తోంది. ఇలాంటి టైంలో ఆ దాడులను సమర్థంగా ఎదుర్కోవడానికే ఇజ్రాయెల్‌కు టైం సరిపోతుంది. ఈ విధంగా, ఈ దాడుల నుండి తన భూమిని రక్షించాలా లేదా ఇరాన్‌పై దాడి చేయాలా అని నిర్ణయించుకోవడం ఇజ్రాయెల్‌కు కష్టం.
ఎనిమిది ఫ్రంట్‌ల నుంచి దాడి
ఇజ్రాయెల్‌కు వ్యతిరేకంగా ఆయుధాలు చేపట్టేందుకు అరబ్ దేశాల పౌరులను సిద్ధం ఇరాన్ చేస్తోంది. ఆక్టోపస్ వార్ విధానంలో అరబ్ పౌరుల్లో ఛాందసవాదాన్ని పెంచి ఇజ్రాయిల్ గడ్డపై దాడి చేసేందుకు సిద్ధపడుతోంది. ఇజ్రాయెల్ ప్రస్తుతం ఎనిమిది సరిహద్దుల నుంచి దాడులను ఎదుర్కొంటోంది. ఇజ్రాయెల్ నేరుగా పశ్చిమాన గాజా, లెబనాన్‌లోని హిజ్బుల్లా, యెమెన్‌లోని హౌతీలు, ఇరాక్‌లోని ఇరాకీ మిలీషియా, అలాగే సిరియాలో ఇరాన్ మద్దతుదారులతో నేరుగా పోరాడాల్సి ఉంటుంది. టెల్ అవీవ్, హదేరా, బీర్షెబాలలో జరిగిన ఉగ్రవాద దాడులు ఇజ్రాయెల్‌ను ఎనిమిది వైపులా చుట్టుముట్టాయి.
మధ్యప్రాచ్య యుద్ధంలో రష్యా ప్రవేశం
ఇప్పుడు రష్యా కూడా ఈ పోరాటంలో ప్రవేశించిందని, హిజ్బుల్లాకు సహాయం చేస్తోందని ఇజ్రాయెల్ ఆరోపిస్తోంది. అందుకే వాళ్లకు రాకెట్లు అందుబాటులో ఉంటున్నాయని అంటోంది. హిజ్బుల్లాకు డ్రోన్‌లతో సహా అనేక ఇతర ఆయుధాలను రష్యా అందజేస్తోందని ఇజ్రాయెల్ పేర్కొంది కొంతకాలం క్రితం ఉక్రెయిన్‌కు ఇజ్రాయెల్ క్షిపణులను పంపినందున ఇరాన్ ప్రతిచర్యలకు దిగుతోంది. ఆక్టోపస్ యుద్ధంలో ఇజ్రాయెల్‌ను ఒంటరిని చేసి ఇరుకున పెట్టే ప్రయత్నాల్లో ఇరాన్‌ను ఉంది.
Also Read: ఇజ్రాయెల్‌పై క్షిపణుల వర్షం, ప్రతిస్పందనగా ఇరాన్‌పై అమెరికా మరిన్ని ఆంక్షలు