Kecak Ramayanam Dance : ప్రపంచంలోనే ముస్లిం జనాభా ఎక్కువ కలిగిన దేశం ఇండోనేషియా... కానీ అక్కడ సంస్కృతి సంప్రదాయాలు చాలావరకు భారతదేశంతో అనుబంధాన్ని కలిగి ఉన్నాయి. ఇండోనేషియాలోని ఓ ప్రాంతంలో జరిగే రామాయణ ప్రదర్శన ప్రపంచ వ్యాప్తంగా పర్యాటకులను ఆకట్టుకుంటుంది. దీనికోసం వివిధ దేశాల నుంచి పర్యాటకులు వచ్చి మరీ వీక్షిస్తుంటారు. బాలిలోని అన్ని ప్రధాన సంప్రదాయ కళలు, నాటకాలు, నృత్యాలతో పాటు ఉలువాటు ఆలయంలోని కేకాక్ నృత్యాన్ని వీక్షించేందుకు ప్రపంచ నలుమూలల నుంచి అధిక సంఖ్యలో పర్యాటకులు వస్తుంటారు. ఈ నృత్యంలో రామాయణంలోని ప్రధాన ఘట్టాలు ప్రదర్శిస్తారు. ఈ నృత్యంలో లంకా దహనం వీక్షకుల్ని ఆకట్టుకుంటుంది.
కేకాక్ డ్యాన్స్
కేకాక్ డ్యాన్స్ ఇండోనేషియాలోని బాలి అత్యంత ప్రముఖ సాంస్కృతిక ప్రదర్శనలలో ఒకటి. ఇది 'ప్రాచీన' సంప్రదాయం మాత్రం కాదు. ఈ నృత్యం 1930లలో బాలినీస్ నర్తకి వయాన్ లింబాక్ - జర్మన్ కళాకారుడు వాల్టర్ స్పైస్ మధ్య సహకారంతో రూపొందించినది. ఈ నృత్యం ఆసియాలోని అత్యంత ప్రసిద్ధ ఇతిహాసం రామాయణం కథను వివరిస్తుంది. వాస్తవానికి భారతదేశం నుంచి ఈ కథ ఆసియాలోని ప్రతి మూలకు, ముఖ్యంగా ఆగ్నేయాసియాకు హిందూ, బౌద్ధ బోధనల ద్వారా వ్యాపించింది. 100 BCలో హిందూ బోధనలు బాలి ద్వీపానికి వచ్చినప్పటి నుంచి రామాయణ కథ సాంస్కృతిక జీవితంలో మతపరమైన , నైతిక బోధనలలో భాగంగా మారింది.
రామాయణంలోని బాలి, ఇండోనేషియా బాలి మధ్య సంబంధం ఏమిటి?
బాలి ద్వీపం అనే సంస్కృత పదం ఇండోనేషియాలోని బాలిగా మారిపోయింది. వామన అవతారం ఇక్కడే జరిగినట్లు ప్రచారం ఉంది. వామనావతారం కేరళలోని తిరుక్కట్కరైలో జరిగిందని, ఆళ్వార్లు లేదా విష్ణువు భక్తులు అంటుంటారు. కిష్కింధ రాజు వాలి ఇంద్రుని కుమారుడు. వాలి- బలి చక్రవర్తి మధ్య ఎటువంటి సంబంధం లేదు. కిష్కింధ భారతదేశంలోని కర్ణాటకలో ఉందంటుంటారు. ఇండోనేషియా ముస్లిం దేశం, కానీ అగస్త్య మహర్షి బోధనలు.. రామాయణం పట్ల ఎక్కువగా గౌరవ అభిమానాలు ఉన్న దేశంగా పేరు ఉంది.
సుకర్ణో ఇండోనేషియా అధ్యక్షుడిగా ఉండగా, భారతీయ ముస్లింల సంఘం అక్కడికి వెళ్లింది. రాజభవనంలో రామాయణం కథా చిత్రాలను చూసి వారు ఆశ్చర్యపోయారు. వాటి గురించి ఆయనను అడగగా.... సుకర్ణో ఇలా అన్నారట... ‘నా మతం ఇస్లాం. నా సంస్కృతి రామాయణం.’ ...తన కుమార్తె మేఘావతి సుకర్ణపుత్రి. ఇదే పద్ధతిలో, ఇండోనేషియా ప్రజలు సంస్కృతంలో చాలా పేర్లు ఉన్నాయి. మొదట రామాయణాన్ని వాల్మీకి రచించారు. రామాయణం త్రేతాయుగంలో జరిగింది. బలి చక్రవర్తి సంఘటన కృతయుగంలో జరిగింది. వేదవ్యాస రచించిన భాగవత పురాణంలో చదవవచ్చు. అందులో బలి చక్రవర్తిని శ్రీమన్నారాయణ భగవానుడు వామనావతారంలో వచ్చి తన పాదంతో పాతాళానికి తొక్కాడని పురణాలు చెబుతున్నాయి.