కరివేపాకే కదా అని తేలిగ్గా తీసుకోకండి. కావాలంటే ఉంచుకుందా... వద్దంటే తీసిపడేద్దామని అనుకోకండి. ఎందుకంటే.. కరిపేపాకు తలుచుకుంటే ఏదైనా చేయగలదు.  న్యూజిలాండ్‌లో కరివేపాకు వల్ల.. భారతీయ మహిళ పడిన కష్టాలు అన్నీఇన్నీ కావు. కస్టమ్స్‌ అధికారులకు దొరికిపోయి.. వారు అడిగే ప్రశ్నలకు సమాధానం చెప్పుకోలేక..  నానా తిప్పలు పడింది ఆ మహిళ. ఏంటి ఇదంతా... కరివేపాకు తీసుకెళ్తే న్యూజిలాండ్‌ కస్టమ్స్‌ అధికారులు ఎందుకు ఆపారు..? వింతగా ఉంది కదూ.


భారతీయలు కరివేపాకు లేకుండా వంటలు చేయరు. కూరల్లో కరివేపాకు వేస్తే... ఆ టేస్టే వేరు. ఆరోగ్యానికి, కళ్లకు కూడా కరివేపాకు మంచింది. భారతీయ మహిళ.. ఇండియా  నుంచి న్యూజిలాండ్‌ వెళ్తూ తనతోపాటు కరిపాకు తీసుకెళ్లింది. దీంతో పాటు కొన్ని కూరగాయలు కూడా పట్టుకెళ్లింది. న్యూజిలాండ్‌ ఎయిర్‌పోర్టులో.. వస్తువులు స్కానింగ్‌  చేస్తుండగా... ఆ మహిళ బ్యాగ్‌లో కరివేపాకు కనిపించింది. అది ఏంటో అర్థం చేసుకోలేదని... కస్టమ్స్‌ అధికారులు. ఆమెను ఆపారు. ఆమె బ్యాగ్‌ ఓపెన్‌ చేసి.. మొత్తం చెక్‌  చేశారు. కరిపేపాకు కూడా గంజాయి అనుకున్నారో ఏమో... ఆమెను గట్టిగా నిలదీశారు. వారు అడిగే ప్రశ్నలకు సమాధానం చెప్పలేకపోయింది భారతీయ మహిళ.


న్యూజిలాండ్‌ కస్టమ్స్‌ అధికారులు... ఆమె వస్తువులన్నీ క్షుణ్ణంగా పరిశీలించారు. ఇండియా నుంచి తెచ్చుకున్న వస్తువుల వివరాలన్నీ సేకరించారు. చివరికి.. కరివేపాకు  గురించే వారికి ఏమీ అర్థం కాలేదు. కరివేపాకు వెంట తెచ్చుకోవడం... పెద్ద తప్పయినట్టు ప్రవర్తించారు. ఆమెకు 200 న్యూజిలాండ్‌ డాలర్లు ఫైన్‌ వేశారు. 200 డాలర్లు.. అంటే..  ఇండియన్‌ కరెన్సీ ప్రకారం దాదాపు 10వేల రూపాయలు. ఆ ఫైన్‌ కట్టి అక్కడి నుంచి వెళ్లిపోయింది ఆ మహిళ. తెలిసిందిగా... కరివేపాకు ఎంత పని చేయగలదో. ఐదు  రూపాయల కరివేపాను న్యూజిలాండ్‌కు తీసుకెళ్లినందుకు... భారతీయ మహిళకు 10వేల రూపాయల ఫైన్‌ పడింది.