కెనడా-భారత్ ల మధ్య ఉద్రిక్త పరిస్థితులు అంతకంతకూ పెరుగతూనే ఉన్నాయి. రెండు దేశాల మధ్య మాటల యుద్ధం కొనసాగుతుండగానే.. కెనడా ఉగ్రవాదులకు స్వర్గమని పెద్ద కామెంట్సే చేసింది ఇండియా. మరి కెనడా రియాక్షన్ ఎలా ఉంటుందో చూడాలి. ఈ పరిస్థితులు ఇలానే కొనసాగితే మాత్రం రెండు దేశాల మీద ఎలాంటి ప్రభావం ఉంటుంది. ఇంపోర్ట్స్, ఎక్స్ పోర్ట్ ఇంకా ఏ రంగాలపై ఈ మాటలదాడులు ఇంపాక్ట్ క్రియేట్ చేస్తాయి ఈ వీడియోలో చూద్దాం.


1. జనాభా
 కెనడా జనాభా మూడు కోట్ల 70లక్షలు. అందులో 14 లక్షల మంది భారతీయులు, లేదా భారత సంతతికి చెందిన ప్రజలు కెనడాలో నివసిస్తున్నారు. అంటే కెనడా జనాభా మొత్తంలో 3.7 శాతం మన దేశానికి సంబంధం ఉన్న ప్రజలే అన్నమాట. కెనడాలో మొత్తం జనాభాలో 7 లక్షల 70 వేల మంది సిక్కుమతానికి చెందినవారు. ఇది కెనడా జనాభాలో 2 శాతం.


అదే ఇండియాలో జనాభా 143 కోట్ల మంది. ఇంతమందిలో 1.7శాతం మంది సిక్కులు. వాళ్లు కూడా ఎక్కువగా పంజాబ్, హర్యానా,  ఢిల్లీ లాంటి రాష్ట్రాల్లో ఎక్కువగా మిగిలిన రాష్ట్రాల్లో చాలా తక్కువమంది నివసిస్తున్నారు. 


2. వాణిజ్యం
 అంటే వర్తకవాణిజ్యాల గురించి మాట్లాడుకుందాం. కెనడా ఇండియా రెండు దేశాల మధ్య ఏడాదికి జరిగే ఎగుమతులు దిగుమతుల విలువ సుమారు లక్ష కోట్ల రూపాయలు. గతేడాదే ఇక్కడ 57శాతం గ్రోత్ రేట్ కనిపించింది. 


కెనడా నుంచి ఎరువులు, రసాయనాలు, క్రిమిసంహారకాలు, బొగ్గు, కోక్ ను మన దేశం దిగుమతి చేసుకుంటోంది. మన దేశం నుంచి కెనడాకు దుస్తులు, ఆటోపార్ట్స్, ఎయిర్ క్రాఫ్ట్స్ ఎక్విప్మెంట్ లాంటి ఇంజినీరింగ్ ప్రొడక్ట్స్ కెనడాకు ఎగుమతి అవుతున్నాయి. 2022 లో కెనడా నుంచి దిగుమతైన వస్తువుల్లో శిలాజ ఇంధనాలు, వుడ్ పల్ప్, ప్లాంట్ ఫైబర్ లాంటివి ప్రధానంగా ఉన్నాయి. 


అంతే కాదు కెనడా మన దేశంలో ఇన్వెస్ట్ చేస్తున్న దేశాల జాబితాలో 17వస్థానంలో ఉంది. కెనడియన్ పోర్ట్ ఫోలియో ఉన్న ఇన్వెస్టర్లు మన స్టాక్ మార్కెట్స్ ల్లో పెట్టిన పెట్టుబడులు మొత్తం 2000 సంవత్సరం లెక్కగడితే సుమారు 30వేల కోట్ల రూపాయలు. 2035నాటికి ఇది 49వేల కోట్ల రూపాయలకు చేరుకోనుంది.


3. విద్య
2018 నుంచి కెనడాలో చదువుకుంటున్న ఇంటర్నేషనల్ స్టూడెంట్స్ ఎక్కువమంది ఉంటున్నది ఇండియా నుంచే. కెనడాలో ఉంటున్న విదేశీ విద్యార్థుల సంఖ్యలో భారతీయులు 3లక్షల 20వేలమంది. ఇది మొత్తం విదేశీవిద్యార్థుల్లో 47 శాతం అంటే అర్థం చేసుకోవచ్చు.. మన పిల్లలు కెనడాలో ఎంత మంది చదువుకుంటున్నారో. కాబట్టి, ఇండియా-కెనడాల మధ్య జరుగుతున్న మాటలు దాడులు తీవ్రరూపం దాలిస్తే.. ఈ రంగాలన్నింటిపైనా ప్రభావం పడే అవకాశం కనిపిస్తోంది.