ABP  WhatsApp

Imran Khan: పాక్ ప్రధానికి ఇమ్రాన్ ఖాన్ డెడ్‌లైన్- 6 రోజుల్లోగా చేయకపోతే!

ABP Desam Updated at: 27 May 2022 01:47 PM (IST)
Edited By: Murali Krishna

Imran Khan:

పాక్ ప్రధానికి ఇమ్రాన్ ఖాన్ డెడ్‌లైన్- 6 రోజుల్లోగా చేయకపోతే!

NEXT PREV

Imran Khan: 


పాకిస్థాన్ మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ ఆ దేశ సర్కార్‌కు డెడ్‌లైన్ విధించారు. పాకిస్థాన్‌లో ఎన్నికలు నిర్వహిస్తామంటూ ఆరు రోజుల్లోగా ప్రకటన చేయాలని అల్టిమేటం జారీ చేశారు. ప్రావిన్సుల్లోని ప్రభుత్వాలను రద్దు చేసి సాధారణ ఎన్నికలు నిర్వహించాలని డిమాండ్‌ చేశారు.


లేదంటే


పాకిస్థాన్ ప్రధాని ఈ ప్రకటన చేయకపోతే దేశం మొత్తాన్ని రాజధాని ఇస్లామాబాద్‌కు తీసుకొచ్చి నిరసన చేపడుతానని హెచ్చరించారు. గురువారం నిర్వహించిన భారీ బహిరంగ సభలో పీటీఐ పార్టీ మద్దతుదారులను ఉద్దేశించి ఆయన మాట్లాడారు.



ఆజాదీ మార్చ్‌ పేరిట తలపెట్టిన మార్చ్‌కు సుప్రీం కోర్టు అనుమతించినా ప్రభుత్వం అడుగడుగునా అడ్డుకుంది. అయినా సరే దీన్ని నిర్వహించాం. సర్కార్‌కు ఆరు రోజులు టైం ఇస్తున్నాం. ఆలోపు దేశంలో ఎన్నికలు నిర్వహిస్తామని ప్రకటించకపోతే రాజధానిలో భారీ ఎత్తున నిరసన చేపడతాం.                                            - ఇమ్రాన్ ఖాన్, పాకిస్థాన్ మాజీ ప్రధాని


మరోవైపు విదేశాల్లో స్థిరపడిన పాకిస్థాన్‌ సంతతి వారు ఓటు వేసేలా ఇటీవల ఇమ్రాన్‌ ప్రభుత్వం తెచ్చిన సంస్కరణలను ప్రస్తుత పాక్‌ ప్రభుత్వం రద్దు చేస్తూ బిల్లు తీసుకొచ్చింది. దీంతో పాటు ఎన్నికల్లో ఈవీఎంలపై నిషేధం విధిస్తూ ప్రవేశపెట్టిన బిల్లుకు జాతీయ అసెంబ్లీ దిగువ సభ ఆమోదం తెలిపింది. బిల్లును ఎగువ సభ అయిన సెనేట్‌కు ఆమోదానికి పంపనున్నారు.


కొత్త ప్రభుత్వం


పాకిస్థాన్ ప్రధానిగా షెహబాజ్ షరీఫ్ ఇటీవల ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. మూడుసార్లు పాకిస్థాన్ ప్రధాన మంత్రిగా పని చేసిన నవాజ్ షరీఫ్‌ సోదరుడు షెహబాజ్ షరీఫ్. నవాజ్ షరీఫ్ 2017లో పదవీచ్యుతుడయ్యారు. అవినీతి కేసుల్లో ఆయన జైలు జీవితం గడిపారు. ప్రస్తుతం ఆయన బ్రిటన్‌లో ఉంటున్నారు. 





షెహబాజ్ షరీఫ్ పాకిస్థాన్‌లోని పంజాబ్ ప్రావిన్స్ ముఖ్యమంత్రిగా పని చేశారు. పీఎంఎల్-ఎన్ అధ్యక్షుడు కూడా ఆయనే. ప్రస్తుతం పాకిస్థాన్ నేషనల్ అసెంబ్లీలో ప్రతిపక్ష నేతగా ఉన్నారు. అయితే వీటన్నింటిని మించి షెహబాజ్ ప్రసంగాలకు ప్రత్యేకమైన ఫ్యాన్స్ ఉన్నారు. ఎందుకంటే ఆయన మాట్లాడే సమయంలో చేతులను చాలా వేగంగా కదిలిస్తారు. అంతేకాకుండా చాలా ఆవేశంగా మాట్లాడతారు. చాలా సార్లు ఆయన మాట్లాడే సమయంలో ముందు ఉన్న మైకులను కూడా పడేస్తుంటారు.

 





Published at: 27 May 2022 01:47 PM (IST)

- - - - - - - - - Advertisement - - - - - - - - -

© Copyright@2025.ABP Network Private Limited. All rights reserved.