Iceland Earthquakes:
ఐస్‌లాండ్‌లో భూకంపాలు..
ఐస్‌లాండ్‌ని (Iceland Earthquake) వరుస భూకంపాలు వణికించాయి. కేవలం 14 గంటల్లోనే 800 సార్లు అక్కడ భూమి కంపించింది. ఫలితంగా ప్రభుత్వం అప్రమత్తమైంది. వెంటనే ‘state of emergency’ ప్రకటించింది. రేక్‌జేన్స్ పెనిన్సులా ప్రాంతంలో భూకంప తీవ్రత (Reykjanes peninsula Earthquake) ఎక్కువగా ఉంది. ఇప్పటికే అధికారులు ప్రజలకు హెచ్చరికలు జారీ చేశారు. భూకంపం మరింత తీవ్రంగా నమోదయ్యే అవకాశముందని, అగ్ని పర్వతాలు బద్దలయ్యే ప్రమాదమూ ఉందని వార్నింగ్ ఇచ్చారు. ఇప్పటికే అందరినీ అప్రమత్తం చేశారు.
"14 గంటల్లో 800 సార్లు భూమి కంపించింది. వెంటనే నేషనల్ పోలీస్ చీఫ్ అప్రమత్తమైంది. ప్రజల ప్రాణాల్ని రక్షించేందుకు అవసరమైన చర్యలు తీసుకోనున్నాం. అందుకే state of emergency ప్రకటించాం. భూకంప తీవ్రత మరీ ఎక్కువగా ఉంది. ఊహించిన దాని కన్నా ఎక్కువగా భూకంపం తీవ్రత నమోదయ్యే అవకాశముంది. ఈ కారణంగా అగ్నిపర్వతాలూ బద్దలయ్యే ప్రమాదముంది"
- ఐస్‌లాండ్ ప్రభుత్వం
మరి కొద్ది రోజుల్లోనే అగ్ని పర్వతాలు పేలే ప్రమాదముందని Icelandic Met Office (IMO) ఇప్పటికే అధికారికంగా ప్రకటించింది. 4 వేల సార్లు భూ ప్రకంపనలు నమోదయ్యాయి. గ్రిండావిక్ ప్రాంతంలో రిక్టర్ స్కేల్‌పై 5.2 తీవ్రత నమోదైంది. పెనిన్సులాలో గతేడాది నుంచి 24 వేల సార్లు భూమి కంపించింది. వచ్చి ప్రతిసారీ తీవ్రత ఎక్కువగానే ఉంటోంది. అందుకే ఈ సారి అప్రమత్తమైంది ప్రభుత్వం. ఎమర్జెన్సీ షెల్టర్స్‌తో పాటు హెల్ప్ సెంటర్స్‌ని ఏర్పాటు చేసింది. 2021 నుంచి మూడు సార్లు భారీ భూకంపాలు నమోదయ్యాయి. గతేడాది మార్చిలో తొలిసారి, తరవాత ఆగస్టులో, ఈ ఏడాది జులైలో భూమి కంపించింది. ఐస్‌లాండ్‌లో 33 అగ్నిపర్వతాలున్నాయి.