Booker Prize 2024 : అంతర్జాతీయ అవార్డు బుకర్ ప్రైజ్ షార్ట్ లిస్టులో ఈ సంవత్సరం ఏకంగా ఐదుగురు మహిళలు చోటు సంపాదించుకున్నారు. ఒకరకంగా చెప్పాలంటే ఇది అరుదైన రికార్డు అని పుస్తక ప్రియులు పేర్కొంటున్నారు. సుమారు 55 సంవత్సరాల తర్వాత ఇలాంటి యాదృచ్ఛిక ఘటన చోటుచేసుకుందని నిర్వాహకులు చెబుతున్నారు. మొత్తం ఆరుగురు ఫైనలిస్టులను ఎంపిక చేయగా అందులో ఐదుగురు మహిళలు నిలవడం విశేషం. ప్రపంచ సాహిత్య రంగంలో బుకర్ ప్రైజ్ కు ఒక ప్రముఖమైన స్థానం ఉంది. ఈ అవార్డు పొందిన వారికి సుమారు 55 లక్షల రూపాయలు బహుమతి లభిస్తుంది. మిగితా ఫైనలిస్టులకు రూ. 2.76 లక్షలు లభిస్తుంది. ఇది ఇలా ఉంటే ముందుగా ఆరుగురు ఫైనలిస్టులను ఎంపిక చేస్తారు కానీ అరుదుగా ఈ సంవత్సరం ఆరుగురులో ఐదుగురు మహిళా రచయితలు ఉండటం విశేషం.
బ్రిటీష్ రచయిత్రి సమంతా హార్వే ‘స్పేస్ 'ఆర్బిటల్', అమెరికన్ రచయిత్రి రాచెల్ కుష్నర్ 'క్రియేషన్ లేక్', కెనడియన్ రచయిత్రి అన్నే మైఖేల్స్ 'హెల్డ్', ఆస్ట్రేలియన్ రచయిత్రి షార్లెట్ వుడ్ 'స్టోన్ యార్డ్ డివోషనల్' పుస్తకాలు ఫైనల్ కోసం ఎంపిక అయ్యాయి. ఇక ఆరుగురు ఫైనలిస్టుల్లో డచ్ రచయిత యేల్ వాన్ డెర్ వుడెన్ ఒకరే పురుష రచయితగా ఉన్నారు. ఆయన నవల 'ది సేఫ్‌కీప్' కూడా బుకర్ ప్రైజ్ ఫైనల్ లిస్టుకు ఎంపిక అయ్యింది.
బుకర్ ప్రైజ్ 2024 షార్ట్‌లిస్ట్ ఇదే..
సమంతా హార్వే(Samantha Harvey) రచించిన 'ఆర్బిటల్':
ఈ నవల 24 గంటల వ్యవధిలో అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం (ISS)లో ఆరుగురు వ్యోమగాముల జీవితాలను ఆవిష్కరించింది.
రాచెల్ కుష్నర్(Rachel Kurien) రచించిన 'క్రియేషన్ లేక్' :
ఫ్రాన్స్‌లోని ఓ తీవ్రవాద సమూహంలోకి వెళ్లిన మహిళపై అల్లుకున్న థ్రిల్లర్ కథ..
అన్నే మైఖేల్స్(Anne Michaels) రచించిన 'హెల్డ్' :
నాలుగు తరాలకు సంబంధించిన ఒక స్ఫూర్తిదాయకమైన కథ.
షార్లెట్ వుడ్(Charlotte Wood) రచించిన 'స్టోన్ యార్డ్ డివోషనల్':
ఈ నవలలో న్యూ సౌత్ వేల్స్‌లోని ఒక కాన్వెంట్‌లో పనిచేసే మధ్య వయస్కురాలైన మహిళ జీవితాన్ని ఆవిష్కరించింది.
పెర్సివల్ ఎవెరెట్(Percival Everett) రచించిన 'జేమ్స్':
మార్క్ ట్వైన్ "ది అడ్వెంచర్స్ ఆఫ్ హకిల్‌బెర్రీ ఫిన్" నవలకు ఇది రీటెల్లింగ్ ప్రక్రియలో రాసిన పుస్తకం.
యాయెల్ వాన్ డెర్ వుడెన్ (Rachel Kushner) రచించిన 'ది సేఫ్‌కీప్':
ఈ నవల నాజీల కాలంలో నెదర్లాండ్స్‌లో యూదుల జీవితాన్ని ఆవిష్కరించింది.
బుకర్ ప్రైజ్‌ను చివరిసారిగా 2019లో మహిళా రచయిత్రి గెలుచుకుంది. 'గర్ల్, వుమన్, అదర్' పుస్తక రచయిత్రి బెర్నార్డిన్ ఎవారిస్టో(Bernardine Evaristo), 'ది టెస్టమెంట్స్' రచయిత్రి మార్గరెట్ అట్‌వుడ్ (Margaret Atwood )ఇరువురు ఆ ఏడాది బుకర్ ప్రైజ్ అవార్డును పంచుకున్నారు. ఇక 1997లో, భారతీయ రచయిత్రి అరుంధతీ రాయ్ ( Arundhati Roy) తన నవల 'ది గాడ్ ఆఫ్ స్మాల్ థింగ్స్'కి బుకర్ ప్రైజ్ అవార్డు పొందారు.
Also Read: యువకుడు కూడా చంద్రబాబులా పని చేయలేడు, మేం అండగా ఉంటాం - పవన్ కల్యాణ్