Elon Musk: బిలియనీర్, టెస్లా సీఈఓ ఎలాన్ మస్క్‌కు తన 18 ఏళ్ల కుమారుడు జేవియర్ షాకిచ్చాడు. ఇటీవల ట్రాన్స్‌జెండర్‌గా మారిన ఈ కుర్రాడు తాజాగా తన పేరుతో పాటు జెండర్ కూడా మార్చుకునేందుకు కోర్టులో దరఖాస్తు చేసుకున్నాడు.
మస్క్ వద్దు
కాలిఫోర్నియాలోని సాంటా మోనికా కోర్టులో ఈ అప్లికేషన్ ఫైల్ చేశాడు జేవియర్. 2022 ఏప్రిల్‌లో జేవియర్ అలెగ్జాండర్ మస్క్ కు 18 ఏళ్లు నిండాయి. తనకు తండ్రి మస్క్‌తో గడపాలని లేదని, అందుకే తన బర్త్ సర్టిఫికేట్‌లో పేరును మార్చాలనుకుంటున్నట్లు దరఖాస్తులో జేవియర్ పేర్కొన్నాడు.
మస్క్ ఇంటి పేరును తన పేరు నుంచి తీసేయాలని, అలానే ట్రాన్స్‌జెండర్ మహిళగా మారిన జేవియర్.. ఆ సర్టిఫికేట్‌లో తన లింగాన్ని కూడా మార్చాలని కోరాడు. తన తండ్రి పేరుతో జీవించేందుకు ఇష్టం లేదని వివరించాడు.
మస్క్ వివాహం
కెనడా నటి జస్టిన్ విల్సన్‌ను 2000 సంవత్సరంలో మస్క్ వివాహం చేసుకున్నాడు. ఎనిమిదేళ్ల తర్వాత ఆమెకు మస్క్ విడాకులు ఇచ్చాడు. అయితే వీరిద్దరికీ ఆరుగురు సంతానం. ఐవీఎఫ్ ద్వారా జస్టిన్ ఇద్దరు కవలలకు జన్మనిచ్చింది. విడాకుల అనంతరం తల్లిదండ్రులిద్దరూ వారి పిల్లల సంరక్షణను చూసుకుంటున్నారు.
కవలల్లో ఒకరైన అలెగ్జాండర్ మస్క్ ప్రస్తుతం పేరు మార్పు కోసం దరఖాస్తు చేసుకున్నారు. అమ్మాయిగా మారిన అలెగ్జాండర్ తన పేరును వివియన్ జెన్నా విల్సన్‌గా మార్చాలని పేర్కొన్నాడు.
ఇటీవల
ట్విట్టర్ డీల్‌తో వార్తల్లో నిలిచిన మస్క్ ఇటీవల చైనాపై కీలక వ్యాఖ్యలు చేశారు. చైనాలో జనాభా పెరుగుదల రేటు భారీ స్థాయిలో పడిపోతోందని నివేదికలు రావడంతో మస్క్ స్పందించారు. అతి తొందరలోనే చైనా జనాభా పతనాన్ని చవిచూడనుందని హెచ్చరించారు. ప్రతి తరంలోనూ భారీ శతంలో జనాభాను చైనా కోల్పోనుందన్నారు.
Also Read: Odisha BJD MLA: 'ఐయాం సారీ- నా పెళ్లి నేనే మర్చిపోయా'- ఎమ్మెల్యే గారు అంత బిజీనా!
Also Read: Agnipath Scheme: 'అంత వరకూ వస్తే మోదీ ఎంత రిస్క్ ఉన్నా లెక్క చేయరు- లీడర్ అంటే ఆయనే'