Odisha BJD MLA: పెళ్లి అనేది జీవితంలో ఎంత ముఖ్యమో అందరికీ తెలిసిందే. అయితే ఎంత ముఖ్యమైన పనులు ఉన్నా, ఎంత పెద్ద బిజినెస్ మ్యాన్ అయినా తన పెళ్లికి తాను హాజరు కావడం మర్చిపోతారా? అలా ఎలా మర్చిపోతారు అనుకుంటున్నారా? అయితే ఒడిశాకు చెందిన బీజేడీ ఎమ్మెల్యే ఏకంగా తన పెళ్లికి తాను వెళ్లడమే మర్చిపోయారట! 







ఇలా జరిగింది


బిజయ్ శంకర్ దాస్.. బీజేడీ పార్టీకి చెందిన ఎమ్మెల్యే. తిర్టోల్ నియోజకవర్గానికి ఆయన ప్రాతినిధ్యం వహిస్తున్నారు. బిజయ్ శంకర్ దాస్ 2022 మే 17న జగత్‌సింగ్‌పుర్‌లోని సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలో తన ప్రేయసి సోమాలిక దాస్‌ను వివాహాం చేసుకోవడం కోసం దరఖాస్తు చేసుకున్నారు.


అయితే సోమాలిక దాస్ శుక్రవారం కార్యాలయానికి వచ్చి తిర్టోల్ ఎమ్మెల్యే బిజయ కోసం ఎదురు చూసింది. ఎమ్మెల్యే, అతని కుటుంబ సభ్యులు ఎవరూ కార్యాలయానికి రాలేదు. దీంతో రెండు గంటలపాటు వారి కోసం నిరీక్షించి సోమాలిక సబ్​ రిజిస్ట్రార్​ కార్యాలయం నుంచి వెళ్లిపోయింది.


ఎమ్మెల్యేపై కేసు


ఆయన ప్రియురాలు పోలీసులకు ఫిర్యాదు చేసింది. పెళ్లి చేసుకుంటానని తనను నమ్మించి, మోసం చేసినట్లుగా ఎమ్మెల్యేపై కేసు పెట్టింది. ఐపీసీ సెక్షన్ 420, 195A, 120B కింద ఆయనపై పోలీసులు కేసు నమోదు చేశారు.


ఖండించిన ఎమ్మెల్యే


తనపై కేసు నమోదైన తర్వాతి రోజు ఎమ్మెల్యే దీనిపై స్పందించారు. తన ప్రేయసిని వివాహం చేసుకునేందుకు తాను సిద్ధంగా ఉన్నట్లు చెప్పారు. రానున్న 60 రోజుల్లో తనను పెళ్లి చేసుకుంటానని తెలిపారు. తన వివాహం రోజు గురించి మర్చిపోయానని సింపుల్‌గా చెప్పారు.


Also Read: Agnipath Scheme: 'అంత వరకూ వస్తే మోదీ ఎంత రిస్క్ ఉన్నా లెక్క చేయరు- లీడర్ అంటే ఆయనే'


Also Read: Presidential Polls 2022: రాష్ట్రపతి రేసులో వెంకయ్య నాయుడు! నడ్డా, అమిత్ షా భేటీ అందుకేనా!