Donald Trump Oath Ceremony: అమెరికా అధ్యక్షుడిగా డొనాల్డ్ ట్రంప్ పదవీ బాధ్యతలను రెండో సారి తీసుకుంటున్నారు. వైట్ హౌస్‌లోకి రెండో సారి అడుగు పెట్టారు. అమెరికా అధ్యక్షుడు అంటే పూర్తిగా ఆ ఒక్క దేశానికి పరిమితమైన అంశం కాదు. ప్రపంచంలోని అన్ని దేశాల ప్రజలూ నివసించే దేశం అమెరికా. అక్కడి అధ్యక్షుడు తీసుకునే నిర్ణయాల ప్రభావం ప్రపంచం అంతటా ఉంటుంది. ముఖ్యంగా భారతీయుల్లోనూ ట్రంప్ పాలన ఎలా ఉంటుందన్నదానిపై ఎంతో ఆసక్తి నెలకొంది. భారత్ పై, భారతీయులపై ట్రంప్ చాలా వరకూ ఆప్యాయత చూపిస్తూ ఉంటారు. కానీ ఆయన నిర్ణయాలు మాత్రం భిన్నంగా ఉంటాయి. అందుకే ట్రంప్ ప్రమాణ స్వీకారంపై భారతీయ అమెరికన్లు భిన్నంగా స్పందించారు.
అధ్యక్ష ఎన్నికల్లో కమలా హ్యారిస్ .. ట్రంప్ ప్రత్యర్థిగా పోటీ చేసినప్పటికీ భారతీయ అమెరికన్లు గణనీయ సంఖ్యలో ట్రంప్ గెలుపు కోసం పని చేశారు. అందుకే ట్రంప్ తన పాలనా టీమ్‌లో భారతీయ అమెరికన్లకు పెద్ద పీట వేశారు. గత ఎన్నికల్లో ఇండియన్ కమ్యూనిటీ ప్రజలు 31 శాతం మంది మద్దతు పలికారని అంటున్నారు. హిందువుల పట్ల ట్రంప్ సానుకూలంగా ఉంటారని చైర్మన్ ఆఫ్ హిందూస్ ఫర్ అమెరికా ఫస్ట్ పీఏసీ చైర్మన్ ఉత్సవ్ సంధూజ తెలిపారు.
ఉపాధ్యక్షుడిగా తెలుగింటి అల్లుడు జేడీ వాన్స్ ఎన్నిక కావడంతో భారతీయ అమెరికన్లు ఎక్కువ హోప్స్ పెట్టుకుంటున్నారు. వారు ట్రంప్ విక్టరీ ర్యాలీకి హాజరయి తమ మద్దతు తెలియచేశారు.
H1b వీసా సమస్యలతో పాటు సుదీర్ఘ కాలంగా పెండింగ్ లో ఉన్న గ్రీన్ కార్డుల పరిమితి పెంచడం వరకూ చాలా సమస్యలను ట్రంప్ పరిష్కరిస్తాడని ఇండియన్ అమెరికన్లు నమ్మకం పెట్టుకున్నారు. ఎన్నికల సభల్లో ఇలాంటి హామీలు చాలా మంది ఇచ్చారు. ట్రంప్ ప్రమాణంలో పాల్గొనేందుకు భారతీయ దిగ్గజాలు ఇప్పటికే అమెరికాకు వెళ్లారు.
ఎక్కువ మంది భారతీయులు ట్రంప్ అభిమానంచినా అభిమానించకపోయినా.. ద్వేషం పెంచేలా చేయకపోతే చాలని అనుకుంటున్నారు.