David Sinclair Anti Aging: వైద్యరంగంలో ఎప్పుడూ ఏదో అద్భుతం జరుగుతూనే ఉంటుంది. అలాంటి ఓ అద్భుతాన్ని చేసి చూపించాడు హార్వర్డ్ శాస్త్రవేత్త డేవిడ్ సింక్లైర్. జీవశాస్త్రవేత్త, యాంటీ ఏజింగ్ పరిశోధకుడు అయిన డేవిడ్ సింక్లైర్ ఎంతో కాలంగా వయస్సును తగ్గించడంపై పరిశోధనలు సాగిస్తున్నారు. తాజాగా ఆయన తన వయస్సును పదేళ్లు తగ్గించుకున్నట్లు ప్రకటించారు. బయోలాజికల్‌గా పదేళ్ల తగ్గించుకున్నానని తెలిపారు. తను పదేళ్లు ఎక్కువ కాలం జీవించగలనని ప్రకటించుకున్నారు. డేవిడ్ సింక్లైర్ ఆస్ట్రేలియాలోని న్యూ సౌత్ వేల్స్ విశ్వవిద్యాలయంలో నుంచి డాక్టరేట్, అమెరికాలోని మసాచుసెట్స్ ఇన్‌స్టిట్యూట్స్ ఆఫ్ టెక్నాలజీ నుంచి పోస్ట్-డాక్టరేట్ పొందారు. చాలా కాలంగా ఆయన హార్వర్డ్ విశ్వవిద్యాలయంలో మనుషుల వయస్సు తగ్గింపుపై జన్యు పరిశోధనలు చేస్తున్నారు. 


ఈ రంగంలో ఆయన చేసిన కృషికి గానూ ఇప్పటి వరకు డజన్ల కొద్దీ అవార్డులు కూడా అందుకున్నారు. టైమ్ మ్యాగజైన్ ప్రచురించిన ప్రపంచంలోని 100 మంది అత్యంత ప్రభావవంతమైన వ్యక్తుల్లో ఒకరిగా ఎంపిక అయ్యారు. ఎన్నో పేటెంట్లను పొందారు. కొన్ని బయోటెక్నాలజీ కంపెనీలను కూడా స్థాపించారు. చాలా పరిశోధనల్లో భాగస్వామిగా ఉన్నారు. తాజాగా ఈ శాస్త్రవేత్త తన డైలీ మార్నింగ్ రొటీన్ గురించి చెప్పుకొచ్చారు. ఆయన రోజూ ఉదయం ఏం తినేవారు, ఏం తాగేవారో తెలుసుకుందామా..


Also Read: Viral Video: బైక్‌తో స్టంట్స్‌ చేస్తూ బొక్కబొర్లా పడ్డ జంట, దిల్లీ పోలీసుల క్రేజీ పోస్టు వైరల్


1. ఆయిల్ పుల్లింగ్


రోజూ ఉదయం కొబ్బరి నూనెతో ఆయన ఆయిల్ పుల్లింగ్ చేసుకుంటారు. కొబ్బరి నూనె నోటిలోని మైక్రోబయోమ్ ను మెరుగుపరుస్తుందని చెబుతున్నారు. రోజూ ఉదయం 20 నిమిషాల పాటు నోట్లో నూనె వేసుకుని నోరంతా తిప్పుతారు. ఇలా చేయడం వల్ల బ్యాక్టీరియా, ట్యాక్సిన్లు తొలగిపోతాయని అంటారు. ఇది ప్రాచీన కాలంలో భారతదేశంలో అవలంబించిన పద్ధతని బిజినెస్ ఇన్‌సైడర్ పేర్కొంది.


2. గోరువెచ్చని నీటిలో నిమ్మరసం, తేనె


ఆయిల్ పుల్లింగ్ తర్వాత నోటిని శుభ్రం చేసుకుని.. గోరు వెచ్చని నీటిలో నిమ్మరసం, తేనె కలుపుకుని తాగుతారు డేవిడ్ సింక్లైర్. ఇది శరీరాన్ని డిటాక్స్ చేస్తుందని, శరీర ఛాయను మెరుగుపరుస్తుందని తెలిపారు. 


3. నాన్ టాక్సిక్ టూత్ పేస్ట్


నాన్ టాక్సిక్ టూత్ పేస్ట్ తోనే పళ్లు తోముకుంటారట సింక్లైర్. సహజ టూత్ పేస్ట్ లలో కృత్రిమ స్వీటెనర్లు, రంగులు, రసాయనాలు, ఫ్లోరైడ్ ఉండవు. అయితే ADA మాత్రం ఫ్లోరైడ్ ఉన్న టూత్ పేస్ట్ వాడాలని సూచిస్తుంది. సోడియం కావిటీస్ ను తొలగించడానికి, ఎనామెల్ ను బలోపేతం చేయడానికి, దంత క్షయాన్ని నిరోధించడానికి సహాయపడుతుంది.


4. పాలీఫెనాల్స్ తో పెరుగు


పాలీఫెనాల్స్ తో కలిసి పెరుగు తీసుకుంటారట డేవిడ్ సింక్లైర్. రెస్వెరాట్రాల్ ను కలిగి ఉండటం వల్ల ఇది యాంటీ ఇన్‌ఫ్లమేటరీగా, యాంటీ క్యాన్సర్, గుండె ఆరోగ్యాన్ని, మెదడు ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుందని సింక్లైర్ చెబుతున్నారు. 


5. గ్రీన్ మాచా టీ


గ్రీన్ మాచా టీలోని ఈసీజీసీ కాటెచిన్స్ క్యాన్సర్ నివారిణి. అలాగే ఇందులోని పోషకాలు, గ్రీన్ టీలోని ఔషధ గుణాలు కడుపు క్యాన్సర్ వచ్చే ప్రమాదాన్ని తగ్గిస్తాయని సింక్లైర్ చెబుతున్నారు. గ్రీన్ మాచా టీలోని యాంటీ ఆక్సిడెంట్లు ఆరోగ్య ప్రయోజనాలను అందిస్తాయి.


6. స్టాండింగ్ డెస్క్‌ వద్ద పని


గ్రీన్ మాచా టీ తర్వాత తన పనులు ప్రారంభిస్తానని చెప్పారు సింక్లైర్. పని సమయంలో వీలైనంతగా కూర్చోకుండా ఉండేందుకు ప్రయత్నిస్తానని చెప్పుకొచ్చారు. ఎక్కువ సేపు కూర్చోవడం వల్ల శరీరంలో ఎక్కువ కొవ్వు నిల్వలు ఏర్పడతాయి. నిలబడటం ద్వారా కరోనరీ వ్యాధులు, మధుమేహం, ఊబకాయం మరియు డిప్రెషన్ ప్రమాదాన్ని పెంచుతాయి. నిలబడటం వల్ల ఎక్కువ కేలరీలు బర్న్ అవుతాయి. గ్లూకోజ్ జీవక్రియ, కండరాల సంకోచాలను మెరుగుపరుస్తుంది. రక్త ప్రసరణను మెరుగుపరుస్తుంది. హృదయనాళ ప్రమాదాలను తగ్గించడంలో సహాయపడుతుందని డేవిడ్ సింక్లైర్ తెలిపారు.


Join Us on Telegram: https://t.me/abpdesamofficial