Joe Biden: అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ ముఖంపై ఓ మిస్టరీ మచ్చ ప్రపంచవ్యాప్తంగా చర్చనీయాంశమైంది. దీనిపై ఆరా తీసిన మీడియాకు వైట్ హౌస్ సంచలన విషయాలు చెప్పింది. బైడెన్‌ స్లీప్ అప్నియాతో బాధపడుతున్నారని అందుకు పరిష్కారంగా CPAP పరికరాన్ని ధరిస్తున్నట్టు చెప్పింది. దాని కారణంగానే అధ్యక్షుడి మొహంపై మచ్చ ఏర్పడినట్టు పేర్కొంది. 


లావుగా ఉన్న బెల్ట్ ఆకారంలో ఉన్న  మచ్చ అధ్యక్షుడి మొహం కనిపించింది. చికాగోలో ఆర్థిక ప్రసంగం చేయడానికి వైట్ హౌస్ నుంచి బయలుదేరినప్పుడు దీన్ని మీడియా గమనించింది. దానిపై ఆరీ తయడం మొదలు పెట్టింది. దీంతో అసలు విషయాన్ని డిప్యూటీ ప్రెస్ సెక్రటరీ ఆండ్రూ బేట్స్ చెప్పారు. బేట్స్‌ మాట్లాడుతూ ప్రెసిడెంట్ బైడెన్ CPAP మెషీన్‌ను ఉపయోగిస్తున్నారని, గురకను నివారించడానికి విస్తృతంగా ఉపయోగించే పరికరం అని తెలిపారు. ఇది స్లీప్ అప్నియా వల్ల శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది లేకుండా ఉండేందుకు దీన్ని ఉపయోగిస్తున్నట్టు పేర్కొన్నారు. CPAPలు ముఖానికి అడ్డంగా ఉండే పట్టీలతో కూడిన మాస్క్‌ని కలిగి ఉంటుందని తెలిపారు. 


ప్రెసిడెంట్ బైడెన్ 2008 నుండి స్లీప్ అప్నియాతో బాధపడుతున్నట్టు రిపోర్ట్స్‌ చెబుతున్నాయని బేట్స్ చెప్పారు. మంగళవారం రాత్రి కూడా బైడెన్‌ CPAP మెషీన్‌ను ఉపయోగించారని వివరించారు. ఈ సమస్య ఉన్న వాళ్లు సాధారణంగా సీప్యాప్ వాడతారని తెలిపారు. 


శ్వేతసౌధంలో తొలిసారి అది ఎక్కువ వయసు కలిగిన అధ్యక్షుడిగా బైడెన్‌ ఎన్నికయ్యారు. అందుకే ఆయన ఆరోగ్యంపై వైట్‌హౌస్‌ నిరంతరం నిఘా పెట్టి ఉంటుంది.