Paracetamol Side Effects: కాస్త జ్వరం ఉంటే చాలు పార్మా సిట్మాల్ వేస్తుంటారు.. బాడీ పెయిన్స్ ఉన్నా మెడికల్ స్టోర్ నుంచి పారాసిట్మాల్ తెచ్చి వేసుకుంటారు. డాక్టర్ సలహా కూడా తీసుకోరు. జ్వరం, బాడీ పెయిన్ అని వైద్యుల వద్దకు వెళితే 90 శాతం మంది వైద్యులు ఇచ్చే మందులో పారాసిట్మాల్ తప్పక ఉంటోంది. ఇదే అదునుగా చాలా మంది వైద్యులతో సంబంధం లేకుండానే ఈ మందు వాడడాన్ని అలవాటుగా చేసుకుంటున్నారు. ఈ అలవాటు అత్యంత ప్రమాదకరమని ఓ పరిశోధనలో తేలింది. పారాసిట్మాల్ టాబ్లెట్ అతిగా తీసుకోవడం వల్ల కాలేయానికి డ్యామేజ్ అవుతుందని ఆ పరిశోధనలో వెల్లడైంది. స్కాట్లాండ్‌లోని ఎండినోబరో వర్శిటీ పరిశోధకులు ఈ విషయాన్ని తేల్చారు. స్కాటిష్ నేషనల్ బ్లడ్ ట్రన్స్‌ఫ్యూజన్ సర్వీస్‌తో కలిపి ఎలుకలపై జరిపిన పరిశోధనలో.. అతిగా పారాసిట్మాల్ తతీసుకోవడం వల్ల ఆ డ్రగ్‌లోని హానికరమైన పదార్థాలు(టాక్సిన్స్) కాలేయానికి కీడు చేస్తాయని తేల్చారు. మనుషులపైనా ఇటువంటి ఇలాంటి దుష్ప్రభావాలనే కనుగొన్నట్టు వెల్లడించారు. ఈ పరిశోధనా పత్రాలు సైంటిఫిక్ రిపోర్ట్స్ జర్నల్స్‌లో ప్రచురితమయ్యాయి.
తీవ్రమైన వ్యాధుల ముప్పు
పారాసిట్మాల్ అతిగా తీసుకోవడం వల్ల కాలేయంపై దుష్ప్రభావం పడుతుందని పరిశోధనలో తేలింది. సిరోసిస్, హెపటైటిస్, కేన్సర్ వంటి వ్యాధులు బారినపడే ప్రమాదం ఉందని పరిశోధకులు వెల్లడించారు. కాలేయంలోని కణజాలం గోడలు ధృడంగా ఉండి.. కణాల మధ్య సంధులను పట్టి ఉంచుతాయి. పారాసిట్మాల్‌ను ఎక్కువగా వాడితే కాలేయంలోకి చేరే టాక్సిన్ కణాల పటుత్వానికి అంతరాయం కలిగిస్తాయని పరిశోధకులు వెల్లడించారు. దీంతో కాలేయంలోని కణజాల నిర్మాణానికి నష్టం వాటిల్లుతుందని పేర్కొన్నారు. ఈ కారణంతోనే హెపటైటిస్, సిరోసిస్, కేన్సర్ వ్యాధుల ముప్పు ఉంటుందని పరిశోధన బృందం వెల్లడించింది.
కాలేయంపై ప్రభావం అందుకే
మందు(డ్రగ్స్) ఏది అయినా నాలుగు దశల్లో పని చేస్తుది. మొదటి దశ జీర్ణాశయంలో కరిగిపోవడం(డిసాల్వింగ్), రెండో దశలో ఔషదం కాలేయాన్ని చేరుతుంది(మెటబాలిజం), మూడో దశలో అక్కడి నుంచి శరీర భాగాలకు చేరుతుంది(డిస్ట్రిబ్యూషన్), మూడో దశలోనే అవసరమైన శరీర భాగానికి ఔషదం అందుతుంది. నాలుగో దశలో ఔషద వ్యర్థాలు మూత్రపిండాల ద్వారా బయటకు వెళతాయి (ఎక్సెర్షన్). ఔషద వ్యర్థాలు చెమట రూపంలోనూ అతి తక్కువ మోతాదులో బయటకు వెళతాయి. ఎక్కువ మోతాదులో ఏ ఔషదాన్ని తీసుకున్నా.. అది మెటబాలిజంపై దుష్ప్రభావాన్ని చూపుతుంది. సాధారణంగా పారాసిట్మాల్ మాత్ర 500 ఎంజీ మోతాదులో లభిస్తుంది. ఒకటి, రెండు మాత్రలు తీసుకోవడంతో ముప్పు ఉండదని ఎడిన్‌బరో పరిశోధకులు పేర్కొన్నారు. ఒళ్లు నొప్పులు ఎక్కువగా ఉన్నవారు రోజులో నాలుగు గ్రాముల దాకా పారాసిట్మాలను వాడవచ్చు. అంతకు మించితే కాలేయానికి ముప్పు తప్పదని పేర్కొన్నారు.