Hot Springs Park: అమెరికాలోని హాట్ స్ప్రింగ్స్ పార్కుకు ఓ ప్రత్యేకత ఉంది. ఇక్కడ నీటి బుగ్గల నుంచి వచ్చే నీరు దాదాపు నాలుగు వేల ఏళ్లనాటి నీరు అని చెబుతారు. 1900 ప్రారంభం నుంచి అమెరికా ప్రజలు ఈ పార్కును ఎక్కువగా సందర్శించారు. ఇది అర్కాన్సాస్‌లోని లిటిల్ రాక్ నుంచి నైరుతి దిశలో ఉంది. ఇక్కడ భూమి నుంచి వేడి నీరు ఉబికి వస్తుంది. ఈ హాట్ స్ప్రింగ్స్ ఇప్పటికీ వారాంతంలో సరదాగా గడపడానికి సరైన ప్రదేశం. నీటి బుగ్గల నుంచి ఉబికి వస్తున్న నీటి నీరు, పర్వత మార్గాల్లో ట్రెక్కింగ్, రుచికరమైన భోజనం, స్పా వంటి వాటిని ఇక్కడ ఆస్వాదించవచ్చు. 2021లో 2.1 మిలియన్ల మంది ప్రజలు హాట్ స్ప్రింగ్స్ నేషనల్ పార్క్‌ని సందర్శించారు. పార్కుకు ఎంట్రీ ఫీజు లేదు. దీని గురించి కొన్ని విశేషాలు మీకోసం..


ప్రకృతి, పట్టణ జీవితాల మిశ్రమం
హాట్ స్ప్రింగ్స్ నేషనల్ పార్క్ పట్టణ, ప్రకృతి జీవితాల మిశ్రమంగా ఉంటుంది. దాదాపు 5,550 ఎకరాలల్లో ఔచిటా పర్వతాలతో ప్రకృతి రమణీయంగా ఉంటుంది.  1800ల ప్రారంభంలో ఏర్పడింది. ఇక్కడ ఉబికి వస్తున్న వేడి నీరు సందర్శకులను ఆకట్టుకుంటుంది. పట్టణ జనాభా దాదాపు 33,000 పైగానే ఉంటుంది. డౌన్ టౌన్‌ చివరలోని ఈ పార్కులో బాత్‌హౌస్‌ (విలాసవంతమైన భననాలు), ఇటుకలతో నిర్మించిన విహార ప్రదేశాలు, ఓపెన్ స్ప్రింగ్‌లు, రెస్టారెంట్‌లు, బార్‌లు, హోటళ్లు, ఆర్ట్ గ్యాలరీలు, వింత దుకాణాలు ఉంటాయి. 


డౌన్‌టౌన్ నుంచి కొద్ది దూరంలో 26 మైళ్ల హైకింగ్ ట్రైల్స్, గల్ఫా జార్జ్ క్యాంప్‌ గ్రౌండ్, ప్రైవేట్ యాజమాన్యం కింద ఉన్న 216-అడుగుల అబ్జర్వేషన్ టవర్‌ సందర్శన పాయింట్లు ఉన్నాయి. దీని నుంచి చుట్టు పక్కల 140 చదరపు మైళ్ల పార్క్, చుట్టుపక్కల గ్రామీణ ప్రాంతాలను చూడొచ్చు. 
 
4,000 ఏళ్ల కంటే పాత నీరు
ఈజిప్షియన్ పిరమిడ్‌లు నిర్మించబడిన సమయంలో హాట్ స్ప్రింగ్స్‌లో కనిపించే నీరు ఉద్భవించిందని ప్రచారంలో ఉంది. ఔచిటా పర్వతాల రాళ్లు, పగుళ్ల ద్వారా 8,000 అడుగుల లోతు వరకు నీరు ప్రవహించటానికి సుమారు 4,400 సంవత్సరాలు పడుతుందట. ఈ నీరు చివరి ప్రాంతాలను చేరుకునే వరకు అనేక శిలల పొరల మధ్ర ప్రవహిస్తూ వేడెక్కుతుందట! 


హాట్ స్ప్రింగ్స్ నీటి ఉష్ణోగ్రత ఇప్పటికీ హానికరమైన బ్యాక్టీరియాను తొలగించే ఉష్ణోగ్రత 143 డిగ్రీల ఫారెన్‌హీట్ ఉంటుందట. ఇక్కడి 47 హట్ స్ప్రింగ్‌లు ప్రతిరోజూ 1 మిలియన్ గ్యాలన్ల నీటిని ఉత్పత్తి చేస్తాయి. కలుష్యాన్ని నివారించేలా, తాగడానికి, స్నానం చేయడానికి ఉపయోగ పడేందత సురక్షితంగా నీరు ఉంటుందట.


బ్రూవరీ ఉన్న ఏకైక జాతీయ ఉద్యానవనం
2014లో ఇక్కడ సుపీరియర్ బాత్‌హౌస్ బ్రూవరీ (మద్యం తయారి)ని ప్రారంభించారు. ఇక్కడ ఏకైక బ్రూవరి ఇదే. హాట్ స్ప్రింగ్ నుంచి వస్తున్న నీటిని ఉపయోగించి ఈ బ్రూవరీ మద్యం తయారు చేస్తుందట. దాదాపు 18 రకాల క్రాఫ్ట్ బీర్‌లతో పాటు రూట్ బీర్‌ను తయారు చేస్తుందట ఈ కంపెనీ.  


ఎల్లోస్టోన్ నేషనల్ పార్క్ కంటే ముందు ఉన్న పార్క్
ఎల్లోస్టోన్ 1872లో ప్రపంచంలోనే మొట్టమొదటి జాతీయ ఉద్యానవనంగా స్థాపించబడింది. అయితే 40 సంవత్సరాల క్రితం US ప్రభుత్వం హాట్ స్ప్రింగ్స్‌ను ఒక ఫెడరల్ రిజర్వేషన్‌గా ఏర్పాటు చేసి, ప్రజల ఉపయోగం కోసం థర్మల్ వాటర్‌లను పరిరక్షించింది. ఇది సహజ వనరులను రక్షించడానికి అమెరికా ప్రభుత్వం ఈ చర్యలు చేపట్టింది. 


విలాసవంతమైన బాత్ హౌస్‌లు
సెంట్రల్ అవెన్యూలో 1892 - 1923 మధ్య విభిన్న శైలిలో విలాసవంతమైన 8 బాత్‌హౌస్‌లను నిర్మించారు.  1947 నాటికి హైడ్రోథెరపీ పరిశ్రమ గరిష్ట స్థాయికి చేరుకుంది. తరువాత 1970 నాటికి చాలా బాత్‌హౌస్‌లు మూసివేయబడ్డాయి. ఆధునిక స్పా కేంద్రాలతో రెండు భవనాలు మాత్రమే నడుస్తున్నాయి. మరికొన్నింటిని వాణిజ్య సముదాయాలుగా మర్చారు. 1915లో నిర్మించిన ఫోర్డైస్‌లో నేషనల్ పార్క్ సర్వీస్ విజిటర్ సెంటర్,  మ్యూజియం ఏర్పాటు చేశారు. ఈ సంవత్సరం బాత్‌హౌస్‌లను పునరుద్ధరించే ఆలోచనలో పార్క్ నిర్వాహకులు ఉన్నారు.


ప్రజల కోసం ప్రత్యేక ఫౌంటేన్లు
హాట్ స్ప్రింగ్స్‌లోని జలాల సంరక్షణ ప్రతి ఒక్కరి బాధ్యతగా అక్కడ పరిగణిస్తారు. పార్క్‌లోని ఏడు వేడి ఫౌంటైన్‌లు, రెండు కోల్డ్ స్ప్రింగ్ ఫౌంటైన్‌ వద్ద ప్రజలు ఉచితంగా నీటిని పట్టుకోవడానికి అనుమతిస్తారు. ఇక్కడ నీటితో వ్యాపారం చేసి పొందిన లాభాలను తిరిగి పార్క్ అభివృద్ధికే వినియోగిస్తారు.