Jack Ma In Nepal: చైనా బిలియనీర్, అలీబాబా వ్యవస్థాపకుడు జాక్ మా నేపాల్ పర్యటనలో ఉన్నారు. మంగళవారం త్రిభువన్ అంతర్జాతీయ విమానాశ్రయానికి చేరుకున్నట్లు ఇమ్మిగ్రేషన్ శాఖ డైరెక్టర్ జనరల్ జలక్రమ్ అధికారి తెలిపారు. బంగ్లాదేశ్ లోని ఢాకా మీదుగా ప్రత్యేక విమానంలో ఖాట్మండులో దిగిన జాక్ మాకు.. నేపాల్ లో వ్యాపార సంబంధాలు ఉన్నాయని సంబంధిత వర్గాలు తెలిపాయి. జాక్ మా స్థాపించిన అలీబాబా.. ఇ-కామర్స్ కంపెనీ అయిన దరాజ్ ను కొనుగోలు చేసిన విషయం తెలిసిందే. ప్రస్తుతం ఈ కంపెనీ పాకిస్థాన్, బంగ్లాదేశ్, శ్రీలంక, మయన్మార్, నేపాళ్ తో సహా దక్షిణాసియా దేశాల్లో సేవలు అందిస్తోంది. జూన్ 2023 నాటికి జాక్ మా 34.5 బిలియన్ డాలర్ల నికర విలువతో చైనాలో 4వ సంపన్న వ్యక్తిగా, ప్రపంచంలో 39వ సంపన్న వ్యక్తిగా ఉన్నట్లు బ్లూమ్ బెర్గ్ బిలియనీర్ ఇండెక్స్ చెబుతోంది. దక్షిణ, తూర్పు ఆసియాలో ప్రసిద్ధి చెందిన దిగ్గజ ఇ-కామర్స్ సంస్థ అలీబాబా.. ఐదేళ్ల క్రితం దరాజ్ ను కొనుగోలు చేసింది. 


జాక్ మా నేపాల్ పర్యటన గురించి చాలా కొద్ది మంది అధికారులకు మాత్రమే తెలుసని సీనియర్ ప్రభుత్వ అధికారి ఒకరు తెలిపారు. అలాంటి ధనవంతుడు నేపాల్ ను సదర్శించడానికి వచ్చినప్పుడు ఆయనను స్వాగతించడానికి ఎలాంటి కారణం ఉండదని వ్యాఖ్యానించారు. జాక్ మా.. ప్రధానమంత్రి పుష్ప కమల్ దహల్ అలాగే ఆర్థిక మంత్రి ప్రకాష్ శరణ్ మహత్ లను కలవాలని ప్రత్యేకంగా అభ్యర్థించినట్లు వారి ప్రైవేట్ సెక్రటేరియట్ లు ధృవీకరించాయి. నేపాల్ లో జాక్ మా ఇతర షెడ్యూల్ అంతా రహస్యంగా ఉంచినట్లు సీనియర్ భద్రతా అధికారి ఒకరు తెలిపారు. గురువారం పాకిస్థాన్ కు బయలుదేరుతారని వెల్లడించారు. అంతకు ముందు జాక్ మా నేపాల్ లోని చిత్వాన్ ను సందర్శిస్తారని, కానీ ఇంకా నిర్ధారణ కాలేదని అన్నారు.


టోక్యో వర్సిటీలో విజిటింగ్ ప్రొఫెసర్ గా పని చేసిన జాక్ మా


బిలియనీర్ అయిన జాక్ మా గత నెల విజిటింగ్ ప్రొఫెసర్ అవతారం ఎత్తారు. ప్రతిష్టాత్మక యూనివర్సిటీ ఆఫ్ టోక్యో అఫిలియేటెడ్ అయిన టోక్యో కాలేజీలో విజిటింగ్ ప్రొఫెసర్ గా ఆయన అపాయింట్ అయ్యారు. సుస్థిర వ్యవసాయం, ఆహారోత్పత్తిలో జాక్ మా టోక్యో కాలేజీ తరఫున పరిశోధనలు సాగిస్తారని తెలిపారు. ఓ విజయవంతమైన పారిశ్రామిక వేత్తగా తన అనుభవాలను ఆయన విద్యార్థులు, కాలేజీ ఫ్యాకల్టీతో పంచుకుంటారని సంబంధిత అధికారులు తెలిపారు. వ్యాపారం, కార్పొరేట్ మేనేజ్‌మెంట్, ఇన్నోవేషన్స్ పై జాక్ మా అనుభవనాలు తమ విద్యార్థులకు ఎంతగానో ఉపయోగపతాయని పేర్కొన్నారు. 


2020లో షాంఘైలో జరిగిన ఓ సమావేశంలో ప్రభుత్వ ఆర్థిక విధానాలపై విమర్శలు చేశారు జాక్‌ మా. అది ప్రభుత్వానికి ఆగ్రహం కలిగించింది. అప్పటి నుంచి ఆయనపై పగ పట్టింది. 2021లో జాక్ మా వ్యాపారాలపై ఆంక్షలు విధించింది చైనా ప్రభుత్వం. జాక్‌ మా మాట్లాడటం అదే చివరి సారి. ఆ తరవాత ఎక్కడా కనిపించలేదు. మాట్లాడనూ లేదు. Ant Group IPOని కూడా చైనా ప్రభుత్వం నిలిపివేసింది. తర్వాత చాలా కాలం తర్వాత ఆయన బయటకు వచ్చారు. అప్పటి నుంచి చాలా లో ప్రొఫైల్ లో ఉంటున్నారు.
Join Us on Telegram: https://t.me/abpdesamofficial