ఒకేసారి రెండేళ్ల వయసు తగ్గించేసిన ప్రభుత్వం, పండగ చేసుకుంటున్న యూత్

Korean Age: సౌత్ కొరియాలో కొత్త ఏజ్ కౌంటింగ్ సిస్టమ్‌ని అందుబాటులోకి తీసుకొచ్చారు.

Continues below advertisement

South Korea Age Counting: 

Continues below advertisement

కొత్త ఏజ్ కౌంటింగ్ సిస్టమ్ 

సౌత్ కొరియాలో కొత్త ఏజ్ కౌంటింగ్ సిస్టమ్ (South Korea Age Counting System) అందుబాటులోకి వచ్చింది. ఇకపై పౌరులందరి వయసూ ఏడాది, రెండేళ్ల వరకూ తగ్గిపోతుంది. అంటే...ఆ మేరకు వాళ్లు యంగ్‌గానే ఉంటారన్నమాట. చాలా ఏళ్లుగా ఏజ్ కౌంటింగ్ సిస్టమ్‌ పాటించడంలో తమ విధానాన్నే అనుసరిస్తోంది ఆ దేశం. ఇకపై అంతర్జాతీయంగా ఆమోదం పొందిన స్టాండర్డ్ మెథడ్‌నే ఫాలో అవనుంది. ఈ కొత్త పాలసీ ప్రకారం పౌరులందరి వయసూ ఒకటి లేదా రెండేళ్ల మేరకు తగ్గిపోతుంది. పాత విధానం ప్రకారం...సౌత్ కొరియాలో పుట్టిన వెంటనే వాళ్ల వయసుని "ఏడాది"గా పరిగణిస్తారు. అంటే...పుట్టిన వెంటనే వాళ్లకు ఓ సంవత్సరం నిండిపోయినట్టు లెక్క. ఆ తరవాత కొత్త సంవత్సరం మొదలవగానే...రెండేళ్లు పూర్తైనట్టు పరిగణిస్తారు. ఉదాహరణకు...డిసెంబర్ 31న ఓ శిశువు జన్మిస్తే...వయసుని ఏడాదిగా పరిగణిస్తారు. జనవరి 1న కొత్త ఏడాది ప్రారంభం కాగానే...ఆ వయసుని పెంచేసి రెండేళ్లుగా కన్సిడర్ చేస్తారు. మరో విధానంలోనూ ఇలా వయసుని లెక్కిస్తారు. ఓ శిశువు జన్మించిన సమయంలో వయసుని "సున్నా" గా లెక్కిస్తారు. అయితే...కొత్త ఏడాది మొదలవగానే 12 నెలలు అనే లెక్కతో సంబంధం లేకుండా...ఆ శిశువు వయసు "ఏడాది"గా ఫిక్స్ అవుతారు. ఈ రెండు విధానాల్లోనూ కనిపించేది ఒకటే. కొత్త ఏడాదితో వాళ్ల వయసులు తారుమారైపోతాయి. ఈ విధానం వల్లే కొరియన్ ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. స్మోకింగ్, డ్రింకింగ్‌కు సంబంధించిన "ఏజ్ ఫ్యాక్టర్‌"తోనూ సమస్యలు ఎదురవుతున్నాయి. 

కన్‌ఫ్యూజన్‌ ఉండొద్దని..

కానీ...ఇందులో మార్పులు చేసిన తరవాత అంతర్జాతీయంగా వయసుని ఎలాగైతే లెక్కిస్తున్నారో...అదే విధంగా లెక్కించనున్నారు. కొరియా టైమ్స్ ఇదే విషయాన్ని అధికారికంగా వెల్లడించింది. గతేడాది డిసెంబర్‌లో ఈ సవరణలకు ఆమోదం తెలిపింది అక్కడి ప్రభుత్వం. వయసు లెక్కింపులో ఎలాంటి కన్ఫ్యూజన్‌కి తావులేకుండా చేయాలన్నదే తమ లక్ష్యం అని అప్పట్లోనే ప్రకటించింది. ఈ మధ్య కాలంలో పాత ఏజ్ కౌంటింగ్ సిస్టమ్‌పై విమర్శలు ఎక్కువయ్యాయి. అధికార పార్టీ నేతలు కూడా దీన్ని వ్యతిరేకించారు. అందుకే..గతేడాది దీనిపై ఓ పోల్ నిర్వహించింది ప్రభుత్వం. అందులో దాదాపు 70% మంది మార్పు చేయడమే మంచిదని అభిప్రాయపడ్డారు. ప్రస్తుతం దేశవ్యాప్తంగా 86% మంది కొత్త ఏజ్ కాలిక్యులేషన్ సిస్టమ్‌పై సంతృప్తితో ఉన్నారు. మిగతా 14% మంది మాత్రం పాత విధానాన్నే అనుసరిస్తామని చెబుతున్నారు. సౌత్ కొరియా ప్రభుత్వం ఇటీవలే పార్లమెంట్‌లో ఈ కొత్త చట్టాన్ని ఆమోదించింది. ఇప్పటి వరకూ ఉన్న "Korean Age" విధానానికి స్వస్తి పలికింది. అంతర్జాతీయ ప్రమాణాలకు అనుగుణంగా ఇకపై పౌరుల వయసుని గణించనుంది. గతేడాది ఎన్నికల ప్రచార సమయంలో దక్షిణ కొరియా అధ్యక్షుడు యూన్ సుక్‌ యేల్ ఈ వయసు గణన విధానాన్ని మార్చేస్తానని హామీ ఇచ్చారు. 1960 ల నుంచి ఆసియా దేశాలన్నీ అంతర్జాతీయ విధానాన్నే అనుసరించి...వయసుని లెక్కిస్తున్నాయి. అంటే...బిడ్డ పుట్టినప్పుడు వయసుని సున్నాగా పరిగణించి..12 నెలలు గడిచాకే "ఏడాది" అని లెక్కిస్తున్నాయి.

Also Read: Boomerang Roti: డ్రోన్స్‌లా ఎగురుతున్న రోటీలు - వైరల్ అవుతున్న వీడియో

Continues below advertisement