కరోనా వైరస్ దెబ్బ నుంచి ప్రపంచం కోలుకోకముందే.. మరో సూక్ష్మజీవి ప్రజలను భయానికి గురిచేస్తోంది. డైరెక్ట్ గా మెదడుపై దాడి చేసి చంపేస్తోంది. అదేంటో తెలుసా..‘అమీబా నెగ్లేరియా ఫోవ్‌లేరి.. అమీబా జాతికి చెందిన సూక్ష్మజీవి ఇది. అప్పట్లో దీని ప్రభావంతో భయపడిపోయిన ప్రజల్లో మళ్లీ వణుకు మెుదలైంది.
అమెరికాలోని టెక్సాస్‌లో ఆర్లింగ్టన్ డాన్ మిసెన్‌హైమర్ పార్క్‌లో ఓ పిల్లాడు ఆడుకుంటున్నాడు. స్ప్రింక్లర్లు, ఫౌంటైన్‌లు, నాజిల్‌లు,నీటిని పిచికారీ చేసే ఇతర సామాగ్రి ఉంటాయక్కడ. అయితే వీటి ద్వారా అమీబా నెగ్లేరియా ఫోవ్‌లేరి సూక్ష్మ జీవి ఆ బాలుడి మెదడులోకి ప్రవేశించింది. అతడిని ఆసుపత్రిలో చేర్పించారు. అయితే బ్రేయిన్-ఈటింగ్ అమిబా ఆ బాలుడి(7)లోకి ప్రవేశించినట్టు వైద్యలు చెప్పారు. దాని కారణంగా తలనొప్పి, వాంతులు లాంటి లక్షణాలతో పిల్లాడు చనిపోయాడు. సెప్టెంబర్ 5న అరుదైన ఇన్ఫెక్షన్ కారణంగా పిల్లలు ఆసుపత్రిలో చేరినట్లు కూడా అధికారులు గుర్తించారు. కలుషితమైన నీరు ముక్కు ద్వారా శరీరంలోకి ప్రవేశిస్తే.. అమీబా నెగ్లేరియా ఫోవ్‌లేరి సోకి.. మరణిస్తారని వైద్యులు చెబుతున్నారు. సురక్షితమైన నీటిలో ఉండాలని.. వేడి నీటిని తాగాలని సూచిస్తున్నారు.
ఎక్కడ ఉంటుందంటే..?
అమీబా నెగ్లేరియా ఫోవ్‌లేరి సాధారణంగా కాల్వలు, చిన్ని చిన్న మురికి గుంటలు, అపరిశుభ్ర స్విమ్మింగ్ పూల్స్, తాగునీటి కుళాయిల ఉంటాయి. తాజాగా చనిపోయిన పిల్లాడికి కూడా పార్క్ లోని నీటి ద్వారా సోకినట్లు తెలుస్తోంది. గార్డెన్‌లో ఆడుకుంటుండగా స్ప్రింక్లర్‌లోని నీరు బాలుడిపై పడి వ్యాధి వచ్చినట్టు చెబుతున్నారు.
ఎలా సోకుతుందంటే..?
అమీబా నెగ్లేరియా ఫోవ్‌లేరి సూక్ష్మజీవి ఉన్న నీటిని తాగినా, అందులో స్నానం చేసినా, ముక్కు ద్వారా లోపలికి ప్రవేశించి నేరుగా మెదడుకు చేరుతుంది. ఆ తర్వాత మెల్లమెల్లగా ప్రభావం చూపిస్తుంది. ఈ సూక్ష్మజీవి కారణంగా విపరీతమైన తలనొప్పి, వాంతులు, మెడపట్టేయడంతోపాటు చిరాకు, అలసటలాంటి లక్షణాలు చూడొచ్చు. ఆ తర్వాత మతిమరుపు, భయం వస్తాయని చెబుతున్నారు వైద్యులు. అంత ప్రమాదకరమైన వ్యాధి కాదని వైద్య నిపుణులు చెబుతున్నారు. వేడి నీటిని తాగాలని అంటున్నారు. స్నానానికి, వంట కోసంకుళాయి నీటిని వాడొద్దట. అమెరికాలో 2010-2019 మధ్యలో మెదడు తినే అమిబాకు సంబంధించి 34 కేసులు మాత్రమే నమోదయ్యాయని చెప్పారు.
ఇంట్రస్టింగ్ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్ చేయండి
Also Read: Afghanistan Crisis: భారత్‌కు తాలిబన్ల లేఖ.. విమాన సర్వీసులు పునరుద్ధరించాలని విజ్ఞప్తి
Also Read: China Power Crisis: చీకట్లో చైనా.. పరిశ్రమలకు చిక్కులు.. ఇక ప్రపంచానికి చుక్కలు!