చికెన్ మంచూరియాపై న్యూయార్క్ టైమ్స్ ఓ ట్వీట్ చేసింది. ఇది పాకిస్తానీచైనీస్ వంటకమని అని... సౌత్ ఏసియాలో ఎక్కువ దొరుకుతుంది అందులో పేర్కొంది. దీనిపై నెటిజన్లు మండిపడుతున్నారు. అసలు దీని పుట్టకే ఇండియాలో జరిగిందని అలాంటి వంటకాన్ని వైరి దేశాలకు ఆపాదించడాన్ని తప్పుపడుతున్నారు. దీంతో చికెన్ మంచూరియా ఇప్పుడు చాలా హాట్ డిబెట్‌గా మారిపోయింది.
చికెన్ మంచూరియా సాస్‌లో వేయించి చేసే వంటకం. నోరూరించే ఈ ఆహారాన్ని భోజన ప్రియులు లొట్టలేసుకుని మరీ తింటుంటారు. ఈ వంటకానికి చాలా దేశాల్లో విపరీతమైన ఫాలోయింగ్ కూడా ఉంది. అయితే న్యూయార్క్ టైమ్స్ ట్వీట్‌తో దీని మూలాలు వెతికే పనిలో ఉన్నారు నెటిజన్లు. అసలు ఈ వంటకం తొలిసారిగా ఎక్కడ తయారైంది? ఎవరు తయారు చేశారు? ఇది చైనాదా? పాకిస్తాన్‌దా? మన ఇండియాదా? అనే సందేహాలు వ్యక్తం చేస్తున్నారు.
ఈ చికెన్ మంచూరియాను పాకిస్తానీ చైన్ వంటలో స్టాల్వార్ట్‌గా వాడతారని ది న్యూయార్క్ టైమ్స్ పేర్కొంది. 90వ దశకంలో పాకిస్తాన్‌లోని లాహరోర్‌లోని ఈ వంటకాన్ని తయారు చేశారని వెల్లడించింది. అంటే ఈ వంటకం పాకిస్తానీ నుంచి వచ్చినట్టుగా పేర్కొంది. దీనిపైనే నెటిజన్లు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. ఈ వంటకం పుట్టింది ఇండియాలోనే అని చైనా పత్రిక పేర్కొన్నట్టు ఆధారాలు చూపిస్తున్నారు.
ఈ వంటకాన్ని చైనీస్ పద్ధతిలో ఉడికించి చేయడం వల్ల ఇది చైనీస్ వంటకమనే భ్రమలో ఉన్నారంటున్నారు. 2017లో సౌత్ చైనా మార్నింగ్ పోస్ట్ చికెన్ మంచూరియా భారతీయ వంటకాల్లోకి ఎలా వచ్చిందో చాలా వివరంగా చెప్పింది. భారత్ లో జన్మించిన చైనీస్ చెఫ్ నెల్సన్ వాంగ్ రూపొందించారని పేర్కొన్నారు. ఆయనే దీన్ని మొదట తయారు చేశారనేందుకు మాత్రం ఎలాంటి ఆధారాలు చూపించలేకపోయింది. కోల్‌కతాలో జన్మించిన వాంగ్ ముంబైలో క్రికెట్ క్లబ్ ఆఫ్ ఇండియాలో చెఫ్‌గా ఉన్నప్పుడు ఈ వంటకాన్ని తయారు చేశారట. అతను 1983లో చైనా గార్డెన్‌లో తన రెస్టారెంట్‌ను కూడా ప్రారంభించారు. ఇది ఇప్పుడు భారతదేశం, నేపాల్ అంతటా అవుట్‌లెట్‌లతో వెలుగొందుతోంది.
న్యూయార్క్ టైమ్స్ చేసిన ట్వీట్ ఇప్పుడు వైరల్‌గా మారింది. దీనిపై మీమ్స్, నెటిజన్ల రిప్లైలు మామూలుగా లేదు. చికెన్ మంచూరియా తిన్నంత హాట్‌గా ఉంటున్నాయి.
మంచూరియాను తర్వాత రకరకాల ఫార్మాట్‌లలోకి మార్చేశారు. గోబీ మంచూరియా, వెజ్ మంచూరియా, పన్నీర్ మంచూరియా ఇలా శాఖారాంలోకి కూడా తయారు చేస్తున్నారు. చికెన్ మంచూరియన్‌ను సోయా సాస్ మిశ్రమంలో పూసిన చికెన్ ముక్కలతో తయారు చేసి, అల్లం, వెల్లుల్లి, పచ్చి మిరపకాయల సాస్‌తో వేయించాలి. ఇది సోయా సాస్ గ్రేవీకి, కొన్నిసార్లు వెనిగర్, కెచప్‌ని కూడా యాడ్ చేస్తారు.