Canda PM Race: కెనడా ప్రధాని రేసులో భారత సంతతి కెనడా(Canada) ఎంపీ చంద్ర ఆర్య(Chandra Arya) ముందంజలో ఉన్నారు. ప్రధాని పదవికి ఆయన నామినేషన్ దాఖలు చేశారు. ఇటీవల కెనడాలో చోటుచేసుకున్న రాజకీయ పరిణామాలతో ప్రధాని ట్రూడో(Trudeau) రాజీనామా చేయగా...కొత్త అభ్యర్థిని ఎన్నుకోవాల్సి ఉంది.
సుస్థిర సమాజం కోసం కఠిన నిర్ణయాలు
కెనడా ప్రధాని పదవి కోసం పోటీపడనున్నట్లు ఇటీవలే చంద్ర ఆర్య ఎక్స్ వేదికగా ప్రకటించారు. భావితరాల భవిష్యత్ కోసం సాహసోపేతమైన నిర్ణయాలు తీసుకోవాలంటూ ఆయన ఎక్స్‌లో పోస్టు చేశారు. లిబరల్ పార్టీ నేతగా ఎన్నికైతే తన నైపుణ్యాలు వినియోగించి ప్రధాని పదవి(Prime Minister) చేపడతానని ఆయన తెలిపారు. తీవ్ర ఒడిదొడుకులు ఎదుర్కొంటున్న కెనడా ఆర్థిక వ్యవస్థను పునరుద్ధరిస్తానని ఆయన కెనడా(Canada) ప్రజలకు హామీ ఇచ్చారు. కెనడాలో శ్రామికులు, మద్యతరగతి ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారన్న చంద్ర ఆర్య.... సుస్థిర సమాజం నిర్మాణం కోసం కఠిన నిర్ణయాలు తీసుకోవాల్సిన సమయం ఆసన్నమైందన్నారు. అందుకు తన వద్ద అనేక పరిష్కారాలు సైతం ఉన్నాయని చెప్పారు.
సాహసోపేతమైన రాజకీయ నిర్ణయం ఆప్షనల్‌గా ఎన్నుకున్నది కాదని...కీలక బాధ్యతలు స్వీకరించి ప్రధానిగా కెనడాను ముందుకు నడిపిస్తానన్నారు. ఈమేరకు ఆయన కెనడా ప్రధాని పదవి కోసం నామినేషన్ దాఖలు చేశారు.మార్చి 9న కెనడా నూతన ప్రధాని ఎవరనేది తేలనుంది.
2015లో రాజకీయాల్లోకి..
కర్ణాటక(Karnataka)లోని సిరా తాలుకాలోని ద్వార్లు అనే కుగ్రామంలో చంద్ర ఆర్య జన్మించారు. ధార్వాడ్‌లో మెడిసిన్ పూర్తిచేసి, కెనడా వెళ్లి స్థిరపడ్డారు. తొలినాళ్లలో ఇన్వెస్ట్‌మెంట్ అడ్వైజర్‌గా కెరీర్ ప్రారంభించిన ఆయన.... ఆ తర్వాత ఓ కంపెనీ ప్రారంభించారు. వివిధ దేశాలకు శాఖలను విస్తరించారు. 2015లో రాజకీయాల్లోకి వచ్చిన చంద్ర ఆర్య.... 2015, 2019ల్లో కెనడా హౌస్ ఆఫ్ కామన్స్ ఎన్నికల్లో వరుసగా విజయం సాధించారు. 2022లో సభలో కన్నడలో ప్రసంగించి.. అందరి దృష్టిని ఆకర్షించారు. దివంగత ప్రధాని ఇందిరాగాంధీ(Indira Gadhi) హత్యను పురస్కరించుకుని కెనడాలో హిందూ దేవాలయాలను ధ్వంసం చేయడాన్ని ఖండిస్తూ...ఖలిస్తాన్ మద్దతుదారులకు వ్యతిరేకంగా ఆర్య గళం విప్పారు.
గతేడాది ఆగస్టులో ప్రధాని నరేంద్ర మోడీ(Modi)ని ఢిల్లీలో కలిసిన చంద్ర ఆర్య....కెనడాలో పరిస్థితులను వివరించారు.చాలా మంది కెనడియన్లు, ముఖ్యంగా యువత ఆర్థిక సమస్యలను ఎదుర్కొంటున్నారని తెలిపారు. శ్రామిక మధ్యతరగతి ప్రజలు కష్టాల్లో ఉన్నారని...అనేక కార్మిక కుటుంబాలు పేదరికంలోకి నెట్టబడుతున్నాయని తెలిపారు. కెనడా ఎగుమతులు,పెట్టుబడులకు భారత్ కీలక దేశమని తెలిపారు. అలాగే ప్రతిభ కలిగిన మానవ వనరుల కొరత కెనడాను వేధిస్తోందని ఆయన....అందుకు తాము భారత్‌పై ఆధారపడక తప్పదని నొక్కి చెప్పారు.
క్లారిటీగా ఉన్న చంద్ర ఆర్య
సాహసోపేతమైన పెద్ద నిర్ణయాలు తీసుకోవడంలో ఏమాత్రం భయపడని నాయకత్వాన్ని కెనడా కోరుకుంటోందని. ఆర్థిక వ్యవస్థను పునర్‌నిర్మించే నిర్ణయాలు, కెనడియన్లందరికీ సమాన అవకాశాలు సృస్టించేందుకు, పిల్లలకు సురక్షితమైన భవిష్యత్‌ను అందించేందుకు తీసుకోవాల్సిన సాహసోపేతమైన రాజకీయ నిర్ణయాలు ఐచ్ఛికం కాదని... అవిఎంతో అవసరమని చంద్రఆర్య నొక్కి చెప్పారు. ఈ బాధ్యతలను స్వీకరించడానికే ప్రధానిమంత్రి పదవికి పోటీపడుతున్నట్లు చంద్ర ఆర్య తెలిపారు. భారత సంతతి వ్యక్తులు ఇతర దేశాల్లో కీలక పదవులకు పోటీపడటం కొత్తేమి కాదు. ఇటీవల అమెరికా అధ్యక ఎన్నికల్లో పోటీ చేసిన కమలాహారిస్ కూడా భారత సంతతికి చెందిన మహిళే.
Also Read: US Presidential Inauguration: అమెరికా అధ్యక్షుడితో ఎవరు ప్రమాణం చేయిస్తారు ? పూర్తి షెడ్యూల్ ఇదే