Rishi Sunak Helicopter Trip:
ఒక్క ట్రిప్‌కి రూ.6 లక్షల ఖర్చు
దేశ ప్రధాని అంటే ఆయన చేసే ప్రతి పైనా ఫోకస్ ఉంటుంది. కాస్త తేడా వచ్చినా సరే విమర్శలు ఎదుర్కోక తప్పదు. ఇప్పుడు బ్రిటీష్ ప్రధాని రిషు సునాక్‌కు ఇదే అనుభవం ఎదురవుతోంది. అసలే దేశ ఆర్థిక పరిస్థితి ఏమీ బాలేదు. ద్రవ్యోల్బణం పెరుగుతోంది. ఇలాంటి సమయంలో ఖర్చులు తగ్గించుకోవాలనే చూస్తారంతా. కానీ సునాక్ మాత్రం 257 కిలోమీటర్ల దూరానికే హెలికాప్టర్‌లో ట్రావెల్ చేయడంపై విమర్శలు వెల్లువెత్తున్నాయి. ట్రైన్ జర్నీ చేసి ఖర్చులు తగ్గించుకోవచ్చుగా అని విమర్శిస్తున్నారు. లండన్ నుంచి సౌతాంప్టన్‌కు 257 కిలోమీటర్లు. ట్రైన్‌లో వెళ్తే 30 పౌండ్లు (మన కరెన్సీలో రూ.3,105) ఖర్చవుతుంది. కానీ...సునాక్ మాత్రం ఫ్లైట్‌లో వెళ్లేందుకే మొగ్గు చూపారు. ఫ్లైట్‌లో వెళ్లినందుకు అయిన ఖర్చు...6 వేల పౌండ్లు. అంటే మన కరెన్సీలో రూ.6.21 లక్షలు. రెండింటికీ ఇంత తేడా ఉంది కాబట్టే...అంతగా విమర్శలు వస్తున్నాయి. సౌతాంప్టన్‌లోని ఓ ఫార్మసీ వెళ్లేందుకు హెలికాప్టర్‌లో ప్రయాణించారు సునాక్. హెల్త్ పాలసీలను ప్రమోట్ చేయడంలో భాగంగానే పర్యటించినప్పటికీ...ఇంత ఖర్చెందుకు అని ప్రశ్నిస్తున్నారు సునాక్‌ను వ్యతిరేకించే వాళ్లు. The Guardian న్యూస్ ఈ విషయాన్ని వెలుగులోకి తీసుకొచ్చింది. ప్రజలు కడుతున్న పన్నులను ఇలా దుర్వినియోగపరుస్తున్నారంటూ ఇప్పటికే కొంత మంది వాదనలు మొదలు పెట్టారు. ప్రస్తుతం అక్కడి మీడియా చెబుతున్న లెక్కల ప్రకారం రిషి సునాక్ ఆస్తుల విలువ రూ.7,556 కోట్లు. సొంత ఖర్చులతో హెలికాప్టర్‌లో ప్రయాణించొచ్చుగా అని ఇంకొందరు మండి పడుతున్నారు.
వివరణ..
మొత్తానికి ఈ ఒక్క పర్యటనతో సునాక్‌పై రాజకీయంగా ఒత్తిడి పెరిగిపోయింది. అయితే..సునాక్ ప్రతినిధి మాత్రం ఈ పర్యటనపై వివరణ ఇచ్చారు. ఆయన వరుసగా కొన్ని మీటింగ్‌లకు హాజరవ్వాల్సి వచ్చిందని అందుకే హెలికాప్టర్‌లో వెళ్లారని చెప్పారు.
"ప్రధాని సునాక్ వరుసగా కొన్ని మీటింగ్‌లకు హాజరవ్వాల్సి వచ్చింది. ఆ మీటింగ్‌లు అయిపోయే టైమ్‌ని బట్టి మిగతా షెడ్యూల్‌ని అడ్జస్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. అందుకే ట్రైన్‌లను కాకుండా స్పెషల్ హెలికాప్టర్ అయితే ఎలాంటి ఇబ్బంది ఉండదని భావించారు. ప్రజల కోసమే ఈ నిర్ణయం తీసున్నారు"
- రిషి సునాక్ ప్రతినిధి
స్థానిక ఎన్నికల్లో కన్జర్వేటివ్ పార్టీ (Conservative Party) 1000కి పైగా కౌన్సిల్ సీట్‌లు కోల్పోయింది. ఇదే సునాక్‌కు పెద్ద షాక్ ఇచ్చింది. ఇది జరిగిన వారం రోజులకే హెలికాప్టర్ ప్రయాణం చేయడం విమర్శల డోస్‌ని పెంచింది.
రిషిపై సుధామూర్తి కామెంట్స్
బ్రిటన్ ప్రధాని రిషి సునాక్...ఇన్‌ఫోసిస్ నారాయణ మూర్తి అల్లుడే అన్న సంగతి తెలిసిందే. సునాక్ అత్తగారు, ఇన్‌ఫోసిస్ ఛైర్‌పర్సన్ అయిన సుధామూర్తి అల్లుడిపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. తన కూతురు అక్షతా మూర్తి కారణంగానే సునాక్ బ్రిటన్ ప్రధాని అయ్యారని అన్నారు. ఇందుకు సంబంధించిన ఓ వీడియో వైరల్ అవుతోంది. ఇందులో సుధామూర్తి తన భర్త నారాయణ మూర్తి గురించి కూడా ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశారు.
"నేను నా భర్తను (నారాయణ మూర్తి) బిజినెస్‌మేన్‌ని చేశాను. అదే విధంగా నా కూతురు అక్షతా మూర్తి రిషి సునాక్‌ను ప్రధాని స్థాయికి తీసుకెళ్లింది. ఆయన ప్రధాని అవ్వడానికి కారణం నా కూతురే. ఓ భార్య భర్తను ఎంత గొప్పగా మార్చగలదో చెప్పడానికి ఇవే ఉదాహరణలు. నా భర్తను నేను మార్చడం మాత్రే కాదు. ఆయనను సంపూర్ణ వ్యక్తిగా తీర్చి దిద్దాను"
- సుధామూర్తి, ఇన్‌ఫోసిస్ ఛైర్‌పర్సన్
Also Read: Pakistan Protests: అల్లర్లతో అట్టుడుకుతున్న పాకిస్థాన్, వెయ్యి మంది అరెస్ట్