Brazil Rains: బ్రెజిల్‌లో వర్షాలు, వరదల ధాటికి ప్రజలు బెంబేలెత్తిపోతున్నారు. ఈశాన్య బ్రెజిల్‌లో కుండపోత వర్షాల కారణంగా 44 మంది మృతి చెందారు. వర్షాలు, వరదల ధాటికి మరో 44 మంది గల్లంతయ్యారు. భారీ వర్షాల వల్ల మరో 25 మంది గాయపడ్డారని బ్రెజిల్ ప్రభుత్వం ప్రకటించింది.










భారీ ప్రభావం






వరదల కారణంగా 3,957 మంది ఆశ్రయం కోల్పోయినట్లు ప్రభుత్వం. బ్రెజిల్‌లో ఇటీవల కొండచరియలు విరిగిపడటంతో పాటు వరదలు వచ్చాయి. భారీ వర్షాల కారణంగా బ్రెజిల్ దేశంలోని నదులు పొంగి ప్రవహిస్తున్నాయి. దాదాపు 1,200 మంది సిబ్బంది సహాయక చర్యల్లో నిమగ్నమయ్యారు. వరద ప్రభావిత ప్రాంతాల నుంచి ప్రజలను పునరావాస కేంద్రాలకు తరలిస్తున్నారు అధికారులు. 


ప్రతి ఏటా బ్రెజిల్‌లో వర్షాల ధాటికి వందలాది మంది బ్రెజిలియన్లు మరణిస్తున్నారు. గత నెల ప్రారంభంలో రాష్ట్రంలో వరదలు, కొండచరియలు విరిగిపడటంతో 14 మంది మరణించారు.


Also Read: UPSC Civil Services Final Result 2021: UPSC-2021 ఫలితాలు విడుదల- టాప్ ర్యాంకర్ ఎవరో తెలుసా?


Also Read: Nepal Plane Crash: నేపాల్ విమాన ప్రమాదం అప్‌డేట్- 14 మృతదేహాలు లభ్యం