UPSC Civil Services Final Result 2021: సివిల్స్- 2021 ఫలితాలు విడుదలయ్యాయి. సివిల్స్ ఫలితాల్లో శృతి శర్మ టాపర్‌గా నిలిచారు. 685 మందిని ఎంపిక చేసింది యూపీఎస్సీ. అంకితా అగర్వాల్ రెండో ర్యాంక్, గామిని సింగ్లా 3వ ర్యాంక్, ఐశ్వర్య వర్మ 4వ ర్యాంకు, ఉత్కర్ష్ ద్వివేది 5వ ర్యాంక్ సాధించారు. సివిల్ సర్వీసెస్‌లో ఈసారి అమ్మాయిలు సత్తా చాటారు. టాప్-5లో నలుగురు అమ్మాయిలే కావడం విశేషం. 


జనరల్‌ కోటాలో 244, ఈడబ్ల్యూఎస్‌ 73, ఓబీసీ 203, ఎస్సీ 105, ఎస్టీ విభాగం నుంచి 60 మంది ఎంపికయ్యారు. ఐఏఎస్‌కు 180 మంది, ఐపీఎస్‌కు 200 మంది, ఐఎఫ్‌ఎస్‌కు 37 మంది ఎంపికయ్యారు. సెంట్రల్‌ సర్వీసెస్‌ గ్రూప్‌ ఏ కేటగిరీకి 242 మంది, 90 మంది గ్రూప్‌ బీ సర్వీసులకు ఎంపికయ్యారు.  


తెలుగువాళ్లు



  1. యశ్వంత్ కుమార్ రెడ్డి- 15వ ర్యాంక్

  2. పూసపాటి సాహిత్య- 24వ ర్యాంక్

  3. శృతి రాజ్యలక్ష్మి- 25వ ర్యాంక్‌ 

  4. రవి కుమార్-38వ ర్యాంక్

  5. కొప్పిశెట్టి కిరణ్మయి- 56వ ర్యాంక్

  6. పాణిగ్రహి కార్తీక్‌- 63వ ర్యాంక్‌

  7. సుధీర్ కుమార్ రెడ్డి- 69వ ర్యాంక్

  8. శైలజ- 83వ ర్యాంక్‌

  9. శివానందం- 87వ ర్యాంక్‌

  10. ఆకునూరి నరేశ్- 117వ ర్యాంక్

  11. అరుగుల స్నేహ- 136వ ర్యాంక్‌

  12. గడిగె వినయ్‌కుమార్‌- 151వ ర్యాంక్‌

  13. దివ్యాన్షు శుక్లా- 153వ ర్యాంక్

  14. కన్నెధార మనోజ్‌కుమార్‌- 157వ ర్యాంక్‌

  15. బి చైతన్య రెడ్డి- 161వ ర్యాంక్

  16. దొంతుల జీనత్‌ చంద్ర- 201వ ర్యాంక్‌

  17. సాస్యరెడ్డి- 214వ ర్యాంక్‌

  18. కమలేశ్వర్‌రావు- 297వ ర్యాంక్

  19. నల్లమోతు బాలకృష్ణ- 420వ ర్యాంక్

  20. ఉప్పులూరి చైతన్య- 470వ ర్యాంక్

  21. మన్యాల అనిరుధ్‌- 564వ ర్యాంక్

  22. బిడ్డి అఖిల్‌- 566వ ర్యాంక్

  23. రంజిత్‌కుమార్‌- 574వ ర్యాంక్

  24. పాండు విల్సన్‌‌- 602వ ర్యాంక్

  25. బాణావత్‌ అరవింద్‌‌- 623వ ర్యాంక్

  26. బచ్చు స్మరణ్‌రాజ్‌‌- 676వ ర్యాంక్  


Also Read: Nepal Plane Crash: నేపాల్ విమాన ప్రమాదం అప్‌డేట్- 14 మృతదేహాలు లభ్యం


Also Read: PM Cares Fund: 'ఓ కుటుంబ సభ్యుడిగా ఇదంతా చేస్తున్నా'- పీఎం కేర్స్ ఫర్ చిల్డ్రన్ పథకానికి మోదీ శ్రీకారం