బ్రిటన్‌లోని గ్లూసెస్టర్‌లోని ఓ ఆసుపత్రి.. హడావుడిగా ఓ వ్యక్తి వచ్చాడు. నొప్పితో బాధపడుతున్న అతడిని చూసిన వైద్యులు ఏమైందని అడిగారు. ఆ వ్యక్తి చెప్పిన సమాధానం విని ఒక్కసారిగా షాక్ గు గురయ్యారు.  తన మలద్వారంలో మందు గుండు సామగ్రి ఇరుక్కుపోయిందని అతడు తెలిపాడు. అయితే బాధితుడికి చికిత్స చేయడానికి ముందుకు వచ్చిన వైద్యులకు ఓ సందేహం వచ్చింది. ఒకవేళ మందుగుండు సామగ్రి పేలిపోతే అందరికీ ప్రమాదమేనని..  బాంబ్ స్క్వాడ్‌ను ఆసుపత్రికి రప్పించారు.


ప్రైవేటు ఆయుధశాలను శుభ్రం చేస్తుండగా.. జారిపోయి.. మందు గుండు సామగ్రిపై పడిపోయినట్టు బాధితుడు చెప్పాడు. దీంతో అది చొచ్చుకుని పోయినట్టు వెల్లడించారు. అప్రమత్తమైన వైద్యులు అతడిని అత్యవసర విభాగానికి తీసుకెళ్లారు. సుమారు 2 అంగుళాల పరిమాణం ఉన్న దానిని తీయడం వైద్యులకు కష్టతరంగా మారింది. ఎలాగోలా అతడి మలద్వారం నుంచి.. మందుగుండు సామగ్రిని తీసేశారు. అక్కడకు వచ్చిన బాంబ్ స్క్వాడ్ దానితో ఎలాంటి ప్రమాదం లేదని చెప్పారు. 


మందుగుండు సామగ్రి రెండో ప్రపంచ యుద్ధం నాటిదని గుర్తించారు. పాత జ్ఞాపకాలను పదిలంగా భద్రపరుచుకునేందుకే ఆ వ్యక్తి ప్రైవేటు ఆయుధశాలను ఏర్పాటు చేసుకున్నట్లు తెలిసింది.


ఈ విషయం తెలిసిన పోలీసులు అక్కడకు వచ్చారు. అప్పటికే అతడి మలద్వారం నుంచి మందుగుండు సామగ్రిని బయటకు తీశారు. బాంబ్ స్క్వాడ్.. దానితో ప్రమాదం లేదని నిర్ధారించరని పోలీసు తెలిపారు. అందువల్లే ఎలాంటి ప్రమాదం లేదని చెప్పారు.  అది ట్యాంకర్లను బ్లాస్ట్ చేసేందుకు ఉపయోగించే మందుగుండు సామగ్రి అని.. ఓ ఆర్మీ అధికారి వివరించారు. సీసంతోపాటు ఇతర మందుగుండు సామగ్రితో తయారు చేశారని వెల్లడించారు. అయితే అది చాల కాలం కిందటిదని.. జడమైన లోహం కావండతో ప్రాణాలకు ఎలాంటి ప్రమాదం లేదని చెప్పారు. 


Also Read: కాసేపట్లో పెళ్లి.. వాంతి చేసుకున్న పెళ్లి కుమార్తె.. చివరకు వరుడు ఏమన్నాడంటే..


Also Read: విమానంలో పిల్లి పిల్లకు రొమ్ము పాలిచ్చిన మహిళ.. ప్రయాణికులు షాక్


Also Read: 'రండి బాబు రండి.. రూ.2 కోట్లు విలువ చేసే ఇల్లు రూ.100కే ఇచ్చేస్తాం'


Also Read: మాజీ సీఎం కొణిజేటి రోశయ్య రేర్ ఫొటోస్.. ప్రముఖులతో జ్ఞాపకాలు ఇవిగో..


Also Read: ఇమ్రాన్ ఖాన్ రాజ్యంపై 'కట్టప్పల' తిరుగుబాటు.. పాక్ పరువు తీసిన ఉద్యోగులు!


Also Read: ఒమిక్రాన్‌పై షాకింగ్ నిజాలు.. డెల్టా కంటే ఆ విషయంలో మూడు రెట్లు ఎక్కువట!


ఇంట్రస్టింగ్‌ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్‌ చేయండి