Australia Elections: ఆస్ట్రేలియాలో దశాబ్ద కాలంగా అధికారంలో ఉన్న కన్జర్వేటివ్‌ పరిపాలనకు తెరపడింది. ప్రతిపక్ష లేబర్‌ పార్టీ అభ్యర్థులు అత్యధిక స్థానాల్లో గెలుపొందారు. లేబర్‌ పార్టీ అధ్యక్షుడు ఆంటోనీ అల్బనీస్‌ తదుపరి ప్రధాన మంత్రి పదవి చేపట్టనున్నారు. ప్రస్తుత ప్రధాని స్కాట్‌ మారిసన్‌ తన ఓటమిని అంగీకరించారు. 


ఇవే కారణాలు


గత మూడేళ్లలో కరోనా విజృంభణ, వాతావరణ మార్పులు కారణంగా ఏర్పడిన విపత్తుల్ని ఎదుర్కోవడంలో అధికార పార్టీ వైఫల్యం ప్రజల్లో వ్యతిరేకతను పెంచింది.  మూడేళ్లకి ఒకసారి జరిగే పార్లమెంటు ఎన్నికల్లో అధికార కన్జర్వేటివ్‌ సంకీర్ణ కూటమిపై లేబర్ పార్టీ స్పష్టమైన మెజార్టీని కనబరిచింది.  2007 తర్వాత లేబర్‌ పార్టీ తొలిసారిగా ఎన్నికల్లో విజయం సాధించింది. ఆ పార్టీ నేత ఆంటోనీ అల్బనీస్‌ ప్రధాన మంత్రిగా బాధ్యతలు చేపట్టనున్నారు.


మోదీ అభినందనలు










ప్రధానిగా బాధ్యతలు చేపట్టనున్న ఆంటోనీ అల్బనీస్‌కు భారత ప్రధాని నరేంద్ర మోదీ అభినందనలు తెలిపారు. అల్బనీస్ ప్రభుత్వంతో పనిచేసేందుకు ఆసక్తిగా ఎదురుచూస్తున్నానన్నారు. ఇండో- పసిఫిక్ ప్రాంతంలో ఇరుదేశాల ప్రయోజనాలపై కలిసికట్టుగా ముందుకు సాగుదామని పిలుపునిచ్చారు.


ఆస్ట్రేలియా నూతన ప్రధానిగా ఎన్నికైన అల్బనీస్ 1991లోనే భారత్​లో పర్యటించారు. 2018లో పార్లమెంటరీ బృందానికి ఆయన నేతృత్వం వహించారని దిల్లీలోని ఆస్ట్రేలియా హైకమిషనర్ బారీ ఒఫరెల్ తెలిపారు. భారత్- ఆస్ట్రేలియా సంబంధాలను ఆయన మరింత పటిష్ఠం చేస్తారని విశ్వాసం వ్యక్తం చేశారు.


Also Read: Amit Shah In Arunachal Pradesh: రాహుల్ బాబా ఆ ఇటలీ కళ్లద్దాలు తీస్తే అన్నీ కనిపిస్తాయి: అమిత్ షా


Also Read: Covid 19 in North Korea: ఉత్తర కొరియాలో కరోనా విలయతాండవం- ఒక్కరోజులో లక్షా 86 వేల కేసులు!