Amit Shah In Arunachal Pradesh: కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీపై కేంద్ర హోంమంత్రి అమిత్ షా సెటైర్లు వేశారు. రాహుల్ గాంధీ తన ఇటాలియన్ కళ్లద్దాలు తీసి చూస్తే ప్రధాని నరేంద్ర మోదీ చేసిన అభివృద్ధి కనిపిస్తుందని వ్యంగ్యాస్త్రాలు సంధించారు. అరుచాల్ ప్రదేశ్ పర్యటనలో భాగంగా ఏర్పాటు చేసిన బహిరంగ సభలో అమిత్ షా ఈ వ్యాఖ్యలు చేశారు.
అరుణాచల్ ప్రదేశ్ నమ్‌సాయి జిల్లాలోని రూ.1000 కోట్లతో చేపడుతున్న అభివృద్ధి ప్రాజెక్టుల అమిత్ షా శంకుస్థాపన చేశారు. మౌలిక వసతుల కల్పన, శాంతి భద్రతల పరిరక్షణ, పర్యటక రంగాన్ని ప్రోత్సహించడంతో సహా ఎనిమిదేళ్లలో ఎన్నో అభివృద్ధి పనులు చేశామని అమిత్ షా అన్నారు.
రెండు రోజుల పర్యటన నిమిత్తం ఆయన అరుణాచల్ ప్రదేశ్ వచ్చారు. నమసాయ్ జిల్లాలోని గోల్డెన్ పగోడాను ఆదివారం ఉదయం సందర్శించారు. ఈ కార్యక్రమంలో అమిత్ షాతో పాటు పెమా ఖండూ, కేంద్ర న్యాయశాఖ మంత్రి కిరణ్ రిజిజు కూడా పాల్గొన్నారు.
Also Read: Covid 19 in North Korea: ఉత్తర కొరియాలో కరోనా విలయతాండవం- ఒక్కరోజులో లక్షా 86 వేల కేసులు!
Also Read: PM Modi: థామస్ కప్ గెలిచిన టీంతో ప్రధాని చిట్‌చాట్- దేశం గర్వపడేలా చేశారని కితాబు