అప్ఘానిస్థాన్ ను స్వాధీనం చేసుకున్నాక.. తాలిబన్లకు చెందిన అనేక వీడియోలు బయటకొచ్చాయి. అవి చూస్తుంటే.. అసలు తాలిబన్లు ఇంత చిన్నపిల్లల్లా చేస్తున్నారేంటని అందరికీ ఆలోచన కలిగింది. చంపడం.. రక్తపాతంతో పాటు వాళ్లలో హాస్యం కూడా ఉందా అని.. నెటిజన్లు తెగ సెటైర్లు వేశారు. ఆఫీసుల్లో డ్యాన్స్ చేసిన వీడియోలు.. జీమ్ లో ఆడుకోవడం లాంటి ఎన్నో వీడియోలు బయటకొచ్చాయి. ఇప్పుడేం చేశారో తెలుసా.. ఈ తాలిబన్లు.. ఏకంగా విమానానికి.. తాడు కట్టి.. ఊయల ఊగేశారు. ఇప్పుడు ఆ వీడియో బయటకొచ్చింది నెటిజన్లు తెగ కామెంట్లు పెడుతున్నారు. షేర్లు చేస్తున్నారు.


ఇదేంటీ.. వీళ్లు తాలిబన్లేనా.. లేక చిన్నాపిల్లల్లా.. అసలు వీళ్లకు మైండ్ ఉందా అని కొందరు కామెంటుతున్నారు. గాలిలో ప్రయాణించే.. విమానం.. నేల మీద ఉంటే.. ఇలా తాడుకట్టి ఊగాలానే  గొప్ప సత్యాన్ని చెప్పారని.. కొంతమంది ఫన్నీ కామెంట్ చేస్తున్నారు.  


సోషల్ మీడియాలో వైరల్ అయిన వీడియోను చైనా అధికారి ఒకరు షేర్ చేశారు. వీడియోలో, తాలిబాన్లు ఆర్మీ విమానానికి తాడు కట్టి దానిపై ఊగుతున్నారు. ఒకతను స్వింగ్ మీద కూర్చుంటే, మరొ ఇద్దరు ఊపుతున్నారు.  


 






తాలిబన్ల అప్ఘాన్ ను స్వాధీనం చేసుకున్న తర్వాత పౌరులు  అక్కడ నివసించడం కష్టంగా మారింది. షరియా చట్టాన్ని తిరిగి అమలు చేసిన తరువాత, అక్కడ మహిళలు మరియు బాలికల జీవితం నరకంగా మారింది. కొత్త నిబంధనల ప్రకారం, అబ్బాయిలు, బాలికలు ఆఫ్ఘనిస్తాన్‌లో కలిసి చదువుకోలేరు. ఇది కాకుండా ప్రభుత్వ ఉద్యోగులు అన్ని సౌకర్యాలను తిరిగి ఇవ్వవలసి వచ్చింది ఇలా ఎన్నో మార్పులు వచ్చాయి.


అమెరికాపై సెప్టెంబర్‌ 11 దాడులు జరిగిన రోజే అధికార దినోత్సవంగా నిర్వహించాలన్న ఆలోచనలో ఉన్నారు తాలిబన్లు. సెప్టెంబర్‌ 11వ తేదీన భారీగా విజయోత్సవాలు నిర్వహించాలని డిసైడ్‌ అయ్యారు. అలా చేసి అమెరికాకు ఓ సవాల్‌ విసిరే ఆలోచనతో తాలిబన్ల కొత్త ప్రభుత్వం ఉన్నట్టు అనిపిస్తోంది. చనిపోయిన వాళ్ల మీద కూడా తమ కసి తీర్చుకుంటున్నారు తాలిబన్లు. పంజ్‌షేర్‌ సింహం అహ్మద్‌షా మసూద్‌ సమాధిని ధ్వంసం చేసి తమ ఉన్మాదాన్ని చాటుకున్నారు. సెప్టెంబర్ 9 తేదీని అహ్మద్‌షా మసూద్‌ వర్ధంతిగా జరుపుకుంటారు పంజ్‌షేర్‌ ప్రజలు . సోవియట్‌ సేనలతో పాటు తాలిబన్లను ఎదురించిన మొనగాడి సమాధిని ధ్వంసం చేశారు వారు. 


Also Read: Afghanistan Crisis: అఫ్గాన్‌లో అల్లకల్లోలం.. తాలిబన్ ప్రభుత్వ ఏర్పాటుతో ఉద్రిక్తత.. నిరసనలో ఇద్దరు మృతి..