Philadelphia Gunfire: అమెరికాలో వరుస కాల్పుల ఘటనలు తీవ్ర ఆందోళనకు గురి చేస్తున్నాయి. తాజాగా ఫిలడెల్ఫియాలో శనివారం జరిగిన కాల్పుల్లో ముగ్గురు మరణించారు. 11 మంది వరకు గాయపడ్డారు.






ఇదీ జరిగింది


డౌన్‌ టౌన్‌లో జనం ఎక్కువగా గుమికూడిన చోట ఓ దుండగుడు కాల్పులు జరిపాడు. ఈ కాల్పుల్లో ముగ్గురు అక్కడికక్కడే మృతి చెందారని, కనీసం 11 మంది గాయపడ్డారని ఫిలడెల్ఫియా పోలీస్ డిపార్ట్‌మెంట్ తెలిపింది. వారాంతం కావడంతో వందలాది మంది జనం సౌత్‌ స్ట్రీట్‌లోకి వచ్చినట్లు పేర్కొంది.


ఈ ఘటనలో ఇప్పటి వరకు ఎవరినీ అరెస్టు చేయలేదని, రెండు ఆయుధాలు స్వాధీనం చేసుకున్నట్లు అధికారులు పేర్కొన్నారు. కాల్పులకు కారణాలు ఇంకా తెలియలేదు. 


మే నెలలో


మే చివరి వారంలో టెక్సాస్ కాల్పులతో దద్దరిల్లింది. టెక్సాస్‌లోని ఓ పాఠశాలలో జరిగిన కాల్పుల్లో 18 మంది చిన్నారులు సహా మొత్తం 21 మంది మరణించారు. అమెరికా టెక్సాస్‌ రాష్ట్రంలోని ఓ ప్రైమరీ స్కూలులో ఓ టీనేజర్ కాల్పులు జరిపాడు. పాఠశాలలో ఉన్న 18 మంది చిన్నారులు మృతి చెందగా, మరో ముగ్గురు కూడా ప్రాణాలు కోల్పోయారు. ఈ దాడిలో పలువురు గాయపడ్డారు. వెంటనే స్పందించిన పోలీసులు జరిపిన ఎదురుకాల్పుల్లో దుండగుడు హతమయ్యాడు.


గతంలో జరిగిన తుపాకీ కాల్పులు



  • 2012- న్యూ టౌన్‌లోని శాండీ హుక్ స్కూల్‌పై దాడి, కాల్పుల్లో 26 మంది మృతి

  • 2016 - టెక్సాస్ ఆల్పైన్ స్కూల్ కాల్పుల్లో ఒక విద్యార్థి మరణించాడు

  • 2018- టెక్సాస్‌లోని సెయింట్ ఫే స్కూల్‌లో కాల్పులు, 17 ఏళ్ల బాలుడు కాల్పులు జరిపాడు, 10 మంది మరణించారు.

  • 2021 - టెక్సాస్‌లోని టింబర్‌వ్యూ స్కూల్‌లో కాల్పులు, కాల్పుల్లో పలువురు గాయపడ్డారు.

  • 2022 - టెక్సాస్ ప్రాథమిక పాఠశాలలో కాల్పులు, 14 మంది పిల్లలు, ఒక ఉపాధ్యాయుడు మరణించారు, 18 ఏళ్ల నిందితుడైన వ్యక్తిని హతమార్చారు.


Also Read: Killings Of Kashmiri Pandits: 'కశ్మీర్ సమస్య తీర్చడం భాజపా తరం కాదు- కావాల్సింది మీటింగ్‌లు కాదు, చర్యలు'


Also Read: Indian currency: ఇకపై కరెన్సీ నోట్లపై గాంధీతో పాటు ఆ ఇద్దరు- ఆర్‌బీఐ కీలక నిర్ణయం!