Killings Of Kashmiri Pandits: 'కశ్మీర్ సమస్య తీర్చడం భాజపా తరం కాదు- కావాల్సింది మీటింగ్‌లు కాదు, చర్యలు'

ABP Desam Updated at: 05 Jun 2022 06:50 PM (IST)
Edited By: Murali Krishna

Killings Of Kashmiri Pandits: కశ్మీరీ పండిట్లకు రక్షణ కల్పించడంలో భాజపా విఫలమైందని దిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ అన్నారు.

'కశ్మీర్ సమస్య తీర్చడం భాజపా తరం కాదు- కావాల్సింది మీటింగ్‌లు కాదు, చర్యలు'

NEXT PREV

Killings Of Kashmiri Pandits: మోదీ సర్కార్‌పై దిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ ఫైర్ అయ్యారు. కశ్మీర్​లో వరుస హత్యలపై కేజ్రీవాల్ మండిపడ్డారు​. కశ్మీర్​లో ఏదైనా హత్య జరిగితే హోం మంత్రి అత్యవసర సమావేశం నిర్వహిస్తారని, కానీ తమకు కావాల్సింది మీటింగ్‌లు కాదు, చర్యలని కేజ్రీవాల్ అన్నారు. దిల్లీ జంతర్​ మంతర్​లో ఆమ్​ ఆద్మీ పార్టీ నిర్వహించిన 'జన్​ ఆక్రోశ్​ ర్యాలీ'లో కేజ్రీవాల్ ఈ వ్యాఖ్యలు చేశారు.







కశ్మీరీ పండిట్లు లక్ష్యంగా జరుగుతున్న దాడులను అరికట్టేందుకు కేంద్రం స్పష్టమైన ప్రణాళికతో రావాలి. ఉగ్రదాడులతో కశ్మీరీ పండిట్లు బలవంతంగా తమ ఇళ్లను, లోయను విడిచిపెట్టాల్సి వస్తోంది. 1990ల నాటి పరిణామాలు పునరావృతమవుతున్నాయి. కశ్మీర్​ సమస్యను తీర్చడం భాజపా తరం కాదు. వారికి బురద రాజకీయాలు చేయడం మాత్రమే తెలుసు. దయచేసి కశ్మీర్​పై రాజకీయాలు చేయొద్దు. కశ్మీర్​లో ఏదైనా హత్య జరిగితే హోం మంత్రి అత్యవసర సమావేశం నిర్వహిస్తారు. మాకు మీటింగ్​లు వద్దు. చర్యలు కావాలి. కశ్మీర్​ కూడా అదే కోరుకుంటోంది. కశ్మీర్​ సమస్య పరిష్కారానికి కేంద్రం ఎలాంటి ప్రణాళిక రూపొందించిందో కేంద్రం, ప్రజలకు తెలియజేయాలి.                                                             - అరవింద్ కేజ్రీవాల్, దిల్లీ సీఎం


ఈ సందర్భంగా కేజ్రీవాల్.. కేంద్రం ముందు నాలుగు డిమాండ్లు ఉంచారు.



  1. ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా కార్యాచరణ ప్రణాళిక రూపొందించాలని కోరారు.

  2. కశ్మీర్ వెలుపల పనిచేయకుండా కశ్మీర్ పండిట్లతో సంతకాలు చేయించుకున్న బాండ్‌లు రద్దు చేయాలన్నారు.

  3. కశ్మీర్ పండిట్ల డిమాండ్లు నెరవేర్చాలన్నారు.

  4. కశ్మీర్ పండిట్లకు భద్రత కల్పించాలని డిమాండ్ చేశారు.


కశ్మీర్ విషయంలో పాక్ కుటిల రాజకీయాన్ని మానుకోవాలని కేజ్రీవాల్ హెచ్చరించారు. కశ్మీర్ ఎప్పటికీ భారత్‌లో అంతర్భాగమేనన్నారు. 


Also Read: Indian currency: ఇకపై కరెన్సీ నోట్లపై గాంధీతో పాటు ఆ ఇద్దరు- ఆర్‌బీఐ కీలక నిర్ణయం!


Also Read: Yogi Adityanath Birthday: హాఫ్ సెంచరీ కొట్టిన యూపీ సీఎం యోగి- ప్రధాని మోదీ ప్రత్యేక శుభాకాంక్షలు

Published at: 05 Jun 2022 06:43 PM (IST)

- - - - - - - - - Advertisement - - - - - - - - -

© Copyright@2024.ABP Network Private Limited. All rights reserved.