Yogi Adityanath Birthday: హాఫ్ సెంచరీ కొట్టిన యూపీ సీఎం యోగి- ప్రధాని మోదీ ప్రత్యేక శుభాకాంక్షలు

ABP Desam   |  Murali Krishna   |  05 Jun 2022 04:59 PM (IST)

Yogi Adityanath Birthday: యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్‌కు రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్, ప్రధాని నరేంద్ర మోదీ సహా పలువురు ప్రముఖులు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు.

హాఫ్ సెంచరీ కొట్టిన యూపీ సీఎం యోగి- ప్రధాని మోదీ ప్రత్యేక శుభాకాంక్షలు

Yogi Adityanath Birthday: ఉత్తర్‌ప్రదేశ్‌ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ ఆదివారం తన 50వ పుట్టిన రోజును జరుపుకుంటున్నారు. దేశంలో పలువురు ప్రముఖులు ఆయనకు జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. యోగి పుట్టినరోజు సందర్భంగా ప్రధాని నరేంద్ర మోదీ ప్రత్యేకంగా శుభాకాంక్షలు తెలిపారు.  

ఉతరప్రదేశ్ ముఖ్యమంత్రి, డైనమిక్‌ సీఎం యోగి ఆదిత్యనాథ్‌కు జన్మదిన శుభాకాంక్షలు. యోగి ఆదిత్యనాథ్ సమర్థవంతమైన నాయకత్వంలో యూపీ ప్రగతి పథంలో కొత్త శిఖరాలకు చేరుకుంది. రాష్ట్ర ప్రజలకు ఆయన ప్రజానుకూల పాలన అందిస్తున్నారు. ప్రజాసేవలో ఆయన ఆయురారోగ్యాలతో జీవించాలి.                                                       -  ప్రధాని నరేంద్ర మోదీ 

భారత రాష్ట్రపతి రామ్‌నాథ్‌ కోవింద్‌తో పాటు, పలువురు కేంద్ర మంత్రులు సీఎం యోగికి శుభాకాంక్షలు తెలిపారు.

Also Read: Tamil Nadu: డెలివరీ బాయ్‌ను కొట్టిన కానిస్టేబుల్- వీడియో వైరల్, చివరికి ఏమైందంటే!

Also Read: Corona Cases: దేశంలో కొత్తగా 4,270 కరోనా కేసులు- 15 మంది మృతి

Published at: 05 Jun 2022 04:56 PM (IST)
© Copyright@2026.ABP Network Private Limited. All rights reserved.