Indian currency: భారత కరెన్సీ నోట్లపై మహాత్మా గాంధీ ఫొటో తప్ప ఇంకెవర్నీ ఇప్పటివరకు మనం చూడలేదు. అయితే త్వరలో మరో ఇద్దరు ప్రముఖుల ఫొటోలను కూడా కరెన్సీ నోట్లపై చూడబోతున్నాం. అవును.. ఈ మేరకు భారతీయ రిజర్వ్ బ్యాంకు భావిస్తున్నట్లు సమాచారం.





ఎవరంటే?


త్వరలో దేశానికి చెందిన మరో ఇద్దరు ప్రముఖుల ఫొటోలను కూడా నోట్లపై ముద్రించాలని రిజర్వ్ బ్యాంకు ఆఫ్ ఇండియా భావిస్తోంది. ఇందులో ఒకరు బంగాల్‌కు  చెందిన విశ్వకవి రవీంద్రనాథ్ ఠాగూర్, మరొకరు మిస్సైల్ మ్యాన్, భారత మాజీ రాష్ట్రపతి ఏపీజే అబ్దుల్ కలాం. కొత్తగా ఆర్‌బీఐ విడుదల చేయనున్న కొన్ని డినామినేషన్ బ్యాంకు నోట్లపై ఈ ఇద్దరి ఫొటోలను ముద్రించాలని నిర్ణయించినట్లు సమాచారం. కేంద్ర ఆర్థిక శాఖ, రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా సంయుక్తంగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిసింది.


అన్నీ కాదు


వీరి ఫొటోలను కొన్ని డినామినేషన్ నోట్లపై మాత్రమే ముద్రించనున్నారు. మహాత్మా గాంధీ ఫొటోలతో కూడా ఇప్పటిలానే కరెన్సీ చలామణి అవుతుంది. కరెన్సీ నోట్లపై ప్రముఖల ఫొటోలను ముద్రించేందుకు ఉన్న సాధ్యాసాధ్యాలను, అవకాశాలను అన్వేషిస్తున్నామని, ఆ అన్వేషణలో భాగంగానే ఈ యోచన చేస్తున్నట్లు ఆర్‌బీఐ తెలిపింది. మన దేశంలో కరెన్సీ నోట్లపై ఆది నుంచి మహాత్మా గాంధీ ఫొటో మాత్రమే ఉంది.


ఆర్‌బీఐ, కేంద్ర ఆర్థిక శాఖ పరిధిలో ఉండే సెక్యూరిటీ ప్రింటింగ్ అండ్ మింటింగ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా(SPMCIL) గాంధీ, ఠాగూర్, కలాం వాటర్‌మార్క్స్‌ను రెండు సెపరేట్ సెట్స్‌గా ఐఐటీ- దిల్లీ ఫ్రొఫెసర్ దిలీప్ టీ సహానీకి పంపించింది. ఆ రెండు సెట్స్‌లో ఎంపిక చేసి తుది ఆమోదం కోసం కేంద్ర ప్రభుత్వానికి పంపినట్లు ఆయన చెప్పారు. ప్రొఫెసర్ సహానీ వాటర్‌మార్క్స్‌ను అధ్యయనం చేయడంలో నిపుణులు. 


Also Read: Yogi Adityanath Birthday: హాఫ్ సెంచరీ కొట్టిన యూపీ సీఎం యోగి- ప్రధాని మోదీ ప్రత్యేక శుభాకాంక్షలు


Also Read: Tamil Nadu: డెలివరీ బాయ్‌ను కొట్టిన కానిస్టేబుల్- వీడియో వైరల్, చివరికి ఏమైందంటే!