ఉక్రెయిన్‌, రష్యా మధ్య 24 రోజులుగా భీకర యుద్ధం సాగుతోంది. ఉక్రెయిన్ రాజధాని కీవ్ ను చేజిక్కించుకునేందుకు తీవ్రంగా ప్రయత్నిస్తున్న రష్యన్ దళాలు.. తమ దాడులను మరింత ఉధృతం చేశాయి. కీవ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ శివార్లలో మిసైళ్ల దాడులను, షెల్లింగ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ను మరింతగా పెంచాయి. మరోవైపు పశ్చిమాన ఉన్న లవీవ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ సిటీపైనా బాంబుల వర్షం కురిపించాయి. కీవ్, ఖార్కివ్, ఒడెస్సా.. ఇలా ప్రతి చోట తెల్లవారుజాము నుంచే ఎయిర్ రెయిడ్ సైరన్లు మారుమోగాయి. బాంబులతో ఆయా ప్రాంతాలు దద్దరిల్లాయి. ఇప్పటిదాకా రష్యా వెయ్యికి పైగా మిసైళ్లను ఉక్రెయిన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో ఫైర్ చేసి ఉండొచ్చని అమెరికా అంచనా వేసింది. 


రష్యా అత్యంత దారుణంగా దాడులు కొనసాగిస్తూనే ఉంది. అక్కడి అంతర్జాతీయ జర్నలిస్టులు.. పరిస్తితిని తెలిపే వీడియోలను సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తున్నారు. ఓ జర్నలిస్టు ట్విట్టర్‌లో పోస్ట్ చేసిన ఈ వీడియో అక్కడి తాజా పరిస్థితిని తెలియచేస్తుంది. 


 





రష్యా పలు చోట్ల ఉక్రెయిన్ భూభాగాల్ని ఆక్రమించుకుంటోంది., సోవియట్ గీతాన్ని ఆలపిస్తూ.. ఆక్రమించినట్లుగా ప్రకటిస్తోంది. ఈ  దృశ్యాలు కూడా ఉక్రెనియన్లు సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తున్నారు. 


 





ఉక్రెయిన్‌లో ఎక్కడ చూసినా రష్యా  మిస్సైల్స్ చేసిన విధ్వంస దృశ్యాలే కనిపిస్తున్నాయి. 


 





ఉక్రెయిన్‌కు పెద్దఎత్తున ఇతర దేశాలు సాయం అందిస్తున్నాయి. లిధువేనియా ప్రజలు తమ కార్లను ఇచ్చేస్తున్నారు . ఈ కార్లు ఉక్రెయిన్ సరిహద్దుల్లో వేల సంఖ్యలో ఉన్నాయి.






యుద్ధ కారణంగాఅక్కడ దారుణమైన దృశ్యాలే కాదు.. మనసు కదిలించే ఎన్నో సంఘటనలకు సాక్ష్యాలూ లభిస్తున్నాయి. మానవత్వం అంటే ఏమిటో వాటిని చూసినప్పుడే తెలుస్తుంది. 


 





రోజులు గడిచిపోతున్నాయి... బాంబులు పేలుతూనే ఉన్నాయి. కానీ యుద్ధానికి అంతం ఎప్పుడో ఎవరికీఅర్థం కావడం లేదు.