అది 2020. బెల్జియంలోని ఆంటెవెర్స్ సమీపంలో ఉన్న హెరెంటల్స్ ఉన్న ఓ ఇల్లు. సైలైన్స్‌లో ఎంత వయోలెన్స్ ఉంటుందో అన్నంత సైలెంట్‌గా ఉంది. ఏదో తెలియని భయం వెంటాడుతూండగా.. ఆ ఇంట్లోకి వెళ్లి తొంగి చూశారు కొంత మంది. ఓ మహిళ ఒంటి నిండా కత్తి పోట్లతో.. కనిపించింది. అంతే వాళ్లు కెవ్వుమన్నారు. కాసేపటికి పోలీసులు వచ్చారు. అన్ని ఆధారాలను సేకరించారు. ఇక హంతకుడెవరు అనే దర్యాప్తు ప్రారంభించారు. ప్రాథమిక ఆధారాలను బట్టి చంపింది దొంగ కాదు అని నిర్ధారించుకున్నారు..ఎందుకంటే ఆ ఇంట్లో ఎలాంటి దోపిడీ జరగలేదు. ఇక అప్పట్నుంచి పోలీసులు వేట ప్రారంభించారు. ఆమెకు ఎవరెవరు శత్రువులు ఉన్నారు..? ఎవరితో గొడవలు ఉన్నాయని ఆరా తీశారు. కానీ ఒక్క క్లూ కూడా దొరకలేదు. ఆమెతో ఎవరికీ గొడవల్లేవు.. వివాదాల్లేవు..పైగా ఆమె టీచర్ . దాంతో ఆ హత్య కేసు ఛేదించడం పోలీసులకు సవాల్‌గా మారింది.
అనుమానితుల డిఎన్‌ఎలను పరిష్కరించినా నిందితుడు దొరకలేదు. చివరకు ఆమె భర్త .. ఈ హత్య ఎవరైనా చూస్తే చెప్పాలంటూ సాక్షుల కోసం బహిరంగ విజ్ఞప్తి చేశారు. దాదాపుగా రెండేళ్ల పాటు ఎవరికీ హంతుకుడు ఎవరో ఎవరికీ తెలియదు. కానీ ఓ వ్యక్తి.. ఇలా తాను ఓకామెను చపానని తన స్నేహితుడుకి చెప్పుకున్నాడు. ఆ స్నేహితుడికి భయం వేసి ఆ సమాచారాన్ని పోలీసులకు ఇచ్చాడు. అంతే నిందితుడ్ని పోలీసులు అరెస్టు చేశారు. ఎందుకు చంపాడో అని ఆరా తీస్తే పోలీసులకు మైండ్ బ్లాంక్ అయింది.
హత్యకు గురైన మహిళ దగ్గర గుంటర్ ఉవెంట్స్ ప్రాథమిక విద్యాభ్యాసం చేశాడు. యూకేజీలో ఉన్నప్పుడు అంటే ఏడేళ్ల వయసులో ఉన్నప్పుడు టీచర్ ఉవెంట్స్ ను తిట్టింది. దాన్ని అవమానంగా ఫీలయ్యాడు ఉవెంట్స్. అంతే మనసులో ఉంచుకున్నాడు. ముఫ్పై ఏళ్ల తర్వాత ప్రతీకారం తీర్చుకునేందుకు ... ఆ టీచర్ ఒంటరిగా ఇంట్లో ఉన్న సమయంలో దాడి చేశాడు. ఆమెను అత్యంత కిరాతకంగా 101 సార్లు పొడిచి చంపాడు. అవమానం తట్టుకోలేక 30 ఏళ్ల తర్వాత ఆమెను హత్యచేసినట్లు అంగీకరించాడని బెల్జియం పోలీసులు ప్రకటించారు.
సాధారణంగా ఆరేడేళ్ల వయసులో ఉన్న వారు ఇలాంటి ఘటనలు మర్చిపోతారు. కానీ ప్రతీకారంతో రగిలిపోయిన ఉవెంటర్స్ ముఫ్పై ఏళ్ల తర్వాత కూడా అదే కసితో పెట్టుకుని టీచర్‌ను చంపేశాడు. ఈ ఘటన బెల్జియంలో సంచలనం సృష్టించింది. గుంటర్ ఉవెంట్స్ తన నేరాన్ని అంగీకరించాడంతో కేసు మిస్టరీ వీడిపోయినట్లయింది.